عن أبي هريرة رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال:
«كَلِمَتَانِ خَفِيفَتَانِ عَلَى اللِّسَانِ، ثَقِيلَتَانِ فِي الْمِيزَانِ، حَبِيبَتَانِ إِلَى الرَّحْمَنِ: سُبْحَانَ اللهِ الْعَظِيمِ، سُبْحَانَ اللهِ وَبِحَمْدِهِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6406]
المزيــد ...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“రెండు వచనాలున్నాయి - అవి (పలుకుటలో) నాలుకపై తేలికైనవి, సత్కర్మల త్రాసులో భారమైనవి మరియు అనంత కరుణామయునికి అత్యంత ప్రియమైనవి. అవి ‘సుబ్’హానల్లాహి వ బిహందిహి’ (అల్లాహ్ పరమపవిత్రుడు, లోపములకు అతీతుడు మరియు అన్ని రకాల స్తోత్రములు, ప్రశంసలు కేవలం ఆయన కొరకే శోభిస్తాయి); మరియు ‘సుబ్’హానల్లాహిల్ అజీం’ (మహోన్నతుడైన అల్లాహ్ పరమపవిత్రుడు, లోపములకు అతీతుడు).
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 6406]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అత్యంత ఘనమైన రెండు వచనాల గురించి తెలియజేస్తున్నారు. ఆ రెండు వచనాలను మనిషి ఎటువంటి కష్టము లేకుండా, (ఉదయమూ, రాత్రి అనే భేదము లేకుండా) అన్ని సమయాలలో ఉచ్ఛరించగలడు. అవి అత్యంత ఘనమైన వచనాలు మరియు సత్కర్మల త్రాసులో అత్యంత భారమైనవి మరియు పరమ పావనుడు, మహోన్నతుడు, మన ప్రభువైన అనంత కరుణామయునికి అత్యంత ఇష్టమైనవి.
‘సుబ్’హానల్లాహి వ బిహందిహి’ మరియు ‘సుబ్’హానల్లాహిల్ అజీం’ - ఈ పదాలు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క మహిమను, ప్రతి విషయం లోనూ అన్ని లోపాలకూ అతీతంగా ఆయన సంపూర్ణత్వాన్ని, వాటన్నిటికీ ఆవల ఆయన ఔన్నత్యాన్ని వర్ణిస్తున్నాయి.