+ -

عَنْ عَائِشَةَ أُمِّ المُؤْمِنينَ رضي الله عنها أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَلَّمَهَا هَذَا الدُّعَاءَ:
«اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ الْخَيْرِ كُلِّهِ، عَاجِلِهِ وَآجِلِهِ، مَا عَلِمْتُ مِنْهُ وَمَا لَمْ أَعْلَمْ، وَأَعُوذُ بِكَ مِنْ الشَّرِّ كُلِّهِ، عَاجِلِهِ وَآجِلِهِ، مَا عَلِمْتُ مِنْهُ وَمَا لَمْ أَعْلَمْ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ خَيْرِ مَا سَأَلَكَ عَبْدُكَ وَنَبِيُّكَ، وَأَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا عَاذَ بِهِ عَبْدُكَ وَنَبِيُّكَ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الْجَنَّةَ، وَمَا قَرَّبَ إِلَيْهَا مِنْ قَوْلٍ أَوْ عَمَلٍ، وَأَعُوذُ بِكَ مِنْ النَّارِ، وَمَا قَرَّبَ إِلَيْهَا مِنْ قَوْلٍ أَوْ عَمَلٍ، وَأَسْأَلُكَ أَنْ تَجْعَلَ كُلَّ قَضَاءٍ قَضَيْتَهُ لِي خَيْرًا».

[صحيح] - [رواه ابن ماجه وأحمد] - [سنن ابن ماجه: 3846]
المزيــد ...

ఆయిషా (రదియల్లాహు అన్హా) తనకు రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దుఆ నేర్పించినారని ఉల్లేఖిస్తున్నారు:
“అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఖైరి కుల్లిహి, ఆ’జిలిహి, వ ఆజిలిహి, మా అలింత మిన్హు మాలం, అ’అలం; వ అఊజుబిక మిన్ షర్రి కుల్లిహి ఆ’జిలిహి, వ ఆజిలిహి, మా అలింత మిన్హు మాలం, అ’అలం; అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఖైరి మా సఅలక అబ్దుక వ నబియ్యుక; వ అఊజుబిక మిన్ షర్రి మా అజాబిహి అబ్దుక వ నబియ్యుక; అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ జన్నత, వమా ఖర్రబ ఇలైహ మిన్ ఖౌలిన్ అవ్ అమలిన్; వ అఊజుబిక మినన్నారి, వమా ఖర్రబ ఇలైహ మిన్ ఖౌలిన్ అవ్ అమలిన్; వ అస్అలుక అన్’తజ్’అల కుల్ల ఖదాయిన్ ఖదైతహు లీ ఖైరన్”. (ఓ అల్లాహ్! నేను ప్రతి శుభాన్ని ప్రసాదించమని నిన్ను అడుగుతున్నాను, అది త్వరగా (సమీప భవిష్యత్తులో) రాబోయేదైనా, లేక ఆలస్యంగా రాబోయేదైనా, దానిని గురించిన ఙ్ఞానము నాకు ఉన్నా, లేకపోయినా; మరియు ప్రతి చెడు నుండి, ప్రతి కీడు నుండి, వినాశం కలిగించే ప్రతి దాని నుండి నీ రక్షణ కోరుతున్నాను, అది త్వరగా (సమీప భవిష్యత్తులో) రాబోయేదైనా, లేక ఆలస్యంగా రాబోయేదైనా, దానిని గురించిన ఙ్ఞానము నాకు ఉన్నా, లేకపోయినా; ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీప్రవక్త నిన్ను కోరిన మంచి కొరకు నేను నిన్ను అడుగుతున్నాను మరియు నీ సేవకుడు మరియు ప్రవక్త శరణు కోరిన చెడు నుండి నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను, నీ రక్షణ కోరుతున్నాను; ఓ అల్లాహ్! నేను నిన్ను స్వర్గం కొరకు అడుగుతున్నాను, మరియు దానికి చేరువ చేసే మాటలు మరియు ఆచరణల కొరకు కూడా; నరకాగ్ని నుండి నీ రక్షణ కోరుతున్నాను మరియు దానికి చేరువ చేసే మాటలు మరియు ఆచరణలనుండి కూడా. మరియు (ఓ అల్లాహ్!) నీవు నా కొరకు నిర్ణయించిన ప్రతి ఉత్తర్వును, ప్రతి ఆదేశాన్ని, నా కొరకు మంచిదిగా చేయమని నేను నిన్ను అడుగుతున్నాను.)

