عن عرفجة رضي الله عنه قال: سمعت رسول الله صلى الله عليه وسلم يقول:
«مَنْ أَتَاكُمْ وَأَمْرُكُمْ جَمِيعٌ عَلَى رَجُلٍ وَاحِدٍ، يُرِيدُ أَنْ يَشُقَّ عَصَاكُمْ، أَوْ يُفَرِّقَ جَمَاعَتَكُمْ، فَاقْتُلُوهُ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1852]
المزيــد ...
అర్ఫజహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తుండగా నేను విన్నాను:
“మీరు మీ విషయాల కొరకు ఒక వ్యక్తిని (మీ నాయకునిగా/పాలకునిగా) అంగీకరించినపుడు, (మీ నాయకునికి ప్రకటించిన) మీ సంఘీభావాన్ని ముక్కలు చేయాలనే, లేక మీ జమాఅత్ ను విడదీయాలనే తలంపుతో ఎవరైనా మీ వద్దకు వచ్చినట్లయితే – అతడిని చంపివేయండి.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 1852]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: ఒకవేళ ముస్లిములందరూ (తమ విషయాల కొరకు) ఒక పాలకుని / నాయకుని వద్ద జమ అయితే (నాయకునిగా ఎంచుకుంటే), మరియు అందరూ ఒక జమాఅత్ గా ఉంటే, ఎవరైనా వచ్చి (ఎంచుకున్న) నాయకుని అధికారాన్ని బలవంతంగా తీసుకొన దలిచితే (లాక్కొన దలిచితే), లేక ముస్లిముల జమాఅత్ ను ముక్కలుగా చేయజూస్తే – ముస్లిములపై విధి ఏమిటంటే - ముస్లిములందరూ అతడిని వారించాలి, (అవసరమైతే) అతడితో యుద్ధము చేయాలి. ఇది అటువంటి తిరుగుబాటుదారుని కీడును దూరం చేయుట కొరకు మరియు ముస్లిముల రక్తమును సంరక్షించుట కొరకు.