+ -

عَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ رضي الله عنهما قَالَ: كَانَ مِنْ دُعَاءِ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«اللهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ زَوَالِ نِعْمَتِكَ، وَتَحَوُّلِ عَافِيَتِكَ، وَفُجَاءَةِ نِقْمَتِكَ، وَجَمِيعِ سَخَطِكَ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2739]
المزيــد ...

అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఇలా ఉల్లేఖించినారు: “ఇది రసూలిల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం దుఆలలో ఒకటి:
“అల్లాహుమ్మ ఇన్నీ అఊదుబిక మిన్ జవాలి ని’మతిక, వతహవ్వులి ఆ’ఫియతిక, వ ఫుజాఅతి నిఖ్’మతిక, వజమీఅ సఖతిక” (ఓ అల్లాహ్! (నా నుండి) నీ అనుగ్రహాలు, నీ ఆశీర్వాదాలు తొలగిపోవుట నుండి, మరియు (నాకు నీవు ప్రసాదించిన) సౌఖ్యము, క్షేమము మార్చివేయబడుట నుండి, మరియు హఠాత్తుగా నీ నుండి వచ్చిపడే విపత్తు నుండి, మరియు మొత్తంగా నీ ఆగ్రహం నుండి నిన్ను ఆశ్రయిస్తున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను.)

[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2739]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాలుగు విషయాల నుండి అల్లాహ్ శరణు వేడుకున్నారు:
మొదటిది: (అల్లాహుమ్మ, ఇన్నీ అఊదుబిక మిన్ జవాలి ని’మతిక): ఓ అల్లాహ్! నా నుండి, ధార్మికపరమైన మరియు ప్రాపంచిక పరమైన నీ అనుగ్రహాలు, నీ ఆశీర్వాదాలు తొలగిపోవుట నుండి నీ శరణు వేడుకుంటున్నాను; ఇస్లాంలో స్థిరంగా ఉండడానికి, నీ ఆశీర్వాదాలను, నీ అనుగ్రహాలను దూరం చేసే పాపాలలో పడకుండ ఉండడానికి నిన్ను ఆశ్రయిస్తున్నాను.
రెండవది: (వతహవ్వులి ఆ’ఫియతిక): మరియు నీవు నాకు ప్రసాదించిన సౌఖ్యము, క్షేమము, విపత్తుగా మార్చి వేయబడకుండా నీ శరణు వేడుకుంటున్నాను, నిన్ను ఆశ్రయిస్తున్నాను, కనుక ఓ అల్లాహ్! నిరంత శ్రేయస్సు కొరకు, బాధలు, కష్టాలు మరియు అనారోగ్యం నుండి భద్రత కొరకు నిన్ను వేడుకుంటున్నాను.
మూడవది: (వ ఫుజాఅతి నిఖ్’మతిక) మరియు హఠాత్తుగా నీ నుండి వచ్చి పడే నీ ఆగ్రహం, నీ విపత్తు నుండి నేను నీ రక్షణ, నీ ఆశ్రయం కోరుతున్నాను. ఎందుకంటే హఠాత్తుగా వచ్చి పడే విపత్తు, జరిగిన తప్పుల నుండి, పాల్బడిన పాపపు పనుల నుండి పశ్చాత్తాప పడే సమయాన్ని లేదా వాటి నుండి కోలుకునే అవకాశాన్ని ఇవ్వదు. అది ఆ వ్యక్తికి కలిగించే కష్టము, బాధ, నష్టము అత్యంత గొప్పది, బాధాకరమైనది అయి ఉంటుంది.
నాలుగవది: (వ జమీఅ సఖతిక) మరియు మొత్తంగా నీ ఆగ్రహం నుండి ఆశ్రయిస్తున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను, అంతేగాక నీ ఆగ్రహానికి కారణమయ్యే అన్ని విషయాల నుండి కూడా నీ శరణు వేడుకుంటున్నాను, ఎందుకంటే నీవు ఎవరి పట్ల ఆగ్రహించినావో వారు విఫలమయ్యారు మరియు ఓడిపోయారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ఆగ్రహానికి సంబంధించి బహువచనాన్ని ఉపయోగించినారు “జమీఅ” (మొత్తంగా నీ ఆగ్రహం నుండి) అని. సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క ఆగ్రహానికి కారణమయ్యే అన్ని విషయాలు, అవి మాటలు గానీ, లేక ఆచరణలు గానీ, లేక అల్లాహ్ యొక్క ఆగ్రహానికి కారణమయ్యే (అంధ) విశ్వాసాలు గానీ, మొత్తంగా, పూర్తిగా అందులో వస్తాయి.

من فوائد الحديث

  1. ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంపూర్ణంగా అల్లాహ్ పైననే తన భరోసాను, ఆయనను మాత్రమే ఆశ్రయించి ఉండడాన్ని గమనించవచ్చు.
  2. శుభప్రదమైన ఈ దుఆలో ఈ విషయాలు ఉన్నాయి: అల్లాహ్ ప్రసాదించిన శుభాలకు, ఆయన ఆశీర్వాదాలకు ఆయనకు కృతజ్ఞులై ఉండుటలోనే మానవుని సాఫల్యము, మరియు పాపకార్యములలో పడకుండా రక్షణ ఉన్నది, ఎందుకంటే పాపకార్యములు శుభాలకు, ఆశీర్వాదాలకు దూరం చేస్తాయి.
  3. ప్రతి వారూ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క ఆగ్రహానికి గురి చేసే వాటిని నివారించాలనే ఆసక్తి, పట్టుదల కలిగి ఉండాలి.
  4. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హఠాత్తుగా నుండి వచ్చి పడే విపత్తు నుండి అల్లాహ్ యొక్క రక్షణ, ఆశ్రయం కోరుకున్నారు. ఎందుకంటే అల్లాహ్ యొక్క ఆగ్రహం, తద్వారా ఏదైనా విపత్తు హఠాత్తుగా ఆయన దాసునిపై వచ్చి పడితే, ఆ దాసుడు ఘోరమైన దురదృష్టానికి గురవుతాడు. దానిని అతడు ఏ విధంగానూ తొలగించలేడు. అతడే కాదు ఈ సృష్టి మొత్తం ఏకమైనా దానిని తొలగించలేరు.
  5. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సర్వోన్నతుడైన అల్లాహ్ ప్రసాదించిన సౌఖ్యము, క్షేమము మార్చి వేయబడుట నుండి అల్లాహ్ యొక్క శరణు వేడుకున్నారు. ఎందుకంటే అల్లాహ్ మానవునికి తన కరుణతో క్షేమము, సౌఖ్యము ప్రసాదించి నట్లయితే అతడు రెండు లోకాల (ఇహలోకము, మరియు పరలోకము) మంచిని, శుభాన్ని గెలుచుకున్నట్లే. ఒకవేళ అది అతడి నుండి తీసుకోబడినట్లయితే అతడు రెండు లోకాలలో చెడును మూటగట్టుకున్నట్లే. ఎందుకంటే అల్లాహ్ నుండి వచ్చే క్షేమము, శ్రేయస్సు, సౌఖ్యము అతడి ధార్మిక మరియు ప్రాపంచిక వ్యవహారాల దృఢత్వాన్ని సూచిస్తుంది.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం థాయ్ జర్మన్ పష్టో అస్సామీ الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية الرومانية المجرية الموري Урумӣ الجورجية
అనువాదాలను వీక్షించండి
ఇంకా