عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
أَنَّهُ كَانَ يَقُولُ إِذَا أَصْبَحَ: «اللهُمَّ بِكَ أَصْبَحْنَا، وَبِكَ أَمْسَيْنَا، وَبِكَ نَحْيَا، وَبِكَ نَمُوتُ، وَإِلَيْكَ النُّشُورُ» وَإِذَا أَمْسَى قَالَ: «بِكَ أَمْسَيْنَا، وَبِكَ أَصْبَحْنَا، وَبِكَ نَحْيَا، وَبِكَ نَمُوتُ، وَإِلَيْكَ النُّشُورُ» قَالَ: وَمَرَّةً أُخْرَى: «وَإِلَيْكَ الْمَصِيرُ».
[حسن] - [رواه أبو داود والترمذي والنسائي في الكبرى وابن ماجه] - [السنن الكبرى للنسائي: 10323]
المزيــد ...
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఉదయం అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు: “అల్లాహుమ్మ బిక అస్బహ్’నా, వబిక అమ్’సైనా, వబిక నహ్యా, వబిక నమూతు, వ ఇలైకన్నుషూర్” సాయంత్రం అయితే ఆయన (స) ఇలా పలికేవారు: “బిక అమ్’సైనా, వబిక అస్బహ్’నా, వబిక నహ్యా, వబిక నమూతు, వైలైకన్నుషూర్”. అబూహురైరహ్ (ర) ఇంకా ఇలా అన్నారు: “ఒక్కోసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అనేవారు: “...వ ఇలైకల్ మసీర్”.
(ఓ అల్లాహ్! నీ ద్వారా మేము ఉదయంలోనికి ప్రవేశించినాము, మరియు నీ ద్వారా మేము సాయంత్రం లోనికి ప్రవేశించినాము; నీ ద్వారా మేము జీవిస్తున్నాము మరియు నీ ద్వారా మేము మరణిస్తాము మరియు పునరుత్థానము కూడా నీవైపునకే. ఓ అల్లాహ్! నీ ద్వారా మేము సాయంత్రం లోనికి ప్రవేశించినాము; మరియు నీ ద్వారా మేము ఉదయం లోనికి ప్రవేశించినాము, మరియు నీ ద్వారా మేము జీవిస్తున్నాము మరియు నీ ద్వారా మేము మరణిస్తాము మరియు పునరుత్థానము కూడా నీవైపునకే. (ఒక్కోసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు: “...అంతిమ గమ్యం కూడా నీ వైపునకే)
[ప్రామాణికమైనది] - - [السنن الكبرى للنسائي - 10323]
ఉషోదయపు వెలుగు నుంచి ఉదయములోనికి ప్రవేశించునపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు:
(అల్లాహుమ్మ, బిక అస్బహ్’నా) ఓ అల్లాహ్! నీ ద్వారా మేము ఉదయాన్ని ప్రారంభించినాము, నీ రక్షణను దుస్తులుగా ధరించి, నీ కృపలో మునిగి, నీ నామస్మరణలో నిమగ్నమై, నీ నామం సహాయంతో నీ సహాయాన్ని కోరుతూ, నీవు ప్రసాదించే విజయాన్ని ఆవరింపజేసుకుని, నీవు ప్రసాదించిన బలమూ మరియు శక్తితో కదులుతూ (ఓ అల్లాహ్! మేము నీ ద్వారా ఉదయాన్ని ప్రారంభించినాము). (వబిక అమ్’సైనా, వబిక నహ్యా, వబిక నమూతు) దీని అర్థము ‘ఓ అల్లాహ్! నీ ద్వారా మేము సాయంకాలము లోనికి ప్రవేశించినాము, నీ ద్వారా మేము జీవించి ఉన్నాము, మరియు నీ ద్వారా మేము మరణిస్తాము’. ఇక్కడ కూడా ఇంతకు ముందు పైన చెప్పబడిన భావాలే ప్రస్ఫుటమవుతాయి; అయితే ఈ పదాలు సాయంకాలము పలుకబడతాయి. కనుక ఈ పదాలు పలుకునపుడు దాసుడు “ఓ అల్లాహ్! నీ ద్వారా మేము సాయంకాలము లోనికి ప్రవేశించినాము; జీవితాన్ని ప్రసాదించేవాడా! నీ నామము ద్వారా మేము జీవిస్తున్నాము; మరియు మరణాన్ని ప్రసాదించేవాడా! నీ నామము ద్వారా మేము మరణిస్తాము. (వ ఇలైకన్నుషూర్) మరియు నీ వైపునకే మా పునరుథ్థానము కూడా. మరణము తరువాత పునరుథ్థానము; సమీకరించబడిన తరువాత (కర్మానుసారం) వేరు చేయబడడం, సర్వకాల సర్వావస్థలలో మా స్థితి ఇదే; నేను ఆయన నుంచి వేరు కాను, మరియు ఆయనను విడిచి పెట్టను.
మరియు మధ్యాహ్నము తరువాత సాయంత్రము వచ్చినపుడు (అంటే అస్ర్ తరువాత) ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు: (అల్లాహుమ్మ బిక అమ్’సైనా, వబిక అస్బహ్’నా, వబిక నహ్యా, వబిక నమూతు, వఇలైకల్ మసీర్) ఓ అల్లాహ్! నీ ద్వారా మేము సాయంత్రం లోనికి ప్రవేశించినాము; మరియు నీ ద్వారా మేము ఉదయం లోనికి ప్రవేశించినాము, మరియు నీ ద్వారా మేము జీవిస్తున్నాము మరియు నీ ద్వారా మేము మరణిస్తాము మరియు అంతిమ గమ్యం కూడా నీవైపునకే. ఈ లోకం లోనికి రావడం, మరియు పరలోకము లోనికి తిరిగి వెళ్ళడం అంతా నీ ద్వారానే, ఎందుకంటే నీవే నాకు జీవనాన్ని ఇచ్చే వాడవు, మరియు నీవే నాకు మరణాన్ని ఇచ్చేవాడవు.