+ -

عَنْ عَائِشَةَ أُمِّ المُؤمنينَ رضي الله عنها قَالَتْ:
كَانَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يُعْجِبُهُ التَّيَمُّنُ، فِي تَنَعُّلِهِ، وَتَرَجُّلِهِ، وَطُهُورِهِ، وَفِي شَأْنِهِ كُلِّهِ.

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 168]
المزيــد ...

ఉమ్ముల్ ము’మినీన్ (విశ్వాసుల మాత) ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖనం :
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుడి పార్శ్వానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు, పాదరక్షలు తొడుగుకొనుట, తలవెంట్రుకలు దువ్వుట, స్నానం చేయుట మొదలైన (ఉపయుక్తమైన) పనులన్నింటినీ కుడి వైపునుండి ప్రారంభించేవారు."

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 168]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తనకు సంబంధించిన విషయాలలో, గౌరవప్రదమైన పనులన్నింటినీ కుడి వైపునుండి ప్రారంభించడానికి ఇష్టపడేవారు మరియు ప్రాధాన్యతనిచ్చేవారు, వాటిలో కొన్ని: కాలికి పాదరక్షలను తొడిగేటపుడు వారు ముందుగా కుడికాలుతో ప్రారంభించేవారు; ఆయన తన తల మరియు గడ్డం యొక్క వెంట్రుకలను దువ్వునపుడు, వాటిని సవరించి, ఒద్దికగా ఒక రూపునిచ్చునపుడు, మరియు నూనె రాయునపుడు కుడి వైపునుండి ప్రారంభించేవారు. అలాగే ఉదూలో కూడా చేతులను మరియు కాళ్ళను కడుగునపుడు ఎడమ పార్శముపై కుడి పార్శ్వానికి ప్రాధాన్యతనిచ్చేవారు.

من فوائد الحديث

  1. ఇమాం అన్’నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఇది షరియత్’లో ఒక నిరంతర నియమం - గౌరవాస్పదమైన వాటికి తగిన గౌరవాన్నివ్వడం. కుడి వైపునుండి మొదలు పెట్టడం కూడా అటువంటిదే; ఉదాహరణకు: వస్త్రధారణ చేయునపుడు (చొక్కా, పాంటు, పాజామా మొ. తొడుగునపుడు); పాదరక్షలు తొడుగునపుడు; మస్జిదులోనికి ప్రవేశించునపుడు, పంటి పుల్ల (మిస్వాక్) ఉపయోగించునపుడు, కళ్ళకు ‘కొహ్ల్’ (సుర్మా, కాటుక మొ.) ఉపయోగించునపుడు; కాలి మరియు వేలి గోళ్ళు తీయవలసి వచ్చినపుడు; మీసములు కత్తిరించునపుడు; తలవెంట్రుకలు దువ్వునపుడు; చంకలలోని వెంట్రుకలను తొలగించునపుడు; తలవెంట్రుకలను గొరుగునపుడు (గుండు కొట్టించునపుడు); నమాజు ముగింపుకు ముందు సలాం చెప్పునపుడు; ఉదూలో శుభ్రపరుచుకొనవలసిన అవయవాలను కడుగునపుడు; మరుగుదొడ్డి నుండి బయటకు వచ్చునపుడు; తినుట, త్రాగుట, కరచాలనము చేయుట, మరియు హజ్, ఉమ్రాలలో ‘హజ్రె అస్వద్’ రాతిని తాకుట మొదలైన పనులలో; అలాగే ఇదే కోవకు చెందిన ఇతర పనులను కుడి వైపునుండి ప్రారంభించుట అభిలషణీయము. పైన పేర్కొన్న వాటికి విరుద్ధమైన పనులకు, అంటే ఉదాహరణకు: మరుగుదొడ్డి లోనికి ప్రవేశించుట; మస్జిదు నుండి బయటకు వచ్చుట; కాలకృత్యములు తీర్చుకున్న తరువాత శుభ్రపరుచుకొనుట; వొంటిపై తొడిగి ఉన్న వస్త్రాలను (చొక్కా, థోబు, పాంటు, పాజామా మొ.) తీయుట; పాదరక్షలను తొలగించుట మొదలైన ఇదే కోవకు చెందిన పనుల కొరకు ఎడమ చేతిని ఉపయోగించుట, ఎడమ వైపునుండి మొదలుపెట్టుట సిఫారసు చేయబడినది. ఇదంతా (షరియత్’లో) కుడి చేతికి, కుడి పార్శ్వానికి ఉన్న గౌరవం మరియు ఘనత కారణంగానే.
  2. “ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కుడి వైపునుండి మొదలు పెట్టుటకు ప్రాధాన్యతను ఇచ్చేవారు” అంటే దాని అర్థము: (గౌరవాస్పదమైన పనులను) కుడి చేతితో, లేక కుడి వైపునుండి ప్రారంభించుట; కుడి కాలితో ప్రారంభించుట మొదలైనవి, అలాగే వ్యవహారాలను కుడి పార్శ్వము నుండి నిర్వహించుట మొదలైనవి అన్నీ ఈ అర్థములోనికే వస్తాయి.
  3. ఇమాం అన్’నవవీ ఇలా అన్నారు: ఉదూలో కడుగవలసిన కొన్ని భాగాలను కుడి వైపు నుండి కడుగుట ప్రారంభించుట అభిలషణీయం కాదు (ఈ భాగాలకు కుడి వైపు నుండి మొదలుపెట్టాలి అనే నియమం వర్తించదు). ఉదాహరణకు: చెవులు, అరచేతులు, చెంపలు – ఈ భాగాలు రెండూ కలిపి ఒకేసారి కడుగబడతాయి. ఒకవేళ అలా రెండింటినీ ఒకేసారి కడుగుట సాధ్యం కాకపోతే, అంటే ఉదాహరణకు ఒక చేయి మాత్రమే కలిగి ఉన్న వ్యక్తి, లేక అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే – అతడు ముందుగా కుడి భాగాన్ని కడగాలి.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ పష్టో అస్సామీ السويدية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية الليتوانية الدرية الصربية Кинёрвондӣ الرومانية المجرية التشيكية الموري Малагашӣ Урумӣ Канада الولوف Озарӣ الأوكرانية الجورجية المقدونية
అనువాదాలను వీక్షించండి
ఇంకా