عن أبي الدرداء رضي الله عنه أن النبي صلى الله عليه وسلم قال:
«مَنْ حَفِظَ عَشْرَ آيَاتٍ مِنْ أَوَّلِ سُورَةِ الكَهْفِ، عُصِمَ مِنَ الدَّجَّالِ». وفي رواية: «مِنْ آخِرِ سُورَةِ الكَهْف».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 809]
المزيــد ...
అబూ దర్దా రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"ఎవరైతే సూరతుల్ కహఫ్ యొక్క మొదటి పది ఆయతులను (వచనాలను) కంఠస్థం చేస్తారో, వారు దజ్జాల్ ఫిత్నా నుండి రక్షించబడతారు." మరొక రివాయతులో "సూరతుల్ కహఫ్ యొక్క చివరి పది ఆయతులు." అని ఉంది.
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 809]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినారు: 'ఎవరైతే సూరతుల్ కహఫ్ ప్రారంభం నుండి పది ఆయతులను కంఠస్థము చేస్తారో, వారు చివరి కాలంలో ప్రత్యక్షమయ్యే, దైవత్వాన్ని ప్రకటించుకునే దజ్జాల్ యొక్క పరీక్ష నుండి సంరక్షించబడతారు, కాపాడబడతారు మరియు రక్షించబడతారు. దజ్జాల్ పరీక్ష, ఆదామ్ అలైహిస్సలాం సృష్టి నుండి ప్రళయ దినం వరకు భూమిపై సంభవించే పరీక్షలలో అతి గొప్ప పరీక్ష. ఎందుకంటే మహోన్నతుడై అల్లాహ్, దజ్జాల్ ప్రజలను మోసగించేలా అనేక అసాధారణ శక్తులను ప్రదర్శించే అనుమతి అతడికి ఇస్తాడు. ఈ సంరక్షణ రహస్యం: సూరతుల్ కహ్ఫ్ ప్రారంభంలోని ఆయతులలో దజ్జాల్ ప్రదర్శించే అద్భుతాల కంటే గొప్ప అద్భుతాలు మరియు సూచనలను కలిగి ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఈ ఆయతులను పఠిస్తూ ఉంటారో, వారు దజ్జాల్ చేత మోసపోరు. మరొక హదీథు ప్రకారం: 'సూరహ్ చివరి పది ఆయతులను - అల్లాహ్ వాక్కు {అఫహసిబల్లదీన కఫరూ (అవిశ్వాసులు నా దాసులను...} (18:102) నుండి ప్రారంభమయ్యే సూరహ్ చివరి భాగాన్ని కంఠస్థం చేసిన వారికి కూడా ఈ సంరక్షణ లభిస్తుంది.'"