హదీసుల జాబితా

“మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చేతిపై ఇలా విధేయతా ప్రతిజ్ఞ చేసినాము – కష్టకాలంలోనూ, సుఖసమయంలోనూ, శక్తివంతులుగా ఉన్న సమయంలోనూ, బలహీనులుగా ఉన్న సమయంలోనూ, మాపై మరొకరికి ప్రాధాన్యత ఇవ్వబడిన సందర్భంలోనూ
عربي ఇంగ్లీషు ఉర్దూ
నిశ్చయంగా మీపై కొంతమంది నాయకులుగా నియమించ బడుతారు,వారి యొక్క సత్కార్యాలను మరియు దుష్కార్యాలను మీరు చూస్తారు ఎవరైతే వాటిని అసహ్యించుకుంటారో బయలు పడతారు,మరెవరైతే దానిని తిరస్కరిస్తారో సంరక్షించబడుతారు కానీ దానికి విధేయత చూపుతూ ఎవరైతే ఆచరిస్తారో సర్వనాశనం అవుతారు,అనుచరులు ప్రశ్నించారు: ఓ మహా ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్‘మరి వారితో మేము మేము ధర్మపోరాటం చేయవచ్చా ? దైవప్రవక్త బదులిస్తూ ‘లేదు వారు మీ మధ్యలో నమాజు నెలకొల్పుతూ ఉన్నంతవరకు”అని చెప్పారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ధర్మము ఒక నిష్కల్మషమైన బోధన, ఉపదేశం”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఓ అల్లాహ్! నా ఉమ్మత్ కు (సమాజానికి) సంబంధించిన ఏ విషయములోనైనా ఎవరికైనా అధికారాన్ని ఇచ్చినట్లయితే, అతడు దాని ద్వారా ప్రజలను కష్టాలకు, కఠిన పరిస్థితులకు గురిచేస్తే, నీవు కూడా అతడిని కాఠిన్యానికి గురి చేయి. మరియు నా ఉమ్మత్ కు సంబంధించిన ఏ విషయములోనైనా ఎవరికైనా అధికారాన్ని ఇచ్చినట్లయితే, అతడు (ప్రజలను కష్టాలపాలు చేయకుండా) ప్రజలతో దయతో, కరుణతో స్నేహపూర్వకంగా ఉన్నట్లయితే, నీవు కూడా అతనిపై కృపతో, దయతో, అనుగ్రహముతో ఉండు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“అల్లాహ్ అధికార పదవిలో నియమించిన ఎవరైనా సరే, తాను చనిపోయే దినమున, తన అధికారము క్రింద ఉన్న వారిని మోసం చేస్తున్న స్థితిలో చనిపోతే, అటువంటి వానికి అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించినాడు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే విధేయత నుండి తొలగిపోయి, జమాఅత్ నుండి వేరై వెళ్ళిపోయినట్లయితే, తరువాత అతడు అదే స్థితిలో చనిపోతే, అతని చావు ‘జాహిలియ్యహ్’ కాలము (ఇస్లాంకు పూర్వపు అఙ్ఞాన కాలము) నాటి చావుతో సమానము
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీరు మీ విషయాల కొరకు ఒక వ్యక్తిని (మీ నాయకునిగా/పాలకునిగా) అంగీకరించినపుడు, (మీ నాయకునికి ప్రకటించిన) మీ సంఘీభావాన్ని ముక్కలు చేయాలనే, లేక మీ జమాఅత్ ను విడదీయాలనే తలంపుతో ఎవరైనా మీ వద్దకు వచ్చినట్లయితే – అతడిని చంపివేయండి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
అల్లాహ్ కు భయపడండి, మరియు ఒకవేళ మీపై ఒక హబషీయుడిని (బానిసను) అధికారిగా నియమించినా సరే ఆయనను అనుసరించండి. నా తరువాత మీలో జీవించి ఉన్న వారు తీవ్రమైన విబేధాలు చూస్తారు. కనుక నా సున్నత్’ను మరియు సన్మార్గగాములైన ఖలీఫాల (ఖులాఫా అర్రాషిదీన్ అల్ మహిదియ్యీన్ ల) సున్నత్’ను అంటిపెట్టుకుని ఉండండి
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నా తరువాత అత్యంత స్వార్థపరత్వము, మరియు మీరు ఇష్టపడని ఎన్నో విషయాలను చూస్తారు.” అపుడు అక్కడ ఉన్నవారు “మరి (అటువంటి పరిస్థుతులలో) మా కొరకు మీ ఆదేశము ఏమిటి ఓ ప్రవక్తా ?” అని అడిగారు. దానికి ఆయన “మీ విధులను నిర్వర్తించండి, మీ హక్కుల కొరకు అల్లాహ్ ను ప్రార్థించండి” అన్నారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీలో ప్రతి ఒక్కరు సంరక్షకుడు మరియు ప్రతి ఒక్కరూ తన వ్యక్తుల పట్ల బాధ్యత వహిస్తారు
عربي ఇంగ్లీషు ఉర్దూ