عَنْ أَبِي سَعِيدٍ الخُدْرِيِّ رَضيَ اللهُ عنهُ:
أَنَّ رَجُلًا سَمِعَ رَجُلًا يَقْرَأُ: {قُلْ هُوَ اللَّهُ أَحَدٌ} يُرَدِّدُهَا، فَلَمَّا أَصْبَحَ جَاءَ إِلَى رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَذَكَرَ ذَلِكَ لَهُ، وَكَأَنَّ الرَّجُلَ يَتَقَالُّهَا، فَقَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «وَالَّذِي نَفْسِي بِيَدِهِ إِنَّهَا لَتَعْدِلُ ثُلُثَ القُرْآنِ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 5013]
المزيــد ...
అబూ సయీద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన:
“ఒక వ్యక్తి – మరో వ్యక్తి “ఖుల్ హువల్లాహు అహద్...” సూరాహ్’ను (సూరతుల్ ఇఖ్లాస్ ను) పలుమార్లు అదే సూరహ్ ను పునరావృతం చేస్తూ పఠిస్తూ ఉండగా చూచినాడు. మర్నాడు ఉదయం అతడు రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి ఆ విషయాన్ని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కు వివరించినాడు; ఆ వ్యక్తి ఆ సూరాహ్ ను తగినన్ని సార్లు పఠించలేదు అనే ధోరణిలో. దానికి రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ఎవరి చేతిలోనైతే నా ప్రాణము ఉన్నదో, ఆయన సాక్షి – అది (ఆ సూరహ్) మూడింటి ఒక వంతు ఖుర్’ఆన్ కు సమానం.”
[దృఢమైనది] - [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు] - [صحيح البخاري - 5013]
ఈ హదీథులో అబూ సయీద్ అల్-ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఒక వృత్తాంతాన్ని ఇలా ప్రస్తావిస్తున్నారు: ఒక వ్యక్తి - మరొక వ్యక్తి రాత్రంతా “ఖుల్ హువల్లాహు అహద్..” సూరహ్ ను, దానికి ఇంకేమీ జోడించకుండా, కేవల ఆ ఒక్క సూరానే పునరావృతం చేస్తూ పఠించడం విన్నాడు. మర్నాడు ఉదయం ఆ వ్యక్తి రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో ఈ విషయం చెప్పాడు. అతడు చెప్పడం – ఆ వ్యక్తి చేసినది చాలా తక్కువగా ఉందని భావిస్తున్నట్లుగా ఉంది. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నొక్కి చెబుతున్నట్లుగా ప్రమాణం చేస్తూ మరీ ఇలా అన్నారు: “ఎవరి చేతిలోనైతే నా ఆత్మ ఉన్నదో, ఆయన సాక్షిగా, అది ఖుర్’ఆన్ లో మూడో వంతుకు సమానం.”