عن أبي هريرة رضي الله عنه عن النبي صلى الله عليه وسلم أنه قال:
«مَنْ خَرَجَ مِنَ الطَّاعَةِ، وَفَارَقَ الْجَمَاعَةَ فَمَاتَ، مَاتَ مِيتَةً جَاهِلِيَّةً، وَمَنْ قَاتَلَ تَحْتَ رَايَةٍ عِمِّيَّةٍ، يَغْضَبُ لِعَصَبَةٍ، أَوْ يَدْعُو إِلَى عَصَبَةٍ، أَوْ يَنْصُرُ عَصَبَةً، فَقُتِلَ، فَقِتْلَةٌ جَاهِلِيَّةٌ، وَمَنْ خَرَجَ عَلَى أُمَّتِي، يَضْرِبُ بَرَّهَا وَفَاجِرَهَا، وَلَا يَتَحَاشَى مِنْ مُؤْمِنِهَا، وَلَا يَفِي لِذِي عَهْدٍ عَهْدَهُ، فَلَيْسَ مِنِّي وَلَسْتُ مِنْهُ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1848]
المزيــد ...
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“ఎవరైతే విధేయత నుండి తొలగిపోయి, జమాఅత్ నుండి వేరై వెళ్ళిపోయినట్లయితే, తరువాత అతడు అదే స్థితిలో చనిపోతే, అతని చావు ‘జాహిలియ్యహ్’ కాలము (ఇస్లాంకు పూర్వపు అఙ్ఞాన కాలము) నాటి చావుతో సమానము. ఎవరైతే అంధవిశ్వాసపు పతాకం క్రింద, మార్గదర్శనం లేని కారణం కొరకు, తన జాతి లేక తెగ అనే ఉన్మాదముతో, లేదా తన జాతి గర్వానికి / అహంకారానికి సమర్ధనగా, లేదా తన జాతి జనుల అహంకారానికి సమర్ధనగా, లేదా తన స్వీయప్రయోజనాల కొరకు కోపగ్రస్థుడై జగడానికి / యుద్ధానికి దిగేవాడు, లేదా యుద్ధానికి దిగమని పిలిచేవాడు – ఆ జగడములో లేదా యుద్ధములో చనిపోతే, అతని చావు ‘జాహిలియ్యహ్’ కాలము నాటి చావుతో సమానము; ఎవరైతే నా ఉమ్మత్’తో చేసిన ఆఙ్ఞానువర్తన ఒడంబడికను తిరస్కరించి, వారిలోని విశ్వాసులైనవారి మాటను కూడా వినకుండా, వారిలో మంచివారు (ధర్మవర్తనులు), చెడ్డవారు అనే తేడా లేకుండా చంపుతాడో, వారిలో ఎవరితోనైనా చేసుకుని ఉన్న ఒడంబడికను నెరవేర్చడో, ఉల్లంఘిస్తాడో – అటువంటివాడు నాకు చెందిన వాడు కాడు, నేను వాడికి చెందిన వాడిని కాను.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: ఎవరైతే తమ పాలకుని విధేయత నుండి తొలగిపోతాడో, మరియు నాయకునికి (ఇమామునకు) విధేయతా ప్రమాణము చేయుటకు ఏకాభిప్రాయముతో అంగీకరించిన ఇస్లామీయ జమాఅత్ (సమూహము నుండి) వేరైపోతాడో, మరియు అదే అవిధేయతా స్థితిలో మరియు జమాఅత్ నుండి వేరైపోయిన స్థితిలో చనిపోతాడో, అతడి చావు ఇస్లాంకు పూర్వపు అఙ్ఞాన కాలములో చనిపోయిన వాని చావుతో సమానము. వారు (జాహిలియ్యహ్ కాలము వారు) తమ నాయకునికి అవిధేయత చూపుతూ, తమ జమాఅత్’తో కలిసి ఉండకుండా వేర్వేరు సమూహాలుగా, గ్రూపులుగా విడిపోయి ఒకరితోనొకరు యుద్ధాలు చేసేవారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఎవరైతే సత్యాన్ని, అసత్యాన్ని స్పష్టంగా వేరుచేసి చూడలేని ఒక పతాకం క్రింద యుద్ధానికి దిగుతాడో, కేవలం తన జాతి కోసం, లేక తన తెగ కోసం క్రోధాపూరితుడు అవుతాడో, ధర్మమును నిలబెట్టుట కోసమో, సత్యమును నిలబెట్టుట కోసమో కాకుండా, కారణరహిత ఛాందసత్వముతో ఙ్ఞానము, అంతర్దృష్ఠి, విచక్షణ లేకుండా కొట్లాటకు, జగడానికి, యుద్ధానికి దిగుతాడో – మరియు అతడు అలాంటి స్థితిలో చనిపోతాడో అటువంటివాడు జాహిలియ్యహ్ (అఙ్ఞాన కాలపు) చావు చచ్చినవానితో సమానము.
మరియు ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్ నుండి తిరుగుబాటుదారుడై బయటకు వెళ్ళిపోయి, ఉమ్మత్ పై దాడి చేసి, అందులోని సజ్జనులను, దుర్జనులను హింసకు గురిచేస్తాడో, తాను ఏమి చేస్తున్నాడో దాని గురించి ఏమాత్రమూ చింత లేకుండా, ఉమ్మత్ యొక్క విశ్వాసులను చంపుతున్నందుకు విధించబోయే శిక్షను గురించిన భయము కూడా లేకుండా వ్యవహరిస్తాడో, పాలకులతో లేక అవిశ్వాసులతో చేసుకున్న ఏ ఒడంబడికనూ నెరవేర్చడో, పైగా వారితో చేసుకున్న ఒడంబడికలను (ఒప్పందాలను) ఉల్లంఘిస్తాడో – అది ఘొరమైన పాపాలలో ఒకటి అవుతుంది. అటువంటి ఘోరమైన పాపానికి పాల్బడిన వానికి ఇందులో అత్యంత కఠినమైన హెచ్చరిక ఉన్నది.