عَنْ جُوَيْرِيَةَ أُمِّ المؤْمنينَ رَضيَ اللهُ عنها:
أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ خَرَجَ مِنْ عِنْدِهَا بُكْرَةً حِينَ صَلَّى الصُّبْحَ، وَهِيَ فِي مَسْجِدِهَا، ثُمَّ رَجَعَ بَعْدَ أَنْ أَضْحَى، وَهِيَ جَالِسَةٌ، فَقَالَ: «مَا زِلْتِ عَلَى الْحَالِ الَّتِي فَارَقْتُكِ عَلَيْهَا؟» قَالَتْ: نَعَمْ، قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «لَقَدْ قُلْتُ بَعْدَكِ أَرْبَعَ كَلِمَاتٍ، ثَلَاثَ مَرَّاتٍ، لَوْ وُزِنَتْ بِمَا قُلْتِ مُنْذُ الْيَوْمِ لَوَزَنَتْهُنَّ: سُبْحَانَ اللهِ وَبِحَمْدِهِ، عَدَدَ خَلْقِهِ وَرِضَا نَفْسِهِ وَزِنَةَ عَرْشِهِ وَمِدَادَ كَلِمَاتِهِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2726]
المزيــد ...
ఉమ్ముల్ ముమినీన్ జువైరియహ్ రదియల్లాహు అన్హా ఉల్లేఖన:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె ఇంటి నుండి తెల్లవారుఝామున (ఫజర్ నమాజ్ తర్వాత) బయటికి వెళ్లారు. ఆమె తన నమాజు స్థలంలోనే కూర్చుండి పోయారు (అల్లాహ్ యొక్క ధ్యానం చేసుకుంటూ ఉండి పోయారు). తర్వాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుహా నమాజు సమయంలో తిరిగి వచ్చారు. ఆమె ఇంకా అక్కడే కూర్చుని ఉన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అడిగారు: "నేను నిన్ను వదిలి వెళ్లినప్పటి నుంచీ నువ్వు ఇంకా ఇదే స్థితిలో ఉన్నావా?" ఆమె చెప్పింది: "అవును." అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: "నేను నిన్ను వదిలి వెళ్లిన తర్వాత నేను నాలుగు పదాలను మూడుసార్లు స్మరించినాను. నువ్వు ఈ రోజు చేసిన దిక్ర్‌తో పోలిస్తే, అవి తూకంలో బరువుగా ఉంటాయి: అవి 'సుబహానల్లాహి వ బిహమ్'దిహి, అదద ఖల్కిహి, వ రిదా నఫ్సిహి, వ జీనత అర్షిహి, వ మిదాద కలిమాతిహి' (అర్థం: అల్లాహ్ పరమ పవిత్రుడు మరియు సకల స్తోత్రములు, కృతజ్ఞతలు ఆయనకే శోభిస్తాయి - ఆయన సృష్టిరాశుల సంఖ్య మేరకు, ఆయన సంతృప్తి మేరకు,
ఆయన అర్ష్ సింహాసనం యొక్క బరువు మేరకు, లెక్కించనలవికాని ఆయన వచనాల మేరకు)."
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2726]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన భార్య, ఉమ్ముల్ ముమినీన్ జువైరీయా (రదియల్లాహు అన్హా) వద్ద నుండి ఉదయం పూట (ఫజ్ర్ నమాజ్ తర్వాత) బయటికి వెళ్లారు. ఆ సమయంలో ఆమె నమాజు చేసిన స్థలంలోనే కూర్చుని అల్లాహ్ యొక్క ధ్యానం చేస్తూ ఉన్నారు. బాగా పొద్దెక్కిన తర్వాత, (చాష్త్ సమయంలో) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి వచ్చారు. ఆమె ఇంకా అదే స్థలంలో కూర్చుని ఉండటం చూసి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెతో ఇలా అన్నారు: "నేను నిన్ను వదిలి వెళ్లినప్పటి నుంచీ నీవు ఇంకా ఇలాగే కూర్చుని ఉన్నావా?" దానికి ఆమె "అవును" అని సమాధానము ఇచ్చినారు. అది విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెతో ఇలా పలికినారు: నేను నిన్ను వదిలి వెళ్లిన తర్వాత నాలుగు పదాలను మూడుసార్లు పలికాను. వాటి ప్రతిఫలం ఎంత గొప్పది అంటే, నీవు ఈ సమయం మొత్తం కూర్చుని చేసిన దిక్ర్‌తో పోలిస్తే, ఈ నాలుగు పదాలు తూకంలో ఎక్కువ బరువుగా ఉంటాయి: (సుబహానల్లాహ్) — అల్లాహ్‌ను అన్ని లోపాల నుండి పరమ పవిత్రుడిగా ప్రకటించడం; (వ బిహమ్'దిహి) — సకల స్తుతులు, కృతజ్ఞతలు అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి; మనకు ఈ జిక్ర్ చేయాలని మార్గనిర్దేశం చేసినందుకు కూడా ఆయనకు కృతజ్ఞత; (అదద ఖల్కిహి) — అల్లాహ్ సృష్టించిన ప్రతి దాని (దైవదూతలు, జిన్నులు, మానువులు, పశుపక్ష్యాదులు, వృక్షాలు మొదలైనవి) సంఖ్య మేరకు — ఆ సంఖ్య కేవలం అల్లాహ్ మాత్రమే తెలుసు; (వ రిదా నఫ్సిహి) — అల్లాహ్ తన దాసులపై సంతృప్తి చెందేంత వరకూ — అది ఎంత గొప్పదో, ఎంతఅపరిమితమైనదో మనం ఊహించలేం; (వ జీనత అర్షిహి) — అల్లాహ్ సింహాసనం (అర్ష్) బరువు మేరకు — అది అల్లాహ్ సృష్టిలో అత్యంత గొప్పదిగా, అత్యంత భారంగా ఉంటుంది; (వ మిదాద కలిమాతిహి) — అల్లాహ్ యొక్క అనంతమైన వచనాల మేరకు — అల్లాహ్ యొక్క వచనాలు, ఆయన జ్ఞానం, ఆయన ఆజ్ఞలు ఎన్నటికీ ముగియవు, అవి లెక్కించలేనివి. ఈ వివరణలోని మొత్తం మూడు భాగాలను ఈ జిక్ర్ కలిగి ఉంది: మొదట "అదద ఖల్కిహి" ద్వారా లెక్కించగలిగిన పరిమితిని (సంఖ్యను) సూచించబడింది. తర్వాత "రిదా నఫ్సిహి" ద్వారా పరిమితి లేని సంతృప్తిని (గుణాన్ని) సూచించబడింది. ఆపై "జీనత అర్షిహి" ద్వారా అతి గొప్పదైన, భారమైన సృష్టిని (బరువును) సూచించబడింది. చివరగా "మిదాద కలిమాతిహి" ద్వారా అల్లాహ్ వచనాలకు, ఆయన జ్ఞానానికి అంతం లేదని, అవి లెక్కించలేనివని తెలియజేయబడింది.