ఉప కూర్పులు

హదీసుల జాబితా

“మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చేతిపై ఇలా విధేయతా ప్రతిజ్ఞ చేసినాము – కష్టకాలంలోనూ, సుఖసమయంలోనూ, శక్తివంతులుగా ఉన్న సమయంలోనూ, బలహీనులుగా ఉన్న సమయంలోనూ, మాపై మరొకరికి ప్రాధాన్యత ఇవ్వబడిన సందర్భంలోనూ
عربي ఇంగ్లీషు ఉర్దూ
సమీప భవిశ్యత్తులో మీపై అమీరులు (పాలకులు) వస్తారు. మీరు వారిని (వారి మంచి పనుల కారణంగా) ఇష్టపడనూ వచ్చు, లేదా (వారి దురాచరణల కారణంగా) వారిని ఇష్టపడకపోనూ వచ్చు. ఎవరైతే పాలకుని దురాచరణలను, దుర్మార్గాలను (అవి పునరావృతం కాకుండా ఉండాలని) అతని దృష్టికి తీసుకు వెళతాడో, (తీర్పు దినమున) అతడు తనను తాను రక్షించుకున్నవాడు అవుతాడు. మరియు ఎవరైతే (పాలకుని దృష్టికి తీసుకు వెళ్ళేటంత శక్తి, ధైర్యము లేక) అతని దుర్మార్గాలను మనసులో అసహ్యించుకుంటాడో (తీర్పు దినమున) అతడు శాంతిని పొందుతాడు. అయితే ఎవరైతే పాలకుని దుర్మార్గాలను ఆమోదిస్తాడో, మరియు వాటిని తాను కూడా ఆచరిస్తాడో – తీర్పు దినము నాడు నాశనమై పోతాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే విధేయత నుండి తొలగిపోయి, జమాఅత్ నుండి వేరై వెళ్ళిపోయినట్లయితే, తరువాత అతడు అదే స్థితిలో చనిపోతే, అతని చావు ‘జాహిలియ్యహ్’ కాలము (ఇస్లాంకు పూర్వపు అఙ్ఞాన కాలము) నాటి చావుతో సమానము
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీరు మీ విషయాల కొరకు ఒక వ్యక్తిని (మీ నాయకునిగా/పాలకునిగా) అంగీకరించినపుడు, (మీ నాయకునికి ప్రకటించిన) మీ సంఘీభావాన్ని ముక్కలు చేయాలనే, లేక మీ జమాఅత్ ను విడదీయాలనే తలంపుతో ఎవరైనా మీ వద్దకు వచ్చినట్లయితే – అతడిని చంపివేయండి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