+ -

عَنْ أَنَسٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ:
كُنْتُ سَاقِيَ القَوْمِ فِي مَنْزِلِ أَبِي طَلْحَةَ، وَكَانَ خَمْرُهُمْ يَوْمَئِذٍ الفَضِيخَ، فَأَمَرَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ مُنَادِيًا يُنَادِي: أَلاَ إِنَّ الخَمْرَ قَدْ حُرِّمَتْ، قَالَ: فَقَالَ لِي أَبُو طَلْحَةَ: اخْرُجْ، فَأَهْرِقْهَا، فَخَرَجْتُ فَهَرَقْتُهَا، فَجَرَتْ فِي سِكَكِ المَدِينَةِ، فَقَالَ بَعْضُ القَوْمِ: قَدْ قُتِلَ قَوْمٌ وَهِيَ فِي بُطُونِهِمْ، فَأَنْزَلَ اللَّهُ: {لَيْسَ عَلَى الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ جُنَاحٌ فِيمَا طَعِمُوا} [المائدة: 93] الآيَةَ.

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 2464]
المزيــد ...

అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
"నేను అబూ తల్హా (రదియల్లాహు అన్హు) ఇంట్లో వారికి పానీయాలు పోసేవాడిని. ఆ కాలంలో వారు ఖర్బూజా లేదా ఖజూర్ పండ్లతో తయారైన 'ఫదీఖ్' అనే మద్యపానీయం త్రాగుతుండే వారు. ఒక రోజు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఒక ప్రకటనకారుణ్ని పంపి ఇలా ప్రకటన చేయించినారు: 'జాగ్రత్తగా వినండి! మద్యం ఇప్పుడు నిషేధించబడింది.' అది వినగానే అబూ తల్హా (రదియల్లాహు అన్హు) నన్ను చూసి ఇలా అన్నారు: 'బయటకి వెళ్లి దీన్ని పారేయ్.' నేను దాన్ని బయటకు తీసువెళ్ళి పారేశాను. అది మదీనా వీధుల్లో ప్రవహించింది." ఆ సమయంలో కొంతమంది ప్రజలు ఇలా ప్రశ్నించారు: 'కొంతమంది మద్యం తాగిన స్థితిలో చనిపోయారు. ఇప్పుడు నిషేధం వచ్చేసరికి అది వాళ్ల కడుపుల్లోనే ఉంది. మరి వారి సంగతి ఏమిటి?' అప్పుడు అల్లాహ్ నుండి ఈ వాక్కు అవతరించింది: "ఓ విశ్వాసులారా! విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు — వారు ఇంతకు ముందు తిన్న వాటి పట్ల (నిషేధం రాకముందు) ఏ పాపమూ ఉండదు - అల్లాహ్‌కు భయపడుతూ, విశ్వసిస్తూ, మంచి కార్యాలు చేస్తూ ఉండినంతవరకూ…" (సూరతుల్ మాయిదా 5:93)

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 2464]

వివరణ

"నేను నా తల్లి భర్త అబూతల్హా (రదియల్లాహు అన్హు) ఇంటిలో అతిథులకు పానీయాలు పోసేవాడిని. ఆ కాలంలో వారి మద్యం 'ఫదీఖ్' (ఖర్బూజా/ఖజూర్ పండ్ల కాచు మిశ్రమం). అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రకటనలను చాటింపు వేసేవాడు 'జాగ్రత్త! మద్యం నిషేధించబడింది' అని ప్రకటించాడు. అది విన్న వెంటనే అబూ తల్హా (రదియల్లాహు అన్హు) నాతో 'బయటికి వెళ్లి దాన్ని పారవేసి రా' అన్నారు. నేను వెళ్లి దాన్ని పారవేశాను, అది మదీనా వీధుల్లో ప్రవహించింది. 'నిషేధింపబడక ముందు మద్యం త్రాగి, అది ఇంకా కడుపులో ఉండగానే మరణించిన వారి సంగతి ఏమిటి?' అని ప్రశ్నించగా...అల్లాహ్ ఈ వాక్కును అవతరింపజేశాడు: "ఎవరు విశ్వసించి సత్కార్యాలు చేస్తున్నారో, వారు ఇంతకు ముందు తిన్న (నిషిద్ధమైన) వాటిపై ఏ పాపం లేదు..." (సూరతుల్ మాయిదా 5:93)
"ఎవరు విశ్వసించి సత్కార్యాలు చేస్తున్నారో, వారు ఇంతకు ముందు తిన్న (నిషిద్ధమైన) వాటిపై ఏ పాపం లేదు..." (సూరతుల్ మాయిదా: 93) అంటే "ఎవరు విశ్వసించారో (ముస్లింలు అయారో), వారు మద్యం నిషేధించబడక ముందు దానిని తిన్నందుకు మరియు తాగినందుకు వారిపై ఏ పాపం లేదు."

