ఉప కూర్పులు

హదీసుల జాబితా

“ఎవరైతే రాత్రి వేళ (పడుకోబోయే ముందు) సూరతుల్ బఖరహ్ యొక్క చివరి రెండు ఆయతులు (వచనాలు) పఠిస్తాడో అది అతనికి సరిపోతుంది.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఉదయం అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు: @“అల్లాహుమ్మ బిక అస్బహ్’నా, వబిక అమ్’సైనా, వబిక నహ్యా, వబిక నమూతు, వ ఇలైకన్నుషూర్”* సాయంత్రం అయితే ఆయన (స) ఇలా పలికేవారు: “బిక అమ్’సైనా, వబిక అస్బహ్’నా, వబిక నహ్యా, వబిక నమూతు, వైలైకన్నుషూర్”. అబూహురైరహ్ (ర) ఇంకా ఇలా అన్నారు: “ఒక్కోసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అనేవారు: “...వ ఇలైకల్ మసీర్”. (ఓ అల్లాహ్! నీ ద్వారా మేము ఉదయంలోనికి ప్రవేశించినాము, మరియు నీ ద్వారా మేము సాయంత్రం లోనికి ప్రవేశించినాము; నీ ద్వారా మేము జీవిస్తున్నాము మరియు నీ ద్వారా మేము మరణిస్తాము మరియు పునరుత్థానము కూడా నీవైపునకే. ఓ అల్లాహ్! నీ ద్వారా మేము సాయంత్రం లోనికి ప్రవేశించినాము; మరియు నీ ద్వారా మేము ఉదయం లోనికి ప్రవేశించినాము, మరియు నీ ద్వారా మేము జీవిస్తున్నాము మరియు నీ ద్వారా మేము మరణిస్తాము మరియు పునరుత్థానము కూడా నీవైపునకే. (ఒక్కోసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు: “...అంతిమ గమ్యం కూడా నీ వైపునకే)
عربي ఇంగ్లీషు ఉర్దూ
సయ్యిదుల్ ఇస్తిఘ్’ఫార్*: ( అంటే “పాపక్షమాపణ కొరకు చేయు దుఆలలో (ప్రార్థనలలో) ఉత్తమమైన దుఆ): ఇలా పలకాలి: “అల్లాహుమ్మ, అంత రబ్బీ, లా ఇలాహ ఇల్లా అంత, ఖలఖ్’తనీ, వ అనా అబ్దుక, వ అనా అలా అహ్’దిక, వ వ’దిక మస్తత’తు, అఊదుబిక మిన్ షర్రి మా సన’తు, అబూఉలక బి ని’మతిక అలయ్య, వ అబూఉలక బి జంబీ ఫగ్’ఫిర్లీ, ఫ ఇన్నహు లా యగ్’ఫిరుజ్జునూబ ఇల్లా అంత” (ఓ అల్లాహ్! నీవే నా ప్రభువు, నీవు తప్ప వేరే ఆరాధ్యుడు ఎవరూ లేరు; నీవు నన్ను సృష్ఠించినావు, నేను నీ దాసుడను, నీ ఒడంబడికకు, నీకు చేసిన వాగ్దానానికి నా సామర్థ్యం మేరకు కట్టుబడి, విశ్వాసపాత్రునిగా ఉంటాను. నా కర్మల కీడు నుండి నీ రక్షణ కోరుతున్నాను. నాపై నీవు అనుగ్రహాలు కురిపించినావని అంగీకరిస్తున్నాను; అలాగే నా పాపాలను అంగీకరిస్తున్నాను. (ఓ అల్లాహ్) నన్ను క్షమించు. నీవు తప్ప పాపాలను క్షమించేవాడు ఎవ్వరూ లేరు). తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంకా ఇలా అన్నారు: “ఎవరైతే ఈ దుఆ అర్థాన్ని ఖచ్చితంగా ఆకళింపు చేసుకుని, సంపూర్ణ విశ్వాసముతో, ఉదయం ఈ దుఆను ఉచ్ఛరిస్తాడో, ఒకవేళ అతడు సాయంత్రానికి ముందే మరణిస్తే అలాంటి వ్యక్తి స్వర్గవాసులలో ఒకడు అవుతాడు. మరియు ఎవరైతే ఈ దుఆ అర్థాన్ని ఖచ్చితంగా ఆకళింపు చేసుకుని, సంపూర్ణ విశ్వాసముతో, రాత్రి ఈ దుఆను ఉచ్ఛరిస్తాడో, ఒకవేళ అతడు ఉదయానికి ముందే మరణిస్తే అలాంటి వ్యక్తి స్వర్గవాసులలో ఒకడు అవుతాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఒకనాటి చిమ్మ చీకటి రాత్రి, వర్షం కురుస్తుండగా మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు బయలుదేరినాము, మాకు నమాజు చదివించమని కోరడానికి”. ఆయన ఇంకా ఇలా అన్నారు “నేను ఆయనను పట్టుకున్నాను”. ఆయన (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఇలా అను” అన్నారు; నేను ఏమీ అనలేదు. ఆయన మళ్ళీ “ఇలా అను” అన్నారు; నేను ఏమీ అనలేదు. ఆయన తిరిగి “ఇలా అను” అన్నారు. అపుడు నేను “ఏమని అనాలి (ఓ ప్రవక్తా!)” అన్నాను. దానికి ఆయన: @“ఖుల్ హువల్లాహు అహద్” (సూరతుల్ ఇఖ్లాస్); మరియు ‘ముఅవ్విజతైన్’ (సూరతుల్ ఫలఖ్ మరియు సూరహ్ అల్-న్నాస్) వీటిని ప్రతి సాయంత్రం మరియు ప్రతి ఉదయం మూడు సార్లు పఠించు; అవి నీకు ప్రతి విషయానికీ సరిపోతాయి (అంటే ప్రతి విషయం నుండీ నీకు రక్షణ కల్పిస్తాయి)” అన్నారు.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే (సాయంత్రం పూట) మూడుసార్లు “బిస్మిల్లా హిల్లదీ లాయదుర్రు మఅస్మిహి షైఉన్, ఫిల్ అర్ది, వలా ఫిస్సమాఇ, వహువస్సమీఉల్ అలీం” (అల్లాహ్ పేరుతో; ఎవరి పేరు ప్రస్తావించబడినపుడైతే, భూమిలోనూ, మరియు ఆకాశాలలోనూ ఉన్న దేదీ హాని కలిగించలేదో; ఆయన అన్నీ వినేవాడు, సర్వఙ్ఞుడు) అని పలుకుతాడో, అతడు ఉదయం వరకు ఏ ఆకస్మిక హానికి గురికాడు*. మరియు ఎవరైతే ఈ పదాలను ఉదయం పలుకుతాడో, అతడు సాయంత్రం వరకు ఏ ఆకస్మిక హానికి గురికాడు.” (ఇది విని అక్కడే ఉన్న వ్యక్తి, పక్షవాతానికి గురి అయి ఉన్న అబాన్ ఇబ్న్ ఉథ్మాన్ (ర) ను చూడసాగినాడు, దానితో ఆయన అతనితో) “ఎందుకలా చూస్తున్నావు నా వైపు? అల్లాహ్ సాక్షిగా, నేను ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ (ర) పట్ల అబద్ధం చెప్పలేదు, అలాగే ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ (ర) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల అబద్ధం చెప్పలేదు. ఏ రోజైతే నాకు ఈ పక్షవాతం వచ్చిందో, ఆ రోజు నేను కోపంలో ఉండి ఈ మాటలు పలుకడం మర్చిపోయాను” అన్నారు.
عربي ఇంగ్లీషు ఉర్దూ
. :
عربي ఇంగ్లీషు ఉర్దూ