عن أبي رقية تميم بن أوس الداري رضي الله عنه أن النبي صلى الله عليه وسلم قال: «الدين النصيحة» قلنا: لمن؟ قال: «لله، ولكتابه، ولرسوله، ولأئمة المسلمين وعامتهم».
[صحيح] - [رواه مسلم]
المزيــد ...

అబూ రుఖియా తమీమ్ బిన్ ఔస్ అద్దారి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ‘మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ భోదించారు ‘ధర్మము అనగా సద్బుద్దితో వ్యవహరించడము అని అర్ధము”మేము‘ఎవరితో {సద్బుద్దితో వ్యవహరించడం} అని ప్రశ్నించాము?ఆయన ‘అల్లాహ్ తో ,ఆయన గ్రంధం తో ,ఆయన సందేశ హరులతో,ముస్లిం విశ్వాసుల నాయకులతో మరియు వారి ప్రజలతో అంటూ’ భోదించారు.
దృఢమైనది - దాన్ని ముస్లిం ఉల్లేఖించారు

వివరణ

ఇస్లాం వాస్తవధర్మం స్వచ్చమైన నిజాయితి గల ఉపదేశాన్ని తెచ్చింది, అది మనందరికీ హృదయపూర్వక సలహాలు,ఉపదేశాన్ని ఇవ్వమని,శక్తిమంతుడు మహోన్నతుడైన -అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని విశ్వసించాలని మరియు అంగీకరించమని విజ్ఞప్తి చేస్తుంది,దాన్ని లోపాలనుండి మనము శుద్దిపరుస్తూ పరిపూర్ణ లక్షణాలతో వర్ణించాలీ,నిశ్చయంగా ఖుర్ఆన్ సృష్టికర్త అల్లాహ్ వైపునుండి అవతరించబడిందని సృష్టించబడలేదు అని నమ్ముతూ,దాని స్పష్టమైన ఆయతులపై అమలుపరుస్తూ,అస్పష్టమయ్యే ఆయతులను విశ్వసిస్తూ,దైవప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లమ్) తెచ్చిన సందేశాన్ని నమ్మాలి మరియు ఆయన ఆజ్ఞలను పాటించాలీ మరియు నిషేధాలను త్యజించాలీ,ముస్లిం నాయకులకు సత్యానికి సహాయపడాలి,తెలియని వాటి గురించి వారికి మార్గనిర్దేశం చేయడం మరియు వారు మరచిపోయిన లేదా పట్టించుకోని వాటిని గుర్తుచేస్తూ వారికి హృదయపూర్వక సలహా ఇవ్వాలి;సాధారణ ముస్లింలను సత్యానికి మార్గనిర్దేశం చేయడం, మనకు సాధ్యమైనంతవరకు వారికి హాని చేయకుండా ఉంటూ ఇతరుల హాని నుండి వారిని రక్షించాలీ,మరియు మంచి చేయమని వారిని ఆదేశించాలీ మరియు చెడు నుండి వారిని నిషేధించాలి. వారికి ఇవ్వబడే క్లుప్తమైన సలహా ఏమిటంటే,మనలోని ప్రతి ఒక్కరూ మనకొరకు కోరుకునేవాటిని వారి కొరకు కూడా కోరుకోవాలి.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. శ్రేయస్కరమైనఉపదేశం యొక్క ఆదేశం ఇవ్వబడినది
  2. ఇస్లాం ధర్మం లో సలహాఉపదేశానికి ఒక గొప్ప స్థానం ఉంది,కాబట్టి దాన్ని ధర్మం గా వర్ణించడం జరిగింది.
  3. నిశ్చయంగా ఇస్లాం ధర్మం ‘సత్పలుకులతో సత్కర్మలతో ఇమిడి ఉన్నది.
  4. ఒక ఆలిముకు/పండితుడికి ఎదుటివాడికి ఏం చెప్పాలో పూర్ణ జ్ఞానం ఉంటుంది,వినేవాడు ఆసక్తికరంగా అతన్ని ప్రశ్నిస్తే తప్ప ఉపదేశించడంలో అధికపర్చడు,అప్పుడే అది అతను నేరుగా చెప్పబడే విషయాల కంటే ఎక్కువగా అతని మనసులో గూడుకట్టుకుంటుంది.
  5. మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ యొక్క ఉత్తమమైన భోదన పద్దతి : మొదట విషయాన్ని చిన్నగా ప్రస్తావించి పిదప దాన్ని విశదీకరించేవారు.
  6. ఈ హదీసులో సహాబాల కు విధ్యపట్ల గల ఆసక్తి తెలుస్తుంది,వారు భోదించిన విషయంలో అవసరమనుకున్న ఏ విషయాన్ని వదిలేవారు కాదు,అడిగి తెలుసుకునేవారు.
  7. ముఖ్యమైన అంశాల ద్వారా ప్రారంభించాలి,మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ అల్లాహ్ గురించి మొదట ఉపదేశించి పిదప ఖుర్ఆన్ పిదప ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ కొరకు,పిదప ముస్లిముల నాయకులకు ఆపై సాదారణ ముస్లిములకు ఉపదేశించేవారు
  8. మరుమారు మాటను తాకీదు చేయడం వల్ల దాని ప్రాముఖ్యతను తెలియజేయడానికి మరియు స్పష్టంగా అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది,-ఇమామ్ అహ్మద్ రహిమహుల్లాహ్ వారి ఉల్లేఖనం లో ఇలా వచ్చింది : "అద్దీనున్నసీహ" అని మూడు సార్లు చెప్పారు.
  9. ‘ఉపదేశము’ అందరికోసము ఉంటుంది.