+ -

عَن عبدِ اللهِ بن خُبَيب رضي الله عنه أنه قال:
خَرَجْنَا فِي لَيْلَةٍ مَطِيرَةٍ وَظُلْمَةٍ شَدِيدَةٍ، نَطْلُبُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ؛ يُصَلِّي لَنَا، قَالَ: فَأَدْرَكْتُهُ، فَقَالَ: «قُلْ»، فَلَمْ أَقُلْ شَيْئًا، ثُمَّ قَالَ: «قُلْ»، فَلَمْ أَقُلْ شَيْئًا، قَالَ: «قُلْ»، فَقُلْتُ: مَا أَقُولُ؟ قَالَ: «{قُلْ هُوَ اللهُ أَحَدٌ} وَالْمُعَوِّذَتَيْنِ حِينَ تُمْسِي وَتُصْبِحُ ثَلَاثَ مَرَّاتٍ، تَكْفِيكَ مِنْ كُلِّ شَيْءٍ».

[صحيح] - [رواه أبو داود والترمذي والنسائي] - [سنن الترمذي: 3575]
المزيــد ...

అబ్దుల్లాహ్ ఇబ్నె ఖుబైబ్ రజియల్లాహు అన్హు కధనం :
“ఒకనాటి చిమ్మ చీకటి రాత్రి, వర్షం కురుస్తుండగా మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు బయలుదేరినాము, మాకు నమాజు చదివించమని కోరడానికి”. ఆయన ఇంకా ఇలా అన్నారు “నేను ఆయనను పట్టుకున్నాను”. ఆయన (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఇలా అను” అన్నారు; నేను ఏమీ అనలేదు. ఆయన మళ్ళీ “ఇలా అను” అన్నారు; నేను ఏమీ అనలేదు. ఆయన తిరిగి “ఇలా అను” అన్నారు. అపుడు నేను “ఏమని అనాలి (ఓ ప్రవక్తా!)” అన్నాను. దానికి ఆయన: “ఖుల్ హువల్లాహు అహద్” (సూరతుల్ ఇఖ్లాస్); మరియు ‘ముఅవ్విజతైన్’ (సూరతుల్ ఫలఖ్ మరియు సూరహ్ అల్-న్నాస్) వీటిని ప్రతి సాయంత్రం మరియు ప్రతి ఉదయం మూడు సార్లు పఠించు; అవి నీకు ప్రతి విషయానికీ సరిపోతాయి (అంటే ప్రతి విషయం నుండీ నీకు రక్షణ కల్పిస్తాయి)” అన్నారు.

[దృఢమైనది] - - [سنن الترمذي - 3575]

వివరణ

ఒక గొప్ప సహాబీ – అబ్దుల్లాహ్ ఇబ్నె ఖుబైబ్ రజియల్లాహు అన్హు – బాగా వర్షం కురుస్తూ, చిమ్మ చీకటిగా ఉన్న ఒక రాత్రి తాము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు, తమకు నమాజు చదివించమని కోరడాని బయలుదేరినామని, మరియు ఆయనను చూసినామని అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనతో “ఇలా అను” అన్నారు, అంటే అక్కడ దాని అర్థం “పఠించు” అని. కానీ ఆయన ఏమీ పఠించకుండా అలాగే నిలబడ్డారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అవే మాటలను తిరిగి అన్నారు. అపుడు అబ్దుల్లాహ్ ఇబ్న్ ఖుబైబ్ “ఏమి పఠించను, ఓ ప్రవక్తా!” అన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “సూరహ్ అల్ ఇఖ్లాస్ (ఖుల్ హువాల్లాహు అహద్), మరియు ముఅవ్విజతైన్’ (సూరహ్ అల్ ఫలఖ్ - “ఖుల్ అఊజు బిరబ్బీల్ ఫలఖ్”, మరియు సూరహ్ అన్నాస్ “ఖుల్ అఊజు బిరబ్బీన్నాస్”) వీటిని సాయంత్రపు సమయాన, మరియు ఉదయం మూడు సార్లు పఠించు. అవి నీకు అన్ని విధాలా కీడు నుండి, మరియు అన్ని రకాల ఆపదల నుండి రక్షణ కల్పిస్తాయి” అన్నారు.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ పష్టో అస్సామీ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الصومالية Кинёрвондӣ الرومانية التشيكية Малагашӣ Урумӣ Канада الولوف
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. “సూరహ్ అల్ ఇఖ్లాస్ (ఖుల్ హువాల్లాహు అహద్), మరియు ముఅవ్విజతైన్’ (సూరహ్ అల్ ఫలఖ్ - “ఖుల్ అఊజు బిరబ్బీల్ ఫలఖ్”, మరియు సూరహ్ అన్నాస్ “ఖుల్ అఊజు బిరబ్బీన్నాస్”) వీటిని సాయంత్రపు సమయాన, మరియు ఉదయం మూడు సార్లు పఠించుట అభిలషణీయం; అది అన్ని రకాల చెడు మరియు కీడు, హాని నుండి రక్షణ అవుతుంది.
  2. ఈ హదీసులో సూరహ్ అల్ ఇఖ్లాస్, మరియు ముఅవ్విజతైన్’లను పఠించుట యొక్క ఘనత తెలుస్తున్నది.
ఇంకా