[దృఢమైనది] - - [سنن ابن ماجه - 3846]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా (రదియల్లాహు అన్హా) కు సమగ్రమైన దుఆలను నేర్పించినారు, అవి నాలుగు దుఆలు:
మొదటిది: సాధారణంగా అంతా మంచి జరగాలని కోరుకుంటూ చేసే దుఆ (అల్లాహుమ్మ, ఇన్నీ అస్అలుక మిన్ ఖైరి కుల్లిహి) – ఓ అల్లాహ్! నేను ప్రతి శుభాన్ని ప్రసాదించమని నిన్ను అడుగుతున్నాను; అది సమీప భవిష్యత్తు లోనిదైనా, లేక చాలా దూరంగా ఉన్నదైనా, దానిని గురించిన ఙ్ఞానము నాకు ఉన్నదైనా (నీవు నాకు బోధించినది అయినా), దానిని గురించిన ఙ్ఞానము నాకు లేకపోయినా (అది కేవలం నీ ఙ్ఞానపరిధి లోనిది అయినా), ఓ అల్లాహ్! నీవు పరమ పవిత్రుడవు, ఘనత అంతా నీకే చెందును. ఇందులో, అన్ని విషయాల ఙ్ఞానం కలవాడు, సర్వజ్ఞుడు, అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్’కు విషయాన్ని అప్పగించడం వలన మహిమాన్వితుడైన అల్లాహ్ ముస్లిం కోసం ఉత్తమమైనది మరియు అత్యంత శ్రేష్ఠమైనది ఎంపిక చేస్తాడు. అందుకని నేను ఆయన క్షమాభిక్షను గట్టిగా పట్టుకుని ఆయన ఆశ్రయం పొందుతాను - ప్రతి చెడు నుండి, ప్రతి కీడు నుండి, వినాశం కలిగించే ప్రతి దాని నుండి, అది త్వరగా (సమీప భవిష్యత్తులో) రాబోయేదైనా, లేక ఆలస్యంగా రాబోయేదైనా, దానిని గురించిన ఙ్ఞానము నాకు ఉన్నా, లేకపోయినా.
రెండవ దుఆ: ఇది దుఆలో అతిక్రమించకుండా ముస్లింకు ఒక రక్షణ వంటిది (అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక) ఓ అల్లాహ్! నేను నిన్ను అడుగుతున్నాను, మరియు కోరుతున్నాను (మిన్ ఖైరి మా సఅలక అబ్దుక వ నబియ్యుక) నీ దాసుడు మరియు నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిన్ను కోరిన మంచినంతా; (వ అఊదు) మరియు నీ రక్షణ కోరుతున్నాను, నీ ఆశ్రయం కోరుతున్నాను, వేడుకుంటున్నాను - నీ దాసుడు మరియు నీ ప్రవక్త రక్షణ ప్రసాదించమని, నీ ఆశ్రయం ప్రసాదించమని కోరిన చెడు నుండి, కీడు నుండి. ఇది అల్లాహ్ తరఫు నుండి ఒక దుఆ, ఒక ప్రార్థన, దుఆ చేయు వ్యక్తికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన కొరకు ఏదైతే ప్రార్థించినారో, అవి ఏమిటి అనే వివరణలు ఏవీ లేకుండా, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రార్థించిన వాటినన్నింటినీ, దుఆ చేయు వ్యక్తికి ప్రసాదించుటకు గాను.
మూడవ దుఆ: స్వర్గములో ప్రవేశింపజేయుట కొరకు మరియు నరకాగ్ని నుండి దూరంగా ఉంచుట కొరకు చేయు దుఆ. ఇది ప్రతి ముస్లిం యొక్క కోరిక మరియు అతని ఆచరణలన్నింటి లక్ష్యం. (అల్లాహుమ్మ ఇన్నీ అస్అలౌకల్ జన్నహ్) ఓ అల్లాహ్! నేను స్వర్గము కొరకు నిన్ను అడుగుతున్నాను. దానిని సాధించాలని, మరియు దానికి చేరువ చేసే మరియు నిన్ను సంతోష పరిచే ప్రతి మంచి మాట, ప్రతి మంచి పని కొరకు నిన్ను అడుగుతున్నాను. (వ అఊజుబిక మినన్నార్) మరియు నరకాగ్ని నుండి నీ రక్షణ మరియు శరణు కోరుతున్నాను – ఎందుకంటే చెడు పనుల నుండి నీ కరుణ, మరియూ కృప తప్ప వేరే రక్షణ లేదు; (వమా ఖర్రబ ఇలైహ మిన్ ఖౌలిన్ అవ్ అమలిన్) అలాగే నరకాగ్నికి చేరువ చేసే ప్రతి పలుకు మరియు ప్రతి పని నుండి కూడా (నీ రక్షణ మరియు శరణు కోరుతున్నాను).
నాలుగవ దుఆ: అల్లాహ్ తీర్పు పట్ల, ఆయన అదేశాల సంతృప్తి కొరకు దుఆ, ప్రార్థన (వ అస్అలుక అన్’తజ్అల్ కుల్ల ఖదాఇన్, ఖదైతహు ఖైరన్) మరియు (ఓ అల్లాహ్!) నీవు నా కోరకు నిర్ణయించిన ప్రతి ఉత్తర్వును, ప్రతి ఆదేశాన్ని, నా కొరకు మంచిదిగా చేయమని నేను నిన్ను అడుగుతున్నాను. ఇది అల్లాహ్ యొక్క ప్రతి తీర్పు, ప్రతి ఆదేశం పట్ల తృప్తి కోసం చేయు దుఆ, ప్రార్థన.

