عن عبد الله بن مسعود رضي الله عنه قال: سمعت رسول الله صلى الله عليه وسلم يقول:
«إنَّ الرُّقَى والتَمائِمَ والتِّوَلَةَ شِرْكٌ».
[صحيح] - [رواه أبو داود وابن ماجه وأحمد] - [سنن أبي داود: 3883]
المزيــد ...
అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను:
“నిశ్చయంగా చేతబడి (మంత్రతంత్రాలు), తాయెత్తులు, వశీకరణ మొదలైనవన్నీ బహుదైవారాధనలే”.
[దృఢమైనది] - - [سنن أبي داود - 3883]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని విషయాలను గురించి తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఈ పనులకు పాల్బడితే వారు ‘షిర్క్’నకు పాల్బడినట్లే. అవి:
మొదటిది: అల్-రుఖయ్య: ఇస్లాంకు పూర్వం అఙ్ఞానకాలంలో జబ్బున పడిన వారిని నయం చేయుటకు బహుదైవారాధనకు చెందిన పదాలతో (మంత్రాల లాగా) కొన్ని మాటలు పలుకబడేవి (ఇస్లాం లో ఈ విధంగా బహుదైవారధనకు చెందిన పదాలతో నయం చేయటానికి ప్రయత్నం చేసినట్లయితే అది బహుదైవారాధనగా (“షిర్క్” గా) పరిగణించబడుతుంది).
రెండవది: అల్ తమాఇమ్ (తాయెత్తులు). అవి పూసలతో చేసినవి కావచ్చు లేక ఇంక దేనితో నైనా చేసినవి కావచ్చు: కీడును దూరం చేయడానికి తాయెత్తులను చిన్న పిల్లలకు, జంతువులకు, వాహనాలకు మొదలైన వాటికి కడుతూ ఉంటారు.
మూడవది: అల్-తివాలహ్ (వశీకరణం): ఈ ప్రక్రియను ఒకరి భార్యను మరొకరు వశపరుచు కోవడానికి వాడుతారు.
ఇవి బహుదైవారాధనగా (షిర్క్ గా) పరిగణించబడతాయి. ఎందుకంటే, షరియత్ లో లేని, షరియత్ ఆదేశించని ఒక విషయాన్ని మూలకంగా/సాధనంగా తీసుకుని దానిపై ఆచరించడం జరుగుతున్న ది. దానికి షరియత్ లో ఆధారాలు ఉండవు, అలాగే అది ఙ్ఞానేంద్రియాల ద్వారా అనుభవం లోనికి వచ్చిన విషయం కూడా అయిఉండదు. షరియత్ ఆమోదించిన విధానాలలో ఖుర్’ఆన్ పఠనం, అనుభవం ద్వారా నిరూపణ అయి ఉన్న మందులను ఉపయోగించడం ఉన్నాయి. ఇవి ఆమోద యోగ్యమైనవి, విశ్వాసయోగ్యమైనవి. ప్రయోజనం కలగడం, కలుగకపోవడం, లేదా కీడు కలగడం అనేవి అల్లాహ్ చేతిలోని విషయం.