عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«لَأَنْ أَقُولَ: سُبْحَانَ اللهِ، وَالْحَمْدُ لِلهِ، وَلَا إِلَهَ إِلَّا اللهُ، وَاللهُ أَكْبَرُ، أَحَبُّ إِلَيَّ مِمَّا طَلَعَتْ عَلَيْهِ الشَّمْسُ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2695]
المزيــد ...
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“నేను ‘సుబ్’హానల్లాహి, వల్ హందులిల్లాహి, వలా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్’ అని పలకడం, సూర్యుడు ఉదయించే వాటన్నింటి కంటే కూడా నాకు అత్యంత ప్రియమైనది. (అంటే వేటివేటిపైనైతే సూర్యోదయం అవుతుందో, ఆ విషయాలన్నింటి కంటే కూడా అత్యంత ప్రియమైనదని భావము).”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2695]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: మహోన్నతుడైన అల్లాహ్’ను ఈ పదములతో స్మరించుట, ఆయనను స్తుతించుట, ఈ ప్రపంచము కంటే, ఈ ప్రపంచములోని విషయాన్నింటి కంటే కూడా ఉత్తమమైన విషయము. ఆ పదాలు ఇవి:
“సుబ్’హానల్లాహి”: మహోన్నతుడైన అల్లాహ్ లోపరహితుడు, ఆయన ఔన్నత్యము లోపరహితమైనది. మహిమ, స్తోత్రము, కీర్తి, ప్రకాశము అన్నీ కేవలం అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి అని అర్థము.
“అల్’హందులిల్లాహ్”: ‘సకల ప్రశంసలూ, కృతజ్ఞతలూ ఆయనకే శోభిస్తాయి’ – అంటే, పరిపూర్ణమైన ఆయన నామములు మరియు ఆయన గుణగణములను, ఆయనపై పూర్తి ప్రేమతో, ఆయన ఔన్నత్యాన్ని కొనియాడుట.
“లా ఇలాహ ఇల్లల్లాహ్”: ‘అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడైన నిజ ఆరాధ్యుడెవ్వరూ లేరు’
“అల్లాహు అక్బర్”: ‘అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు’, సర్వోన్నతుడు, సర్వోత్కృష్టుడు, ప్రతి దాని కంటే కూడా మహోన్నతుడు.