عن سعد بن أبي وقاص رضي الله عنه قال: سمعت رسول الله صلى الله عليه وسلم يقول:
«إِنَّ اللهَ يُحِبُّ الْعَبْدَ التَّقِيَّ الْغَنِيَّ الْخَفِيَّ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2965]
المزيــد ...
సాద్ బిన్ అబీ వఖ్ఖాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించగా నేను విన్నాను:
“నిశ్చయంగా దైవభీతిపరుడిని, భయభక్తులు కలవాడిని, (అనవసరమైన) వాంఛలు, కోరికలు లేని వాడిని, మరియు గుంభనముగా ఉండేవాడిని అల్లాహ్ ప్రేమిస్తాడు”.
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2965]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ తన దాసులలో కొంతమందిని ప్రేమిస్తాడు అని తెలియ జేస్తున్నారు.
వారిలో అల్లాహ్ పట్ల దైవభీతి కలవాడు మరియు భయభక్తులు కలవాడు. అతడు అల్లాహ్ యొక్క ఆదేశాలకు అనుగుణంగా జీవిస్తాడు, అల్లాహ్ ప్రకటించిన నిషేధాలకు దూరంగా ఉంటాడు.
మరియు సంపన్నుడిని ప్రేమిస్తాడు: అతడు ఎటువంటి సంపన్నుడు అంటే, తనకు కావలసిన దాని కొరకు ప్రజలపై గాక కేవలం అల్లాహ్ పైనే ఆధారపడేవాడు, మరింకెవరి వైపునకూ చూపును మరల్చనివాడు.
మరియు ఆయన గుంభనముగా ఉండే వానిని ప్రేమిస్తాడు: అంటే, వినయము, అణకువ కలిగి తన ప్రభువునే (అల్లాహ్ నే) ఆరాధించే వానిని, తనకు ప్రయోజనం కలిగించే దానిలో మాత్రమే సమయాన్ని వెచ్చించేవాడు (అప్రాధాన్య, అప్రయోజన వ్యవ్హారాలకు దూరంగా ఉండేవాడు), తనను ప్రజలు గుర్తిస్తున్నారా లేదా, తన గురించి వారు ఏమనుకుంటున్నారు, మంచిగా అనుకుంటున్నారా లేక చెడుగా అనుకుంటున్నారా అనే విషయాలను అసలు పట్టించుకోని వాడు.