عَنْ حُذَيْفَةَ رَضيَ اللهُ عنهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِنَّهَا سَتَكُونُ أُمَرَاءُ يَكْذِبُونَ وَيَظْلِمُونَ، فَمَنْ صَدَّقَهُمْ بِكَذِبِهِمْ وَأَعَانَهُمْ عَلَى ظُلْمِهِمْ فَلَيْسَ مِنَّي، وَلَسْتُ مِنْهُ، وَلَا يَرِدُ عَلَيَّ الْحَوْضَ، وَمَنْ لَمْ يُصَدِّقْهُمْ بِكَذِبِهِمْ وَلَمْ يُعِنْهُمْ عَلَى ظُلْمِهِمْ فَهُوَ مِنِّي، وَأَنَا مِنْهُ، وَسَيَرِدُ عَلَيَّ الْحَوْضَ».
[صحيح] - [رواه أحمد] - [مسند أحمد: 23260]
المزيــد ...
హుదైఫహ్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా పలికినారు:
“నిశ్చయంగా (నా తరువాత) పాలకులు వస్తారు. వారు అసత్యాలు పలుకుతారు మరియు దౌర్జన్యానికి పాల్బడతారు. ఎవరైతే వారి అసత్యాలను విశ్వసిస్తాడో, వారి దౌర్జన్యాలకు సహాయపడతాడో, అతడు నావాడు కాడు; నేను అతని వాడను కాను, మరియు అతడు తీర్పుదినమున ‘అల్-హౌధ్’ తటాకము (జలాశయం) దగ్గర నా వద్దకు రాలేడు. మరియు ఎవరైతే వారి అసత్యాలను విశ్వసించడో, మరియు వారి దౌర్జన్యాలలో వారికి సహాయపడడో అతడు నావాడు, నేను అతని వాడను, మరియు అతడు ‘అల్-హౌధ్’ తటాకము దగ్గర నా వద్దకు వస్తాడు.”
[దృఢమైనది] - [దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారు] - [مسند أحمد - 23260]
ఈ హదీథు లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలియజేస్తున్నారు: తన మరణం తరువాత, పాలకులు ప్రజలను పరిపాలిస్తారు; వారు అసత్యాలు పలుకుతారు, వారు ఆచరించని పనులు ఆచరించినట్లు చెబుతారు మరియు వారు పరిపాలనలో అన్యాయానికి పాల్బడతారు. ఎవరైతే వారితో చేరుతాడో, వారి అసత్యాలను విశ్వసిస్తాడో, లేదా తప్పుగా ప్రవర్తించడం ద్వారా, లేక వారిని సంతోషపెట్టే మాటలు మాట్లాడడం ద్వారా, అంటే ఉదాహరణకు వారు ఇష్టపడేలా ఫత్వాలు ఇవ్వడం, లేదా వారిచ్చే వాటికి (బహుమానాలు, హోదాలు, మొ.) ఆశపడి వారికి సహాయపడడం చేసిన వాడి నుండి నన్ను నేను దూరం చేసుకుంటున్నాను. అతను నాకు చెందినవాడు కాదు, నేను అతనికి చెందినవాడిని కాదు. మరియు తీర్పు దినమున అతడు “హౌదె-కౌథర్” (అల్ కౌథర్ తటాకము) వద్దకు రాడు. అయితే, వారితో చేరని వాడు, వారి అసత్యాలను విశ్వసించనివాడు, మరియు వారి అకృత్యాలలో, దౌర్జన్యాలు, అణచివేతలో వారికి సహాయం చేయని వ్యక్తి నావాడు, మరియు నేను అతనివాడిని, మరియు అతను తీర్పు దినమున “హౌదె -కౌథర్” (అల్ కౌథర్ తటాకము) వద్దకు వస్తాడు.”