عَنْ وَائِلٍ الْحَضْرَمِيِّ قَالَ: سَأَلَ سَلَمَةُ بْنُ يَزِيدَ الْجُعْفِيُّ رضي الله عنه رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ:
يَا نَبِيَّ اللهِ، أَرَأَيْتَ إِنْ قَامَتْ عَلَيْنَا أُمَرَاءُ يَسْأَلُونَا حَقَّهُمْ وَيَمْنَعُونَا حَقَّنَا، فَمَا تَأْمُرُنَا؟ فَأَعْرَضَ عَنْهُ، ثُمَّ سَأَلَهُ، فَأَعْرَضَ عَنْهُ، ثُمَّ سَأَلَهُ فِي الثَّانِيَةِ أَوْ فِي الثَّالِثَةِ، فَجَذَبَهُ الْأَشْعَثُ بْنُ قَيْسٍ، وَقَالَ: «اسْمَعُوا وَأَطِيعُوا، فَإِنَّمَا عَلَيْهِمْ مَا حُمِّلُوا، وَعَلَيْكُمْ مَا حُمِّلْتُمْ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1846]
المزيــد ...
వాఇల్ అల్ హద్రమీ ఉల్లేఖన: “సలమహ్ ఇబ్న్ యజీద్ అల్ జు’ఫీ (రదియల్లాహు అన్హు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగినారు:
“ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం! పాలకులు మాపై నిలబడి (అంటే బలవంతంగా) తమ హక్కులను మా నుండి కోరుతూ (తీసుకుంటూ); మాకు చెందిన హక్కులను నిరాకరించడాన్ని మీరు చూసినారా? అటువంటి స్థితిలో, మమ్ములను ఏమి చేయమని మీరు ఆదేశిస్తారు? అది విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడి నుండి తన ముఖాన్ని మరో వైపునకు త్రిప్పుకున్నారు. అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను మళ్ళీ ప్రశ్నించాడు. మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ముఖాన్ని అతడి నుండి మరో వైపునకు త్రిప్పుకున్నారు. అతడు రెండోసారో లేక మూడోసారో మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రశ్నించాడు. అపుడు అల్-అష్’అత్ ఇబ్న్ ఖైస్ (రదియల్లాహు అన్హు) అతడిని ప్రక్కకు లాగినాడు. అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “(వారు చెప్పినది) వినండి మరియు అనుసరించండి. ఎందుకంటే, వారికి అప్పగించబడిన బాధ్యత వారిపై ఉంది. మీకు అప్పగించబడిన బాధ్యత మీపై ఉంది.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 1846]
ప్రజలు తమ మాట వినాలని, తు.చ. తప్పకుండా పాటించాలను, అది తమ హక్కు అని, తమ హక్కును ప్రజల నుండి బలవంతంగా లాక్కుంటూ, వారికి న్యాయం చేయడాన్ని, యుద్ధంలో గెలిచిన సంపదను పంచడాన్ని, వారి సమస్యలను పరిష్కరించడాన్ని, వారి కష్టాలను తొలగించడాన్ని నిరాకరించే పాలకుని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రశ్నించడం జరిగింది “ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం!, అటువంటి సందర్భములో మమ్ములను ఏమి చేయమంటారు, మీ ఆదేశము ఏమిటి?” అని.
అది తనకు ఇష్టం లేని విషయం, తాను అసహ్యించుకునే విషయం అన్నట్లుగా, ఆ ప్రశ్నించిన వ్యక్తి నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ముఖాన్ని మరో వైపునకు త్రిప్పుకున్నారు. కానీ ఆ ప్రశ్నించిన వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అదే ప్రశ్న రెండోసారి, మూడోసారి కూడా అడిగాడు. అపుడు అల్-’అష్’అత్ బిన్ ఖైస్ (రదియల్లాహు అన్హు) అతడిని మౌనంగా ఉండమని పక్కకు లాగినారు.
అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతని ప్రశ్నకు స్పందిస్తూ ఇలా సమాధానమిచ్చారు: “వారు చెబుతున్న దానిని వినండి, మరియు వారి ఆదేశాలను పాటించండి;