عَنْ عَبْدِ اللَّهِ بْنِ مَسْعُودٍ رَضِيَ اللَّهُ عَنْهُ رَفَعَهُ:
فِي قَوْلِ اللَّهِ عَزَّ وَجَلَّ: {وَمَنْ يُرِدْ فِيهِ بِإِلْحَادٍ بِظُلْمٍ نُذِقْهُ مِنْ عَذَابٍ أَلِيمٍ} [الحج: 25] قَالَ: «لَوْ أَنَّ رَجُلًا هَمَّ فِيهِ بِإِلْحَادٍ وَهُوَ بِعَدَنِ أَبْيَنَ لَأَذَاقَهُ اللَّهُ عَذَابًا أَلِيمًا».
[صحيح] - [رواه أحمد والحاكم] - [المستدرك على الصحيحين: 3461]
المزيــد ...
ఒక ‘మర్ఫూ’ హదీథులో అబ్దుల్లాహ్ ఇబ్నె మస్’ఊద్ (రదియల్లాహు అన్హు) ఇలా పేర్కొన్నారు:
(ఆ హదీథులో) అల్లాహ్ యొక్క ప్రకటన {వ మన్ యురిద్ ఫీహి బి ఇల్’హాదిన్, బి జుల్మిన్’నుధిఖ్’హు మిన్ అజాబిన్ అలీమ్} [“…మరియు ఎవరైనా అందులో అపవిత్రత మరియు అన్యాయం చేయగోరుతారో, అలాంటి వారికి మేము బాధాకరమైన శిక్షను రుచి చూపుతాము.] (సూరహ్ అల్ హజ్జ్ 22:25) ను గురించి పేర్కొంటూ, ఆయన ఇలా అన్నారు: “ఎవరైనా అబ్యన్ నగరం లోని అదన్’లో నివసిస్తూ అక్కడ అపవిత్రత మరియు అన్యాయం చేయగోరుతారో, అల్లాహ్ వారికి అత్యంత బాధాకరమైన శిక్షను రుచిచూపిస్తాడు.”
[దృఢమైనది] - - [المستدرك على الصحيحين - 3461]
సూరతుల్ హజ్జ్ ఆయతు నెంబరు 25 (22:25) లో అల్లాహ్ యొక్క ప్రకటన {వ మన్ యురిద్ ఫీహి బి ఇల్’హాదిన్, బి జుల్మిన్’నుధిఖ్’హు మిన్ అజాబిన్ అలీమ్} [“…మరియు ఎవరైనా అందులో అపవిత్రత మరియు అన్యాయం చేయగోరుతారో, అలాంటి వారికి మేము బాధాకరమైన శిక్షను రుచి చూపుతాము.] (సూరహ్ అల్ హజ్జ్ 22:25) ను గురించి పేర్కొంటూ, అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “జనులలో ఎవరైనా పవిత్ర మక్కా నగరములో అల్లాహ్ నిషేధించిన వాటిని, అంటే ఉద్దేశ్యపూర్వకంగా నాలుకను దుర్భాషలాడడానికి వినియోగించడం, ఉద్దేశ్యపూర్వకంగా అన్యాయంగా ఎవరినైనా చంపడం వంటివి చేయాలని మనసులో సంకల్పించుకున్నట్లైతే – అది దౌర్జన్యము. మరియు యెమెన్ లోని ఆడెన్ నగరంలో అలా చేయాలని ఎవరైనా సంకల్పము చేసుకుని ఉంటే, అతడు అలా చేయకపోయినా, దాని కారణంగా అల్లాహ్ అతణ్ణి బాధాకరమైన శిక్షకు గురి చేస్తాడు. అతడు అలా సంకల్పించడమే చాలు, అతడు అల్లాహ్ శిక్షకు అర్హుడు కావడానికి.