من فوائد الحديث

  1. అబూతల్హా మరియు ఇతర సహాబాల (రదియల్లాహు అన్హుమ్) యొక్క గొప్పతనం: "అబూతల్హా మరియు ఇతర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు, తక్షణం అల్లాహ్ ఆజ్ఞకు విధేయత చూపించేవారు. ఎలాంటి ప్రశ్నలు అడగకుండా వెంటనే దాన్ని అమలు చేసేవారు. ఇదే నిజమైన ముస్లిం యొక్క లక్షణం."
  2. "అల్-ఖమ్ర్" (మద్యం) అనేది ఏదైనా మత్తును కలిగించే పదార్థాన్ని సూచిస్తుంది. (ఇస్లామీయ ధర్మశాస్త్రం ప్రకారం) ఇది కేవలం ద్రాక్ష సారాయి (వైన్) మాత్రమే కాదు, ఏ పదార్థం నుండి తయారైనా మత్తును కలిగించే ప్రతి పానీయం/ఆహారం ఈ నిషేధంలోకి వస్తుంది.
  3. ఫదీఖ్ (الفضيخ) అనేది తాజా ఖర్బూజా లేదా ఖర్జూరం పండ్ల కాచు (బస్ర్) నుండి తయారు చేసిన ఒక రకమైన మద్యం. ఇది నిప్పుపై ఉడికించకుండా, సహజంగా పులియబెట్టడం ద్వారా తయారవుతుంది. ఇది మత్తును కలిగించే స్వభావాన్ని కలిగి ఉంటుంది.
  4. ఇబ్నె హజర్ (రహిమహుల్లాహ్) వ్యాఖ్యానం: ఇమామ్ అల్-ముహల్లబ్ (రహిమహుల్లాహ్) అభిప్రాయం: "అబూతల్హా (రదియల్లాహు అన్హు) మద్యాన్ని వీధుల్లో పారవేసినది దానిని బహిరంగంగా తిరస్కరించమని మరియు దాని వినియోగాన్ని పూర్తిగా మానివేయమని ప్రజలకు స్పష్టమైన సందేశం ఇవ్వడానికే. ఈ పద్ధతి (బహిరంగంగా పారవేయడం) వీధులు మలినమయ్యే చిన్న ఇబ్బంది కంటే ఇస్లామీయ నిషేధాన్ని ప్రచారం చేయడంలో ఎక్కువ మేలును కలిగి ఉన్నది."
  5. ధర్మాజ్ఞ రాకముందు చేసిన పనులపై అల్లాహ్ శిక్షించకపోవటం తన దాసులపై అల్లాహ్ కారుణ్యము గరించి స్పష్టమవుతుంది.
  6. అల్లాహ్ మద్యం (ఖమర్)ను నిషేధించాడు. ఎందుకంటే దానిలో ఉన్న అనేక దుష్ప్రభావాలు మన మనస్సు, ఆస్తి మీద హానికరంగా ఉంటాయి. మద్యం తాగినవాడు తన బుద్ధిని కోల్పోతాడు కాబట్టి, అనేక పాపాలు, తప్పులు చేయడానికి దారితీస్తుంది.
అనువాదము: ఇంగ్లీషు ఇండోనేషియన్ రష్యన్ సింహళ వియత్నమీస్ హౌసా పోర్చుగీసు స్వాహిలీ థాయ్ అస్సామీ الهولندية الغوجاراتية الرومانية المجرية الجورجية
అనువాదాలను వీక్షించండి