عن عبد الله بن مسعود رضي الله عنه عن النبي صلى الله عليه وسلم أنه قال: "أكبر الكبائر: الإشراك بالله، والأمن من مَكْرِ الله، والقُنُوطُ من رحمة الله، واليَأْسُ من رَوْحِ الله".
[إسناده صحيح] - [رواه عبد الرزاق]
المزيــد ...
అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హు కథనం మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తెలియపర్చారు’మహాపరాధలలో అతి ఘోరమైనది ‘అల్లాహ్ కు ఇతరులను భాగస్వామ్యులుగా చేయడం‘అల్లాహ్ యొక్క శక్తి నుండి బేఖాతరు చేయకపోవడం,అల్లాహ్ కారుణ్యం నుండి నిరాశ చెందడం,అల్లాహ్ యొక్క ఆత్మ నుండి నమ్మకం కోల్పోవడం.
[దాని ఆధారాలు దృఢమైనవి] - [దాన్ని అబ్దుర్రజ్జాఖ్ ఉల్లేఖించారు]
ఈ హదీసులో మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ మహాపరదాలుగా ఉన్న కొన్ని పాపాలను ప్రస్తావించారు,అవి : పరమపవిత్రుడైన అల్లాహ్ పోషణలో,లేక ఆరాధనలో ఇతరులను సాటి కల్పించడం,దీన్ని మొదట ప్రస్తావించడం జరిగింది ఎందుకంటే అది పాపాల్లో కెల్లా అతిపెద్ద పాపము,మరియు అల్లాహ్ కారుణ్యము నుండి నిరాశ చెందడం,ఎందుకంటే ఇది అల్లాహ్ పట్ల చెడు అనుమానము మరియు ఆయన కారుణ్య వైశాల్యత పట్ల అజ్ఞానము కలిగియుండటము,అల్లాహ్ తన దాసులపై వరాలు కురిపిస్తూ గడువు ఇస్తూ ఉండటం మరియు మరూపాటులో ఉన్నప్పుడూ హఠాత్తుగా పట్టుకోవడం వంటి వాటినుండి భయము లేకుండా ఉండటము,ఈ హదీసు అర్ధము ప్రస్తావించబడ్డ పాపాలు మాత్రమే పెద్దవి అని కాదు,మహాపాపాలు ఎన్నో ఉన్నాయి,అందులో అన్నింటికంటే పెద్ద పాపాలను ఇక్కడ ప్రస్తావించబడింది.