+ -

عَنْ عَائِشَةَ أُمِّ المؤْمنينَ رَضيَ اللهُ عنها قَالَت:
كَانَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا أَتَى الْمَرِيضَ يَدْعُو لَهُ قَالَ: «أَذْهِبِ الْبَاسَ، رَبَّ النَّاسِ، وَاشْفِ أَنْتَ الشَّافِي، لَا شِفَاءَ إِلَّا شِفَاؤُكَ، شِفَاءً لَا يُغَادِرُ سَقَمًا».

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2191]
المزيــد ...

ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన:
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక రోగిని సందర్శించినప్పుడు, ఆయన ఇలా దువా చేసేవారు: "అద్-హిబిల్-బాస, రబ్బన్నాస్, వష్ఫి, అంత అష్షాఫీ, లా షిఫాఅ’ ఇల్లా షిఫాఉక, షిఫా’అన్ లా యుగాదిరు సఖమా." (ప్రజల ప్రభువా! బాధను తొలగించు. నీవే ఆరోగ్యదాతవు. నీ ఆరోగ్యమే నిజమైన ఆరోగ్యం. నీ ఆరోగ్యం తప్ప మరొకటి లేదు. అలాంటి ఆరోగ్యాన్ని ప్రసాదించు — అది ఎలాంటి వ్యాధినీ మిగల్చకుండా పూర్తిగా నయం చేసే ఆరోగ్యాన్ని ప్రసాదించు."

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 2191]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక రోగిని సందర్శించినప్పుడు ఇలా ప్రార్థించేవారు: "ఓ అల్లాహ్! బాధను, తీవ్రమైన వ్యాధిని తొలగించు. ప్రజల ప్రభువా, వారి సృష్టికర్తా, పోషకుడా! ఈ రోగిని నీవే నయం చేయుము. నీవే, పరమ పవిత్రుడవు, నిజమైన ఆరోగ్యదాతవు. నీ 'అష్షాఫీ' అనే పేరుతో నేను నీకు వేడుకుంటున్నాను. ఈ రోగి కొరకు నీ ఆరోగ్యం తప్ప మరొక ఆరోగ్యం లేదు. నీ ఆరోగ్యం పూర్తిగా వ్యాధిని తొలగించేలా ఉండాలి, ఏ రకమైన వ్యాధి, మరొక అనారోగ్యం మిగలకుండా పూర్తిగా నయం చేయుము."

من فوائد الحديث

  1. అల్లాహ్ మాత్రమే ఆరోగ్యదాత (అష్షాఫీ). వైద్యుడు మరియు మందులు కేవలం సాధనాలు మాత్రమే. అవి అల్లాహ్ అనుమతి లేకుండా లాభం చేకూర్చలేవు, హాని చేయలేవు.
  2. రోగులను సందర్శించడం ముస్లింలలోని హక్కులలో ఒకటి, మరియు కుటుంబ సభ్యుల విషయానికి వస్తే అది మరింత అర్హమైనది.
  3. రోగిని సందర్శించే వారు, రోగి కోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి వచ్చిన ఈ పవిత్రమైన దుఆ చేయాలని ప్రోత్సహించబడింది:
  4. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షరీఅహ్ అనుమతించిన రుక్యా (అంటే ఖుర్ఆన్ వచనాలు మరియు మంచి దుఆలతో చేసే విశ్వాసపూర్వక చికిత్స) ద్వారా చికిత్స చేసేవారు. తాను స్వయంగా వ్యాధికి గురైతే, ఆయనే స్వయంగా తనపై రుక్యా చేసేవారు, తన కుటుంబ సభ్యులపై కూడా రుక్యా చేసేవారు, అలాగే ఇతర రోగులపై కూడా.
  5. రోగికి ఆరోగ్యం కోసం దుఆ చేయడంలో కొంత అస్పష్టత ఉంది. ఎందుకంటే, హదీథుల ప్రకారం, అనారోగ్యం వల్ల పాపాలు క్షమించబడతాయి, (సహనానికి బదులుగా) మంచి ప్రతిఫలం ప్రసాదించబడుతుంది. అయితే, ఆరోగ్యం కోసం ప్రార్థించడం (దుఆ చేయడం) ఈ ప్రతిఫలాన్ని తగ్గించదా? సమాధానం: దుఆ చేయడం కూడా ఒక ఆరాధన. ఇది పాపాల క్షమాపణకు, ప్రతిఫలానికి వ్యతిరేకం కాదు. వ్యాధి మొదట ప్రారంభమైనప్పుడు, ఆ సమయంలో సహనం వహించడం వల్ల పాపాలు క్షమించబడతాయి, మంచి ప్రతిఫలం లభిస్తుంది. దుఆ చేసే వ్యక్తికి రెండు విధాలుగానూ లాభమే: అల్లాహ్ దయచేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే, అతని లక్ష్యం నెరవేరినట్లే. లేదంటే, దుఆ చేసినందుకు, లేదా దాని ద్వారా రక్షణ, మరొక లాభం లభించవచ్చు. ఇవన్నీ అల్లాహ్ కృప వల్లనే జరుగుతుంది.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు స్వాహిలీ తమిళం థాయ్ అస్సామీ الهولندية الغوجاراتية الرومانية المجرية الجورجية
అనువాదాలను వీక్షించండి
ఇంకా