عَنْ عَبْدِ اللَّهِ بْنِ عَمْرِو بْنِ الْعَاصِ رضي الله عنهما أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يَدْعُو بِهَؤُلَاءِ الْكَلِمَاتِ:
«اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ غَلَبَةِ الدَّيْنِ، وَغَلَبَةِ الْعَدُوِّ، وَشَمَاتَةِ الْأَعْدَاءِ».
[صحيح] - [رواه النسائي وأحمد] - [سنن النسائي: 5475]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ ఇబ్న్ అల్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ పదాలతో దుఆ చేసేవారు:
“అల్లాహుమ్మ ఇన్నీ అఊదుబిక మిన్ ఘలబతిద్దైని, వ గలబతిల్ అ’దువ్వి, వ షమామతిల్ అ’దాఇ”
(ఓ అల్లాహ్! అప్పుల భారం నన్ను అధిగమించకుండా నేను నీ నుండి రక్షణ కోరుతున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను, శత్రువు నన్ను అధిగమించకుండా నేను నీ నుండి రక్షణ కోరుతున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను, మరియు శత్రువు యొక్క ఈర్ష్యాసూయల నుండి, నా దురదృష్టాల పట్ల ఆనందించడం నుండి నేను నీ నుండి రక్షణ కోరుతున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను)
[దృఢమైనది] - - [سنن النسائي - 5475]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయాల నుండి అల్లాహ్ యొక్క రక్షణ మరియు శరణు వేడుకున్నారు:
మొదటిది: (అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మిన్ గలబతిద్దైని) ఓ అల్లాహ్ నేను రక్షణ మరియు ఆశ్రయం కోరుతున్నాను, కేవలం నీ నుంచి, మరింకెవ్వరి నుంచీ కాదు, అప్పుల ఆధిపత్యం నుంచి, అవి నన్ను లొంగదీసుకోవడం నుంచి, వాటి వలన కలిగే దుఃఖము మరియు బాధ నుంచి. మరియు వాటిని తిరిగి చెల్లించడంలో మరియు వాటిని పరిష్కరించడంలో నీ సహాయాన్ని అడుగుతున్నాను.
రెండవది: (వ గలబతిల్ అదువ్వి): ) ఓ అల్లాహ్! నేను నీ రక్షణ మరియు శరణు వేడుకుంటున్నాను – శత్రువు నన్ను అధిగమించడం నుండి, ఆ భారము నుండి, అతడి అణచివేత నుండి. మరియు అతని వలన జరిగే హానిని తొలగించమని, మరియు అతనిపై విజయం ప్రసాదించమని నేను నిన్ను అడుగుతున్నాను.
మూడవది: (వ షమామతిల్ అ’అదాయి) శత్రువుల ఈర్ష్యాసూయలనుండి మరియు ముస్లింలకు సంభవించిన దురదృష్టం మరియు విపత్తుల పట్ల వారు ఆనందించడం నుండి నేను నీ నుండి రక్షణ కోరుతున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను.