+ -

عن ابن عمر رضي الله عنهما قال: قال رسول الله صلى الله عليه وسلم:
«كل مُسْكِرٍ خَمْرٌ، وكل مُسْكِرٍ حرام، ومن شرِب الخمر في الدنيا فمات وهو يُدْمِنُهَا لَمْ يَتُبْ، لَمْ يَشْرَبْهَا في الآخرة».

[صحيح] - [رواه مسلم وأخرج البخاري الجملة الأخيرة منه] - [صحيح مسلم: 2003]
المزيــد ...

అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“మత్తు కలిగించే ప్రతి పదార్థమూ మద్యమే అనబడుతుంది, కనుక మత్తు కలిగించే ప్రతిదీ హరామే (నిషేధించబడినదే). ఎవరైతే ప్రాపంచిక జీవితంలో మద్యము త్రాగుతూ ఉంటాడో, పశ్చాత్తాపము చెందకుండా, దానికి అలవాటు పడి ఉన్న స్థితిలోనే మరణిస్తాడో, అతడు పరలోక జీవితములో దానిని (స్వర్గపానీయాలను) త్రాగలేడు.”

[దృఢమైనది] - - [صحيح مسلم - 2003]

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: మెదడును మత్తులో ముంచి, మబ్బులా కమ్మివేసి, సరిగా పనిచేయకుండా చేసే ప్రతిదీ మద్యం అనబడుతుంది; అది తినడం ద్వారా కానీ, త్రాగడం ద్వారా కానీ, ముక్కుతో పీల్చడం ద్వారా కానీ, లేక ఇంకే విధంగానైనా కానీ. మెదడును మత్తులో ముంచి, మబ్బులా కమ్మివేసి, సరిగా పనిచేయకుండా చేసే ప్రతిదీ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ద్వారా హరాం చేయబడింది (నిషేధించబడినది); అది కొద్ది మొత్తములోనైనా, లేక ఎక్కువ మోతాదులోనైనా సరే. మరియు ఎవరైనా ఏ రకమైన మత్తుపదార్థాలు వాడినా, వాటిని తాగడం కొనసాగించి, చనిపోయే వరకు వాటి నుండి పశ్చాత్తాపపడకపోతే, అటువంటి వారు అల్లాహ్ శిక్షకు అర్హులు అవుతారు, స్వర్గంలో ఇవ్వబడే పానీయాలను తాగకుండా చేస్తాడు.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ ఇండోనేషియన్ ఉయ్ఘర్ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ పష్టో అస్సామీ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية Кинёрвондӣ الرومانية الموري Малагашӣ Урумӣ Канада الجورجية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. మద్యమును నిషేధించుటకు కారణం అది మత్తు కలిగించడమే. కనుక మత్తు కలిగించే ప్రతి పదార్థమూ, అది ఏ రకమైనదైనా, మత్తుపదార్థాల ఏ వర్గానికి చెందినది అయినా అది హరాం.
  2. మద్యములో ఉన్న పెద్ద హాని మరియు చెడు కారణంగా సర్వశక్తిమంతుడైన అల్లాహ్ దానిని నిషేధించాడు.
  3. పరలోకంలో మద్యం సేవించడం అనేది ఆనందము, సౌఖ్యము యొక్క పరిపూర్ణత మరియు సంతోషము, సుఖానుభవము యొక్క సంపూర్ణత ను సూచిస్తుంది.
  4. ఎవరైతే ఈ లోకంలో తనను తాను నియంత్రించుకొన కుండా, మద్యపానానికి దూరంగా ఉండడో, అతనికి అల్లాహ్ దానిని స్వర్గంలో తాగకుండా నిషేదిస్తాడు, కనుక ఒకరి ఆచరణకు అనుగుణంగానే దాని ప్రతిఫలం కూడా ఉంటుంది.
  5. ఇందులో, మరణానికి ముందు తన పాపముల నుండి పశ్చాత్తాప పడడానికి ముందడుగు వేయాలనే హితబోధ ఉన్నది.
ఇంకా