+ -

عَنْ عَبْدِ اللَّهِ بْنِ عُمَرَ رضي الله عنهما أَنَّ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم قَامَ بَعْدَ أَنْ رَجَمَ الْأَسْلَمِيَّ فَقَالَ:
«اجْتَنِبُوا ‌هَذِهِ ‌الْقَاذُورَةَ الَّتِي نَهَى اللَّهُ عَنْهَا فَمَنْ أَلَمَّ فَلْيَسْتَتِرْ بِسِتْرِ اللَّهِ وَلْيُتُبْ إِلَى اللَّهِ، فَإِنَّهُ مَنْ يُبْدِ لْنَا صَفْحَتَهُ نُقِمْ عَلَيْهِ كِتَابَ اللَّهِ عز وجل».

[صحيح] - [رواه الحاكم والبيهقي] - [المستدرك على الصحيحين: 7615]
المزيــد ...

అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అస్లమీ వ్యక్తిని రజమ్ (రాళ్ళతో కొట్టి చంపే శిక్ష అమలు) చేసిన తర్వాత లేచి నిలబడి, ఇలా పలికినారు:
"అల్లాహ్ నిషేధించిన ఈ అశుద్ధ (పాపకార్యాల) నుండి దూరంగా ఉండండి. ఎవరైతే ఆ పాపం చేస్తే, అల్లాహ్ బహిరంగం చేయని దానిని, తను కూడా బహిరంగం చేయకుండా దాచి పెట్టాలి మరియు అల్లాహ్ వైపు తౌబా (పశ్చాత్తాపం) చేయాలి. ఎందుకంటే, ఎవరు తన తప్పును మాకు బహిర్గతం చేస్తారో, మేము అల్లాహ్ గ్రంథం (షరియా) ప్రకారం అతనిపై శిక్షను అమలు చేస్తాము."

[దృఢమైనది] - [దాన్ని బైహిఖీ ఉల్లేఖించారు - దాన్ని హాకిమ్ ఉల్లేఖించారు] - [المستدرك على الصحيحين - 7615]

వివరణ

ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఇలా తెలిపినారు: వ్యభిచారం చేసినందుకు మాయిజ్ ఇబ్నె మాలిక్ అల్-అస్లమి రదియల్లాహు అన్హును రాళ్ళతో కొట్టి చంపిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లేచి నిలబడి ప్రజలను ఉద్దేశించి ఇలా పలికినారు: అల్లాహ్ నిషేధించిన ఈ అశుభకరమైన పాపాలు మరియు అసహ్యకరమైన, నీచమైన అక్రమాల నుండి దూరంగా ఉండండి. ఎవరైనా దానిలో పడి, ఏదైనా పాపం చేస్తే, అతనిపై రెండు విషయాలు తప్పనిసరి: మొదటిది: అల్లాహ్ తనను గోప్యంగా ఉంచిన విధంగానే (తన పాపాన్ని) దాచిపెట్టాలి మరియు తను చేసిన పాపకార్యం గురించి ఎవరికీ తెలియజేయకూడదు. రెండవది: అతను అల్లాహ్ వైపు మరలి, తక్షణం పశ్చాత్తాప పడాలి మరియు ఆ పాపాన్ని కొనసాగించ కూడదు. ఎవరి పాపం మాకు బహిరంగమైతే, ఆ పాపానికి సంబంధించిన అల్లాహ్ (సుబ్హానహు వ తాఆలా) గ్రంథంలో నిర్దేశించబడిన శిక్షను అతనిపై అమలు చేస్తాము."

من فوائد الحديث

  1. పాపం చేసిన దాసుడు, తన పాపాన్ని తన మధ్య మరియు తన ప్రభువు మధ్యలోనే దాచుకుని, తన ప్రభువు వైపు మరలటం, తౌబా చేయడం విషయంలో ప్రోత్సాహించబడింది.
  2. "హద్దు శిక్షల (షరిఅతులో నిర్దేశించబడిన శిక్షల) నేరాలు ఒకసారి పాలకుని (వలీయుల్-అమ్ర్ / న్యాయాధికారికి) వద్దకు చేరితే, ఆ శిక్షలను తప్పకుండా అమలు చేయాలి."
  3. పాపకార్యాల నుండి కాపాడుకోవడం మరియు వాటి నుండి పశ్చాత్తాపపడడం తప్పనిసరి.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు స్వాహిలీ థాయ్ పష్టో అస్సామీ الأمهرية الهولندية الغوجاراتية الليتوانية الدرية الرومانية المجرية الموري Канада الجورجية المقدونية الخميرية الماراثية
అనువాదాలను వీక్షించండి
ఇంకా