عَن أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِذَا تَثَاءَبَ أَحَدُكُمْ فَلْيُمْسِكْ بِيَدِهِ عَلَى فِيهِ، فَإِنَّ الشَّيْطَانَ يَدْخُلُ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2995]
المزيــد ...
అబూ సయీద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
మీలో ఎవరైనా ఆవులింత వస్తే, (వెంటనే) తన నోటి మీద చెయ్యి పెట్టుకోవాలి, ఎందుకంటే నిశ్చయంగా షైతాన్ లోపలికి ప్రవేశిస్తాడు.
[ప్రామాణికమైన హదీథు] - [ముస్లిం నమోదు చేసినారు:] - [సహీహ్ ముస్లిం - 2995]
ప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు: ఎవరైనా అలసట లేదా కడుపు నిండా భుజించుట వంటి కారణాల వలన ఆవలిస్తే, తన చేతిని నోటిపై అడ్డంగా పెట్టి, దాన్ని మూసుకోవాలి. ఎందుకంటే, నోటిని తెరిచి ఉంచితే షైతాన్ అందులో ప్రవేశిస్తాడు. కాబట్టి, చేతిని నోటిపై పెట్టడం ద్వారా షైతాన్ నోటి లోపలికి ప్రవేశించకుండా అడ్డుకోవచ్చు.