+ -

عَنْ أَنَسٍ رضي الله عنه قَالَ:
كَانَ أَكْثَرُ دُعَاءِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «اللَّهُمَّ رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا حَسَنَةً، وَفِي الآخِرَةِ حَسَنَةً، وَقِنَا عَذَابَ النَّارِ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6389]
المزيــد ...

అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
(మిగతా దుఆల కన్నా) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దుఆ ఎక్కువగా పఠించేవారు: “అల్లాహుమ్మ, రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతన్, వ ఫిల్ ఆఖిరతి హసనతన్, వఖినా అజాబన్నార్” (ఓ అల్లాహ్! మా ప్రభువా! ఈ ప్రపంచములో మాకు మంచిని కలుగజేయుము, మరియు పరలోకమునందును మాకు మంచిని కలుగజేయుము, మరియు నరకాగ్ని నుండి మమ్ములను రక్షింపుము.”

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 6389]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనేక దుఆలు చేసేవారు; వాటిలో ఈ దుఆ కూడా ఒకటి: “అల్లాహుమ్మ, రబ్బనా, ఆతినా ఫిద్దున్యా హసనతన్, వ ఫిల్ ఆఖిరతి హసనతన్, వఖినా అజాబన్నార్”(ఓ మా ప్రభువా మాకు ఇహలోకములో మంచిని,పరలోకములో మంచిని ప్రసాధించు మరియు మమ్మల్ని నరక శిక్ష నుండి రక్షించు.) ఈ ప్రార్థనలో, ఈ లోకంలో ఉన్న మంచి విషయాలు ప్రసాదించమనే అభ్యర్థన ఉన్నది, ఉదాహరణకు: ఆమోద యోగ్యమైన, విస్తారమైన మరియు చట్టబద్ధమైన (హలాల్) సంపాదన; ధార్మికురాలైన జీవిత భాగస్వామి, కనులకు చలువను చేకూర్చే సంతానము, జీవితములో ఉపశమనము, ప్రయోజనకరమైన జ్ఞానం, ఉత్తమమైన ఆచరణలు, ఇంకా జీవితానికి అవసరమైన మరియు అనుమతించబడిన ఇటువంటి అనేక ఇతర విషయాలు; అలాగే పరలోకములోనూ మంచిని ప్రసాదించమనే అభ్యర్థన ఉన్నది, ఉదాహరణకు: సమాధి శిక్షనుండి సురక్షితంగా ఉండుట, తీర్పు దినము నాడు నిలబడి ఉండు స్థితి నుండి సురక్షితంగా ఉండుట, మరియు నరకాగ్ని నుండి సురక్షితంగా ఉండుట; అలాగే అల్లాహ్ యొక్క ప్రసన్నతను, ఆయనకు ఇష్ఠులయ్యే భాగ్యాన్ని పొందుట; తీర్పు దినమునాడు సాఫల్యవంతులగుట; శాశ్వతమైన సుఖసంతోషాలతో అనంత కరుణామయుడైన ఆ ప్రభువు యొక్క సాన్నిహిత్యాన్ని పొందుట మొదలైనవన్ని.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం థాయ్ పష్టో అస్సామీ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الصومالية Кинёрвондӣ الرومانية المجرية التشيكية الموري Малагашӣ Урумӣ Канада الولوف الأوكرانية الجورجية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం వారి ఉదాహరణను ను అనుసరించి సమగ్రమైన దుఆ (ప్రార్థన, వేడుకోలు) చేయడం అభిలషణీయం.
  2. ఒక వ్యక్తి తన ప్రార్థనలో (దుఆలో) ఈ లోకానికి చెందిన మంచిని మరియు పరలోకానికి చెందిన మంచిని కలిపి దుఆ చేస్తే అది అతని కొరకు మరింత పరిపూర్ణమైన దుఆ అవుతుంది.
ఇంకా