عَنْ عَبْدِ اللهِ بنِ مَسْعُودٍ رضي الله عنه قال:
قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم كَلِمَةً وَقُلْتُ أُخْرَى، قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: «مَنْ مَاتَ وَهُوَ يَدْعُو مِنْ دُونِ اللهِ نِدًّا دَخَلَ النَّارَ» وَقُلْتُ أَنَا: مَنْ مَاتَ وَهُوَ لَا يَدْعُو لِلهِ نِدًّا دَخَلَ الْجَنَّةَ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 4497]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మాట అన్నారు; దానిపై నేను రెండో మాట అన్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “ఎవరైతే అల్లాహ్ ను గాక ఇంకెవరినైనా అల్లాహ్ కు సాటి కల్పిస్తూ వేడుకుంటాడో, మరియు ఆ విధానం పైనే మరణిస్తాడో అతడు నరకాగ్ని లోనికి ప్రవేశిస్తాడు.” మరియు నేను ఇలా అన్నాను “ఎవరైతే అల్లాహ్ ను గాక మరింకెవరినీ వేడుకొనడో అతడు స్వర్గములోనికి ప్రవేశిస్తాడు.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 4497]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఇలా తెలుపుతున్నారు: ఎవరైతే అల్లాహ్ కు చెందవలసిన దానిని వేరే ఇంకెవరికైనా అంకితం చేస్తారో, ఉదాహరణకు అల్లాహ్ కు కాకుండా వేరే వారికి దుఆ చేయడం, లేక ఆయనను గాక సహాయం కొరకు (ఆయన స్థానములో) వేరే ఇంకెవరినైనా అర్థిస్తాడో – మరియు అదే విధానం పై మరణిస్తాడు అతడు నరకవాసులలోని వాడు అవుతాడు. అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు దానికి కొనసాగింపుగా ఇలా అన్నారు: “ఎవరైతే ఎవరినీ లేక దేనిని అల్లాహ్ కు సాటి కల్పించకుండా, ఆ స్థితిలోనే మరణిస్తాడో అతని గమ్యస్థానము స్వర్గము.”