+ -

عَنْ شَدَّادِ بْنِ أَوْسٍ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«سَيِّدُ الِاسْتِغْفَارِ أَنْ تَقُولَ: اللَّهُمَّ أَنْتَ رَبِّي لاَ إِلَهَ إِلَّا أَنْتَ، خَلَقْتَنِي وَأَنَا عَبْدُكَ، وَأَنَا عَلَى عَهْدِكَ وَوَعْدِكَ مَا اسْتَطَعْتُ، أَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا صَنَعْتُ، أَبُوءُ لَكَ بِنِعْمَتِكَ عَلَيَّ، وَأَبُوءُ لَكَ بِذَنْبِي فَاغْفِرْ لِي، فَإِنَّهُ لاَ يَغْفِرُ الذُّنُوبَ إِلَّا أَنْتَ» قَالَ: «وَمَنْ قَالَهَا مِنَ النَّهَارِ مُوقِنًا بِهَا، فَمَاتَ مِنْ يَوْمِهِ قَبْلَ أَنْ يُمْسِيَ، فَهُوَ مِنْ أَهْلِ الجَنَّةِ، وَمَنْ قَالَهَا مِنَ اللَّيْلِ وَهُوَ مُوقِنٌ بِهَا، فَمَاتَ قَبْلَ أَنْ يُصْبِحَ، فَهُوَ مِنْ أَهْلِ الجَنَّةِ».

[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 6306]
المزيــد ...

షద్దాద్ ఇబ్న్ ఔస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా పలికినారు:
సయ్యిదుల్ ఇస్తిఘ్’ఫార్: ( అంటే “పాపక్షమాపణ కొరకు చేయు దుఆలలో (ప్రార్థనలలో) ఉత్తమమైన దుఆ): ఇలా పలకాలి: “అల్లాహుమ్మ, అంత రబ్బీ, లా ఇలాహ ఇల్లా అంత, ఖలఖ్’తనీ, వ అనా అబ్దుక, వ అనా అలా అహ్’దిక, వ వ’దిక మస్తత’తు, అఊదుబిక మిన్ షర్రి మా సన’తు, అబూఉలక బి ని’మతిక అలయ్య, వ అబూఉలక బి జంబీ ఫగ్’ఫిర్లీ, ఫ ఇన్నహు లా యగ్’ఫిరుజ్జునూబ ఇల్లా అంత” (ఓ అల్లాహ్! నీవే నా ప్రభువు, నీవు తప్ప వేరే ఆరాధ్యుడు ఎవరూ లేరు; నీవు నన్ను సృష్ఠించినావు, నేను నీ దాసుడను, నీ ఒడంబడికకు, నీకు చేసిన వాగ్దానానికి నా సామర్థ్యం మేరకు కట్టుబడి, విశ్వాసపాత్రునిగా ఉంటాను. నా కర్మల కీడు నుండి నీ రక్షణ కోరుతున్నాను. నాపై నీవు అనుగ్రహాలు కురిపించినావని అంగీకరిస్తున్నాను; అలాగే నా పాపాలను అంగీకరిస్తున్నాను. (ఓ అల్లాహ్) నన్ను క్షమించు. నీవు తప్ప పాపాలను క్షమించేవాడు ఎవ్వరూ లేరు). తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంకా ఇలా అన్నారు: “ఎవరైతే ఈ దుఆ అర్థాన్ని ఖచ్చితంగా ఆకళింపు చేసుకుని, సంపూర్ణ విశ్వాసముతో, ఉదయం ఈ దుఆను ఉచ్ఛరిస్తాడో, ఒకవేళ అతడు సాయంత్రానికి ముందే మరణిస్తే అలాంటి వ్యక్తి స్వర్గవాసులలో ఒకడు అవుతాడు. మరియు ఎవరైతే ఈ దుఆ అర్థాన్ని ఖచ్చితంగా ఆకళింపు చేసుకుని, సంపూర్ణ విశ్వాసముతో, రాత్రి ఈ దుఆను ఉచ్ఛరిస్తాడో, ఒకవేళ అతడు ఉదయానికి ముందే మరణిస్తే అలాంటి వ్యక్తి స్వర్గవాసులలో ఒకడు అవుతాడు.”

[దృఢమైనది] - [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు] - [صحيح البخاري - 6306]

