عَنْ عَبْدِ اللهِ بنِ مَسعُودٍ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«عَلَيْكُمْ بِالصِّدْقِ، فَإِنَّ الصِّدْقَ يَهْدِي إِلَى الْبِرِّ، وَإِنَّ الْبِرَّ يَهْدِي إِلَى الْجَنَّةِ، وَمَا يَزَالُ الرَّجُلُ يَصْدُقُ وَيَتَحَرَّى الصِّدْقَ حَتَّى يُكْتَبَ عِنْدَ اللهِ صِدِّيقًا، وَإِيَّاكُمْ وَالْكَذِبَ، فَإِنَّ الْكَذِبَ يَهْدِي إِلَى الْفُجُورِ، وَإِنَّ الْفُجُورَ يَهْدِي إِلَى النَّارِ، وَمَا يَزَالُ الرَّجُلُ يَكْذِبُ وَيَتَحَرَّى الْكَذِبَ حَتَّى يُكْتَبَ عِنْدَ اللهِ كَذَّابًا».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2607]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“సత్యసంధతకు కట్టుబడి ఉండండి; నిశ్చయంగా సత్యసంధత ధార్మికతకు, ధర్మబద్ధతకు దారితీస్తుంది; మరియు నిశ్చయంగా ధర్మబద్ధత స్వర్గానికి దారి తీస్తుంది. ఒక వ్యక్తి నిత్యము సత్యమునే పలుకుతూ, సత్యమును పలకడానికే కష్టపడుతూ ఉంటాడు, చివరికి అతడు అల్లాహ్ వద్ద సత్యసంధులలో నమోదు చేయబడతాడు. మరియు అసత్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. నిశ్చయంగా అసత్యము దుర్నీతికి, అధర్మానికి దారి తీస్తుంది. మరియు నిశ్చయంగా అధర్మము నరాగ్నికి దారితీస్తుంది. ఒక వ్యక్తి నిత్యము అసత్యమునే పలుకుతూ, అసత్యమును పలకడానికే కష్టపడుతూ ఉంటాడు, చివరికి అతడు అల్లాహ్ వద్ద అబద్ధాలకోరుగా నమోదు చేయబడతాడు.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 2607]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సత్యం పలకమని ఆజ్ఞాపించారు మరియు దానికి కట్టుబడి ఉండటం నిరంతర సత్కార్యాలకు దారి తీస్తుంది అని తెలియజేసారు. నిలకడగా మంచిపనులు చేయడం అనేది చేసే వ్యక్తిని స్వర్గానికి చేరుస్తుంది మరియు అతను రహస్యంగానూ మరియు బహిరంగంగానూ సత్యాన్ని అవలంబిస్తూనే ఉంటాడు. అటువంటి వ్యక్తి అత్యంత సత్యవంతునిగా ముద్ర వేయబడటానికి అర్హుడు అవుతాడు. ఇది సత్యసంధత యొక్క పరాకాష్ఠ. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసత్యం పలుకుట పట్ల మరియు తప్పుడు మాటలు మాట్లాడుట పట్ల హెచ్చరించారు. ఎందుకంటే అది ధర్మం నుండి వైదొలగడానికి మరియు చెడు, అవినీతి మరియు పాపపు పనులకు పాల్బడడానికి దారి తీస్తుంది; చివరికి నరకాగ్నికి దారి తీస్తుంది. అతడు నిరంతరం అసత్యమునే పలుకుతూ ఉంటాడు, చివరికి అతడు అల్లాహ్ వద్ద అబద్ధాలకోరులలో ఒకనిగా నమోదు చేయబడతాడు.