عَنْ أَبِي سَعِيدٍ رضي الله عنه أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَا مِنْ مُسْلِمٍ يَدْعُو بِدَعْوَةٍ لَيْسَ فِيهَا إِثْمٌ، وَلَا قَطِيعَةُ رَحِمٍ، إِلَّا أَعْطَاهُ اللهُ بِهَا إِحْدَى ثَلَاثٍ: إِمَّا أَنْ تُعَجَّلَ لَهُ دَعْوَتُهُ، وَإِمَّا أَنْ يَدَّخِرَهَا لَهُ فِي الْآخِرَةِ، وَإِمَّا أَنْ يَصْرِفَ عَنْهُ مِنَ السُّوءِ مِثْلَهَا» قَالُوا: إِذنْ نُكْثِرُ، قَالَ: «اللهُ أَكْثَرُ».
[صحيح] - [رواه أحمد] - [مسند أحمد: 11133]
المزيــد ...
అబూ సయీద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"ఎవరైనా ముస్లిం పాపం లేదా బంధుత్వాన్ని తెంచే వేడుకోలు లేని దుఆ చేస్తే, అల్లాహ్ ఆ దుఆకు బదులుగా అతనికి మూడు విషయాల్లో ఒకదాన్ని ప్రసాదిస్తాడు: అతని దుఆను వెంటనే నెరవేర్చుతాడు, లేదా దుఆకు బదులుగా అతనికి పరలోకంలో పుణ్యాలు ప్రసాదించబడేందుకు ఆపుతాడు, లేదా ఆ దుఆ స్థాయిలో అతనిపై వచ్చే కష్టాన్ని తొలగిస్తాడు." అప్పుడు సహాబాలు అడిగారు: "అయితే మేము ఎక్కువగా దుఆ చేస్తాం!" దానికి ప్రవక్త ﷺ అన్నారు: "అల్లాహ్ మరింత ఎక్కువగా (ఇస్తాడు)."
[దృఢమైనది] - [దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారు] - [مسند أحمد - 11133]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: ముస్లిం వ్యక్తి అల్లాహ్‌ను పాపానికి సంబంధించినది (ఉదా: ఏదైనా పాపపు పనిని సులభం చేయమని కోరడం, దుర్మార్గపు పనిలో సహాయం చేయమని అడగడం) లేదా బంధుత్వాన్ని తెంచే విధంగా (ఉదా: తన పిల్లలపై లేదా బంధువులపై శపించడం) కాకుండా ఏదైనా (మంచి విషయం కొరకు) దుఆ చేస్తే, అల్లాహ్ ఆ దుఆకు బదులుగా ఈ మూడింటిలో ఒకదాన్ని ప్రసాదిస్తాడు: అల్లాహ్ అతని దుఆను వెంటనే నెరవేర్చవచ్చు మరియు అతను కోరినదాన్ని వెంటనే అతనికి ప్రసాదించవచ్చు. లేదా, అల్లాహ్ ఆ దుఆలో వేడుకున్న దానిని ప్రసాదించడంలో ఆలస్యంగా చేస్తాడు - దాని ప్రతిఫలాన్ని పరలోకంలో అతనికి ఇస్తాడు, ఇది అతని స్థాయిని (స్థాయిని) పెంచేందుకు లేదా అతనిపై దయగా లేదా అతని పాపాల పరిహారంగా మారుతుంది. లేదా, ఆ దుఆ పరిమాణానికి అనుగుణంగా, అల్లాహ్ ఈ ప్రపంచంలో అతనిపై వచ్చే కష్టాన్ని తొలగించవచ్చు. అప్పుడు సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగారు: "అయితే, మేము ఎక్కువగా దుఆ చేస్తాము, ఎందుకంటే ఈ మూడు గొప్ప లాభాల్లో ఏదో ఒకటి మాకు లభిస్తుంది కదా?" దానికి ఆయన సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా పలికినారు: "అల్లాహ్ వద్ద ఉన్నది మీరు అడిగే దాని కంటే ఎంతో ఎక్కువ, ఎంతో గొప్పది. ఆయన దానం ఎన్నటికీ తరుగదు, ఎన్నటికీ సమాప్తి కాదు."