عن عائشة رضي الله عنها قالت: سمعتُ من رسول الله صلى الله عليه وسلم يقول في بيتي هذا:
«اللَّهُمَّ مَنْ وَلِيَ مِنْ أَمْرِ أُمَّتِي شَيْئًا فَشَقَّ عَلَيْهِمْ فَاشْقُقْ عَلَيْهِ، وَمَنْ وَلِيَ مِنْ أَمْرِ أُمَّتِي شَيْئًا فَرَفَقَ بِهِمْ فَارْفُقْ بِهِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1828]
المزيــد ...
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “ఇంటిలో ఉన్నపుడు, ఒకరోజు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను:
“ఓ అల్లాహ్! నా ఉమ్మత్ కు (సమాజానికి) సంబంధించిన ఏ విషయములోనైనా ఎవరికైనా అధికారాన్ని ఇచ్చినట్లయితే, అతడు దాని ద్వారా ప్రజలను కష్టాలకు, కఠిన పరిస్థితులకు గురిచేస్తే, నీవు కూడా అతడిని కాఠిన్యానికి గురి చేయి. మరియు నా ఉమ్మత్ కు సంబంధించిన ఏ విషయములోనైనా ఎవరికైనా అధికారాన్ని ఇచ్చినట్లయితే, అతడు (ప్రజలను కష్టాలపాలు చేయకుండా) ప్రజలతో దయతో, కరుణతో స్నేహపూర్వకంగా ఉన్నట్లయితే, నీవు కూడా అతనిపై కృపతో, దయతో, అనుగ్రహముతో ఉండు”.
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 1828]
ఈ హదీసులో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన దుఆ అందరికీ వర్తిస్తుంది. ఎవరైతే ముస్లిముల యొక్క వ్యవహారాలలో దేనినైనా నిర్వహించడానికి అధికారము పొందుతారో, అటువంటి వారందరికీ వర్తిస్తుంది. ఆ వ్యవహారము చిన్నదైనా లేక పెద్దదైనా, అది ప్రజలందరికీ సంబంధించిన వ్యవహారమైనా లేక ప్రజలలో కొద్ది మందికి (ఒక సమూహానికి, ఒక తెగకు మొ.) సంబంధించిన వ్యవహారమైనా – అందులో అతడు ప్రజలను కష్టాలకు గురిచేసినట్లయితే లేక వారిని కఠిన పరిస్థితుల పాల్జేసినట్లయితే, వారి పట్ల కనికరం, దయ లేకుండా వ్యవహరించినట్లయితే, (అధికార స్థానం’లో ఉండి) అతడు ప్రజలతో ఏవిధంగానైతే వ్యవహరించాడో అల్లాహ్ అతడికి అదే విధంగా ప్రతిఫలాన్నిస్తాడు.
అలాగే ఇందులో, ఎవరైతే అధికారాన్ని పొందిన తరువాత, తద్వారా ప్రజలకు తగిన విధంగా సేవ చేస్తాడో, వారి వ్యవహారాలను న్యాయబధ్ధంగా పరిష్కరిస్తాడో, చక్కదిద్దుతాడో అల్లాహ్ కూడా అతడి వ్యవహారాలను కూడా అదే విధంగా పరిష్కరిస్తాడు.