عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال:
«أَتَدْرُونَ مَا الْغِيبَةُ؟»، قَالُوا: اللهُ وَرَسُولُهُ أَعْلَمُ، قَالَ: «ذِكْرُكَ أَخَاكَ بِمَا يَكْرَهُ»، قِيلَ: أَفَرَأَيْتَ إِنْ كَانَ فِي أَخِي مَا أَقُولُ؟ قَالَ: «إِنْ كَانَ فِيهِ مَا تَقُولُ فَقَدِ اغْتَبْتَهُ، وَإِنْ لَمْ يَكُنْ فِيهِ فَقَدْ بَهَتَّهُ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2589]
المزيــد ...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు:
“ ‘గీబత్’ (చాడీలు చెప్పుట, వ్యక్తి పరోక్షములో అతని గురించి మాట్లాడుట) అంటే ఏమిటో తెలుసా మీకు?” ఆయన సహాబాలు “అల్లాహ్ మరియు ఆయన సందేశహరునికే బాగా తెలుసు” అన్నారు. ఆయన “(‘గీబత్’ అంటే) మీ సోదరుని గురించి అతడు ఇష్టపడని విధంగా మాట్లాడడం” అన్నారు. వారిలో ఒకరు “నా సోదరుని గురించి నేను చెబుతున్నది నిజమే అయితే? దాని గురించి మీరు ఏమంటారు?” అని అడిగారు. దానికి ఆయన “నీ సోదరుని గురించి నీవు చెబుతున్నది ఒకవేళ నిజమే అయితే, నీవు అతడి గురించి “గీబత్’ చేసావు, ఒకవేళ నిజం కాకపోతే నీవు అతడిపై అపనింద వేసావు” అన్నారు”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2589]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించబడిన గీబత్’ యొక్క వాస్తవికతను గురించి వివరిస్తున్నారు. అదేమిటంటే అక్కడ హాజరుగా లేని ఒక ముస్లిమును గురించి అతడు ఇష్టపడని విధంగా చెప్పుట, మాట్లాడుట; అది అతడి భౌతిక రూపాన్ని గురించి కానివ్వండి లేక అతడి నైతిక గుణగణాలను గురించి కానివ్వండి. ఉదాహరణకు: ‘ఆ ఒంటికన్ను మోసగాడా!’, ‘ఆ అబద్దాలకోరా!’ లేక ఇంకా ఇలాంటి వర్ణనలు, గుణగణాలతో కూడిన మాటలతో అతడి గురించి మాట్లాడుట, చెప్పుట అని అర్థము. ఆ భౌతిక వర్ణనలు, ఆ గుణగణాలు అతడిలో నిజంగానే ఉన్నప్పటికీ.
ఒకవేళ ఆ భౌతిక వర్ణనలు, ఆ గుణగణాలు అతడిలో లేకపోయినట్లయితే అది ‘గీబత్’ కంటే ఇంకా ఘోరమైన విషయం అవుతుంది. అది అతడిపై అపనింద వెయ్యడం అవుతుంది – అంటే అతడు ఆ విధమైన వ్యక్తి కాకపోయినప్పటికీ, అతనిలో ఆ లక్షణాలు లేక పోయినప్పటికీ అతడి గురించి ఆ విధంగా మాట్లాడడం. అది ఇంకా ఘోరమైన విషయం.