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: (అల్లాహ్’ను) పాపక్షమాపణ కొరకు అర్థించేందుకు అనేక పదాలు ఉన్నాయి. అయితే వాటన్నింటిలోనూ ఉత్తమమైనది, ఉన్నతమైనది – దాసుడు ఇలా వేడుకోవడం (దుఆ చేయడం): “అల్లాహుమ్మ, అంత రబ్బీ, లా ఇలాహ ఇల్లా అంత, ఖలఖ్’తనీ, వ అనా అబ్దుక, వ అనా అలా అహ్’దిక, వ వ’దిక మస్తత’తు, అఊదుబిక మిన్ షర్రి మా సన’తు, అబూఉలక బి ని’మతిక అలయ్య, వ అబూఉలక బి జంబీ ఫగ్’ఫిర్లీ, ఫ ఇన్నహు లా యగ్’ఫిరుజ్జునూబ ఇల్లా అంత” (ఓ అల్లాహ్! నీవే నా ప్రభువువి. నీవు తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. నీవే నన్ను పుట్టించావు. నేను నీ దాసుడను. నేను నీకు చేసిన వాగ్దానానికి, నీతో చేసుకున్న ఒప్పందానికి నా శాయశక్తులా కట్టుబడి ఉన్నాను. నేను చేసిన కర్మల నుండి నీ శరణు కోరుతున్నాను. నాపై ఉన్న నీ అనుగ్రహాలను ఒప్పుకుంటున్నాను. నేను చేసిన పాపాలను ఒప్పుకుంటున్నాను. కనుక నన్ను క్షమించు. ఎందుకనగా నీవు తప్ప పాపాలను క్షమించేవాడు ఎవడూ లేడు.) ఈ దుఆలో దాసుడు ముందుగా అల్లాహ్ యొక్క తౌహీదును (ఏకత్వాన్ని) అంగీకరిస్తున్నాడు మరియు అల్లాహ్’యే తన సృష్ఠికర్త అని, తన ఆరాధ్యుడు ఆయన మాత్రమే అని, ఆయనకు సాటి, సమానులు, భాగస్వాములు ఎవరూ లేరు అని విశ్వసిస్తున్నాడు; తాను సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తో చేసిన ఒడంబడికకు కట్టుబడి ఉన్నానని, ఆయనను విశ్వసించి, తనకు వీలైనంతవరకు, తన సమర్థత మేరకు ఆయనకు విధేయత చూపుతానని పేర్కొంటున్నాడు; ఎందుకంటే దాసుడు ఎంతగా ఆరాధించినా అతడు అల్లాహ్ యొక్క ఆదేశాలను అన్నింటినీ నెరవేర్చలేడు అలాగే అల్లాహ్ తనకు ప్రసాదించిన అనుగ్రహాలకు తగినంతగా కృతఙ్ఞతలు కూడా అర్పించుకోలేడు. అప్పుడు దాసుడు అల్లాహ్ వైపునకు మరలుతాడు, ఆయనను అంటిపెట్టుకుని ఉంటాడు, తన పాపాల కీడు నుండి ఆయన రక్షణ కోరుతాడు. తరువాత అతడు అల్లాహ్ తనపై శుభాలను, అనుగ్రహాలను కురిపించినాడని స్వచ్ఛందంగా అంగీకరిస్తాడు; మరియు తాను పాపాలు చేసినానని, తద్వారా అవిధేయతకు పాల్బడినానని అంగీకరిస్తూ స్వచ్ఛందంగా ఆయన వైపునకు మరలుతాడు. అల్లాహ్’ వద్ద ఈ వేడుకోలు చేసిన తర్వాత, అతడు తన పాపాలను కప్పివేయడం ద్వారా తనను క్షమించమని, వాటి భయంకర పరిణామాలనుండి తన క్షమాభిక్షతో, తన దయ మరియు కరుణతో తనను రక్షించమని ప్రార్థిస్తాడు. ఎందుకంటే ఆయన, సర్వశక్తిమంతుడు, మహిమాన్వితుడు, మరి ఆయన తప్ప మరెవరూ పాపాలను క్షమించలేరు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేసారు – ఈ దుఆ రాత్రింబవళ్ళలో పరంపరగా నిత్యం చేయవలసిన అల్లాహ్ యొక్క స్మరణలలో (అజ్’కార్ లలో) ఒకటి, ఎవరైతే ఈ దుఆ అర్థాన్ని ఖచ్చితంగా ఆకళింపు చేసుకుని, సంపూర్ణ విశ్వాసముతో, దినపు ప్రారంభములో – సూర్యోదయము నుండి మొదలుకుని సూర్యుడు అస్తమించేవరకు మధ్య ఉన్న సమయము ఆ రోజు యొక్క పగటి సమయము అనబడుతుంది - ఈ దుఆను ఉచ్ఛరిస్తాడో, ఒకవేళ అతడు పగలు (సాయంత్రానికి ముందే) పూర్తి కాకముందే మరణిస్తే అలాంటి వ్యక్తి స్వర్గములో ప్రవేశిస్తాడు.. మరియు ఎవరైతే ఈ దుఆను రాత్రి ఉచ్ఛరిస్తాడో – అంటే సూర్యాస్తమయం నుండి మొదలుకుని సూర్యోదయం వరకు - ఒకవేళ అతడు సూర్యోదయానికి ముందే మరణిస్తే అలాంటి వ్యక్తి స్వర్గములో ప్రవేశిస్తాడు.”

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ పష్టో అస్సామీ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الصومالية Кинёрвондӣ الرومانية التشيكية Малагашӣ Урумӣ Канада الولوف الأوكرانية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. పాపక్షమాపణకు సంబంధించి చేయు దుఆలలో పదాలు, పదబంధాలు వేర్వేరుగా ఉంటాయి; కొన్ని మిగతా వాటి కంటే ఉత్తమంగా ఉంటాయి.
  2. అల్లాహ్ యొక్క క్షమాపణ కోరడంలో ఉత్తమమైన ఈ దుఆను చదవడానికి దాసుడు ఎప్పుడూ ఆసక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే పాపక్షమాపణ కొరకు చేయు దుఆలలో (ప్రార్థనలలో) ఉత్తమమైన దుఆ (సయ్యిదుల్ ఇస్తిగ్’ఫార్) ఇది.
ఇంకా