عَنْ أَنَسٍ رضي الله عنه:
أَنَّ نَفَرًا مِنْ أَصْحَابِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ سَأَلُوا أَزْوَاجَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ عَمَلِهِ فِي السِّرِّ؟ فَقَالَ بَعْضُهُمْ: لَا أَتَزَوَّجُ النِّسَاءَ، وَقَالَ بَعْضُهُمْ: لَا آكُلُ اللَّحْمَ، وَقَالَ بَعْضُهُمْ: لَا أَنَامُ عَلَى فِرَاشٍ، فَحَمِدَ اللهَ وَأَثْنَى عَلَيْهِ، فَقَالَ: «مَا بَالُ أَقْوَامٍ قَالُوا كَذَا وَكَذَا؟ لَكِنِّي أُصَلِّي وَأَنَامُ، وَأَصُومُ وَأُفْطِرُ، وَأَتَزَوَّجُ النِّسَاءَ، فَمَنْ رَغِبَ عَنْ سُنَّتِي فَلَيْسَ مِنِّي».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1401]
المزيــد ...
అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలలో నుండి ఒక బృందం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యల వద్దకు వచ్చి, "ఆయన సల్లల్లాహు అలైహి వ సల్లం ఏకాంతంలో ఏయే పనులు (ఆరాధనలు) చేస్తారు?" అని అడిగినారు, వారిలో కొందరు ఇలా అన్నారు: నేను స్త్రీలను వివాహం చేసుకోను. మరికొందరు ఇలా అన్నారు: నేను మాంసం తినను. మరికొందరు ఇలా అన్నారు: నేను మంచం మీద పడుకోను. ఇది తెలిసిన తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మొదట అల్లాహ్‌ను స్తుతించారు, తరువాత ఆయనను ప్రశంసించి, ఇలా పలికినారు: "నేను అలా చేయ్యను, నేను ఇలా చేయ్యను అని చెప్పిన వారి గతి ఏమిగాను? నిజానికి, నేను నమాజు చేస్తాను మరియు నిద్ర పోతాను, నేను ఉపవాసం ఉంటాను మరియు ఉపవాసం విరమిస్తాను మరియు నేను స్త్రీలను వివాహం చేసుకుంటాను. నా సున్నతు నుండి తప్పుకున్నవాడు నాకు చెందినవాడు కాదు."
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 1401]
సహాబాల ఒక బృందం రదియల్లాహు అన్హుమ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యల ఇళ్లకు వచ్చి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో చేసే ఆరాధనల గురించి అడిగారు. వారికి సమాధానం అందిన తరువాత, వారికి తమ ఆరాధనలు తక్కువగా ఉన్నట్లు అనిపించి ఉండవచ్చు, కాబట్టి వారు ఇలా అన్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పోలిస్తే మనం ఎక్కడ? ఆయన గత మరియు భవిష్యత్తు పొరపాట్టలు, తప్పులు క్షమించబడ్డాయి. అయితే వారు క్షమాపణ పొందారో లేదో తెలియని స్థితిలో ఉన్న వారిలా కాకుండా, దానిని పొందాలనే ఆశతో వారు ఆరాధనలు పెంచాలని భావించారు. అప్పుడు వారిలో కొందరు ఇలా అన్నారు: నేను స్త్రీలను వివాహం చేసుకోను. మరికొందరు: నేను మాంసం తినను అన్నారు. మరికొందరు ఇలా అన్నారు: నేను మంచం మీద పడుకోను. ఈ విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లంకు చేరగానే, ఆయన కోపంగా ఉండి ప్రజలకు ఒక ఉపన్యాసం ఇచ్చారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్‌ను స్తుతిస్తూ, ఆయనను ప్రశంసిస్తూ ఇలా అన్నారు: "ఇలాంటివి మాటలు అన్న వ్యక్తుల సంగతి ఏమిటి? అల్లాహ్ సాక్షిగా, నేను మీ అందరిలో అల్లాహ్‌కు అత్యంత ఎక్కువగా భయపడేవాడిని మరియు ఆయన పట్ల అత్యంత ఎక్కువ శ్రద్ధ గలవాడిని, కానీ నేను నమాజులలో నిలబడేందుకు వీలుగా శక్తి పుంజుకోవడానికి నేను నిద్రపోతాను కూడా. అలాగే ఉపవాసం కోసం నన్ను నేను బలపరచుకోవడానికి కొన్ని రోజులు నా ఉపవాసాన్ని విరమించు కుంటాను కూడా. అలాగే నేను స్త్రీలను వివాహం చేసుకుంటాను. నా మార్గాన్ని విడిచి, వేరే మార్గంలో పరిపూర్ణతను ఊహించుకుని, నా మార్గం కాకుండా వేరే మార్గాన్ని అనుసరించేవాడు నాకు చెందినవాడు కాడు."