من فوائد الحديث

  1. ఒక వ్యక్తి తన కుటుంబానికి, ధర్మానికి మరియు ఈ ప్రాపంచిక జీవితానికి సంబంధించి ఏది లాభదాయకమో దానిని తప్పనిసరిగా బోధించాలి; ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా (రదియల్లాహు అన్హా) కు ఈ దుఆను నేర్పించినట్లుగా.
  2. ఒక ముస్లిం కొరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఉల్లేఖించబడిన దుఆలను కంఠస్థం చేయుట మంచిది, ఎందుకంటే అవి అత్యంత సమగ్రమైన దుఆలు.
  3. ఉలమాలు (ధర్మ పండితులు) ఈ హదీథును గురించి ఇలా అన్నారు: మంచిని ప్రసాదించమని, మరియు చెడునుండి రక్షణ ప్రసాదించమని వేడుకునే దుఆలను గురించిన హదీథులలో ఇది అత్యంత సమగ్రమైన హదీథు; ఎందుకంటే అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు నేర్పించిన అత్యంత సమగ్రమైన పదాలతో కూడినది.
  4. అల్లాహ్ అనుగ్రహం తర్వాత స్వర్గంలో ప్రవేశించడానికి గల కారణాలలో ఒకటి: ధర్మబద్ధమైన పనులు మరియు మంచి మాటలు.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ జర్మన్ పష్టో అస్సామీ الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية الرومانية المجرية الموري Урумӣ الجورجية
అనువాదాలను వీక్షించండి
ఇంకా