عن أبي هريرة رضي الله عنه: أن رسول الله صلى الله عليه وسلم قال:
«لَا تَجْعَلُوا بُيُوتَكُمْ مَقَابِرَ، إِنَّ الشَّيْطَانَ يَنْفِرُ مِنَ الْبَيْتِ الَّذِي تُقْرَأُ فِيهِ سُورَةُ الْبَقَرَةِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 780]
المزيــد ...
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“మీ ఇళ్ళను స్మశానాలు గా మార్చకండి. నిశ్చయంగా ఏ ఇంటిలోనైతే సూరతుల్ బఖరహ్ పారాయణం చేయబడుతుందో ఆ ఇంటినుండి షైతాను పారిపోతాడు.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 780]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఇళ్ళలో నమాజు ఆచరించకుండా ఉండుటను, తద్వారా ఇళ్ళు స్మశానాల మాదిరిగా మారుటను నిషేధించినారు, ఎందుకంటే స్మశానలలో నమాజులు ఆచరించబడవు.
తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ఏ ఇంటిలోనైతే సూరతుల్ బఖరహ్ పారాయణం చేయబడుతుందో ఆ ఇంటి నుండి షైతాను పారిపోతాడు అని అన్నారు.