హదీసుల జాబితా

‘జిక్ర్’ లలో (అల్లాహ్’ను ధ్యానించు విషయాలలో) అత్యుత్తమమైనది “లా ఇలాహ ఇల్లల్లాహ్” (వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, కేవలం అల్లాహ్ తప్ప) అని పలుకుట మరియు దుఆలలో అత్యుత్తమమైనది “అల్-హందులిల్లాహ్” (సకల స్తోత్రములు కేవలం అల్లాహ్ కొరకే) అని పలుకుట”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“అల్లాహ్’కు అత్యంత ఇష్టమైన పదాలు నాలుగు; అవి ‘సుబ్’హానల్లాహ్’ (అల్లాహ్ పరమ పవిత్రుడు), ‘అల్’హందులిల్లాహ్’ (స్తోత్రములన్ని కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందినవి), ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేడు) మరియు ‘అల్లాహు అక్బర్’ (అల్లాహ్ అందరికంటే గొప్పవాడు). అయితే ఇందులో మీరు దేనితోనైనా ప్రారంభించవచ్చు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“రెండు వచనాలున్నాయి - అవి (పలుకుటలో) నాలుకపై తేలికైనవి, సత్కర్మల త్రాసులో భారమైనవి మరియు అనంత కరుణామయునికి అత్యంత ప్రియమైనవి
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నేను ‘సుబ్’హానల్లాహి, వల్ హందులిల్లాహి, వలా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్’ అని పలకడం, సూర్యుడు ఉదయించే వాటన్నింటి కంటే కూడా నాకు అత్యంత ప్రియమైనది. (అంటే వేటివేటిపైనైతే సూర్యోదయం అవుతుందో, ఆ విషయాలన్నింటి కంటే కూడా అత్యంత ప్రియమైనదని భావము).”
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఎవరైనా ఒక సభలో కూర్చుని, ఆ సభలో అల్లాహ్‌ను స్మరించకపోతే మరియు తమ ప్రవక్తపై దురూద్ పంపకపోతే, అది వారి మీద బాధగా (పాపంగా, నష్టంగా) అవుతుంది. అల్లాహ్‌ తన ఇష్ట ప్రకారం వారిని శిక్షించవచ్చు లేదా క్షమించవచ్చు
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఎవరైతే 'నేను అల్లాహ్‌ను నా ప్రభువుగా, ఇస్లాం‌ను నా ధర్మంగా, ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లంను నా ప్రవక్తగా స్వీకరించాను' అని పలుకుతారో, వారికి స్వర్గం నిశ్చయం
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్