عَنْ عَلِيٍّ رضي الله عنه:
أَنَّ فَاطِمَةَ رَضيَ اللهُ عنْها أَتَتِ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ تَشْكُو إِلَيْهِ مَا تَلْقَى فِي يَدِهَا مِنَ الرَّحَى، وَبَلَغَهَا أَنَّهُ جَاءَهُ رَقِيقٌ، فَلَمْ تُصَادِفْهُ، فَذَكَرَتْ ذَلِكَ لِعَائِشَةَ، فَلَمَّا جَاءَ أَخْبَرَتْهُ عَائِشَةُ، قَالَ: فَجَاءَنَا وَقَدْ أَخَذْنَا مَضَاجِعَنَا، فَذَهَبْنَا نَقُومُ، فَقَالَ: «عَلَى مَكَانِكُمَا» فَجَاءَ فَقَعَدَ بَيْنِي وَبَيْنَهَا، حَتَّى وَجَدْتُ بَرْدَ قَدَمَيْهِ عَلَى بَطْنِي، فَقَالَ: «أَلاَ أَدُلُّكُمَا عَلَى خَيْرٍ مِمَّا سَأَلْتُمَا؟ إِذَا أَخَذْتُمَا مَضَاجِعَكُمَا -أَوْ أَوَيْتُمَا إِلَى فِرَاشِكُمَا- فَسَبِّحَا ثَلاَثًا وَثَلاَثِينَ، وَاحْمَدَا ثَلاَثًا وَثَلاَثِينَ، وَكَبِّرَا أَرْبَعًا وَثَلاَثِينَ، فَهُوَ خَيْرٌ لَكُمَا مِنْ خَادِمٍ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5361]
المزيــد ...
అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం :
ఫాతిమా (రదియల్లాహు అన్హా), తిరగలి (ఇసుర్రాయి) కారణంగా తన చేతులు ఏ విధంగా అయి పోతున్నాయో చూడండి అంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ వద్ద ఫిర్యాదు చేసారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ వద్దకు కొంతమంది బానిస బాలికలను తీసుకు వచ్చినారని ఆమె విని ఉన్నది. కానీ (ఆమె అక్కడికి వచ్చినప్పుడు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెకు కనిపించలేదు. ఫాతిమా రదియల్లాహు అన్హా తన సమస్యను ఆయిషా రదియల్లాహు అన్హా కు చెప్పింది. ఆయిషా రదియల్లాహు అన్హా ఆ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియజేసినారు.” అలీ రదియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: “(ఆ రాత్రి) మేము నిద్రపోవడానికి ఉపక్రమిస్తున్నపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మా వద్దకు వచ్చినారు. ఆయన రాగానే మేము లేవాలని అనుకున్నాము. కానీ ఆయన “(లేవకండి) అలాగే ఉండండి” అని అన్నారు. ఆయన మా వద్దకు వచ్చి మా మధ్య కూర్చొన్నారు. ఆయన పాదాల చల్లదనం నా ఉదరానికి తగిలినది. అపుడు ఆయన ఇలా అన్నారు: “నువ్వు కోరిన దానికంటే మంచి దాని వైపునకు నేను మార్గదర్శకం చేయనా? మీరు రాత్రి పడుకునేటపుడు “సుబ్’హానల్లాహ్” అని ముఫ్ఫై మూడు సార్లు, “అల్’హందులిల్లాహ్” అని ముఫ్ఫై మూడు సార్లు, మరియు “అల్లాహు అక్బర్” అని ముఫ్ఫై నాలుగు సార్లు ఉచ్ఛరించండి. అది (ఇంటిలో) ఒక సేవకుడిని కలిగి ఉండడం కంటే మేలైనది, శుభప్రదమైనది.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 5361]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ కుమార్తె అయిన ఫాతిమా (రదియల్లాహు అన్హా) తిరగలి (ఇసుర్రాయి) కారణంగా తన చేతులు ఏ విధంగా పాడవుతున్నాయో చూడండి అంటూ ఫిర్యాదు చేయడం చూస్తున్నాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు కొంత మంది యుద్ధఖైదీలు వచ్చినారని తెలుసుకుని వారిలో ఒకరిని, తన ఇంటి పనుల కొరకు తనకు సేవకురాలిగా ఇవ్వమని అడగడానికి ఆమె ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళినది. ఆమె వెళ్ళినపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటిలో లేరు. ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉన్నారు. ఫాతిమా రదియల్లాహు అన్హా తన సమస్యను ఆమెకు వివరించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటికి తిరిగి వచ్చినపుడు ఆయిషా రదియల్లాహు అన్హా, ఫాతిమారదియల్లాహు అన్హా ఒక సేవకురాలి కొరకు అడగడానికి వచ్చిన విషయాన్ని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లమ్ కు తెలియజేసినారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫాతిమా మరియు అలీ రదియల్లాహు అన్హుమ్ ల వద్దకు వచ్చారు. అపుడు వారు పక్కలు పరుచుకుని నిద్రకు ఉపక్రమిస్తున్నారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లమ్ వారిద్దరి మధ్య కూర్చున్నారు. వారి పాదాల చల్లదనం అలీ రదియల్లాహు అన్హు కు తెలుస్తున్నది. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఇలా అన్నారు: “మీరు ఏదైతే సేవకురాలిని ఇవ్వమని అడగడానికి వచ్చారో, దానికంటే మేలైన దానిని నేను మీకు బోధించనా?” వారిద్దరూ “తప్పనిసరిగా బోధించండి” అన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “రాత్రి మీరు నిద్రించడానికి ముందు ముఫ్ఫై నాలుగు సార్లు “అల్లాహు అక్బర్” అని పలుకుతూ అల్లాహ్ యొక్క ఔన్నత్యాన్ని కొనియాడండి;” “ముఫ్ఫైమూడు సార్లు “సుబ్’హానల్లాహ్” అని పలికి ఆయన ఘనతను కీర్తించండి;” “మరియు “సుబ్’హానల్లాహ్” అని ముఫ్ఫైమూడు సార్లు పలికి “సకల స్తోత్రములూ ఆయనకే శోభిస్తాయి” అని ఉచ్ఛరించండి.” “ఈ విధంగా అల్లాహ్’ను స్తుతించడం, ఒక సేవకుడిని కలిగి ఉండడం కన్నా మీకు మేలైనది.”