عَنْ أَبَانَ بْنِ عُثْمَانَ قَالَ: سَمِعْتُ عُثْمَانَ ابْنِ عَفَّانَ رضي الله عنه يَقُولُ: سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«مَنْ قَالَ بِسْمِ اللَّهِ الَّذِي لَا يَضُرُّ مَعَ اسْمِهِ شَيْءٌ، فِي الْأَرْضِ، وَلَا فِي السَّمَاءِ، وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ، ثَلَاثَ مَرَّاتٍ، لَمْ تُصِبْهُ فَجْأَةُ بَلَاءٍ، حَتَّى يُصْبِحَ، وَمَنْ قَالَهَا حِينَ يُصْبِحُ ثَلَاثُ مَرَّاتٍ، لَمْ تُصِبْهُ فَجْأَةُ بَلَاءٍ حَتَّى يُمْسِيَ»، قَالَ: فَأَصَابَ أَبَانَ بْنَ عُثْمَانَ الْفَالِجُ، فَجَعَلَ الرَّجُلُ الَّذِي سَمِعَ مِنْهُ الْحَدِيثَ يَنْظُرُ إِلَيْهِ، فَقَالَ لَهُ: مَا لَكَ تَنْظُرُ إِلَيَّ؟ فَوَاللَّهِ مَا كَذَبْتُ عَلَى عُثْمَانَ، وَلَا كَذَبَ عُثْمَانُ عَلَى النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، وَلَكِنَّ الْيَوْمَ الَّذِي أَصَابَنِي فِيهِ مَا أَصَابَنِي غَضِبْتُ فَنَسِيتُ أَنْ أَقُولَهَا.
[صحيح] - [رواه أبو داود والترمذي والنسائي في الكبرى وابن ماجه وأحمد] - [سنن أبي داود: 5088]
المزيــد ...
అబాన్ ఇబ్న్ ఉథ్మాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “నేను (నా తండ్రి) ఉథ్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) ఇలా పలుకగా విన్నాను: “నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా విన్నాను:
“ఎవరైతే (సాయంత్రం పూట) మూడుసార్లు “బిస్మిల్లా హిల్లదీ లాయదుర్రు మఅస్మిహి షైఉన్, ఫిల్ అర్ది, వలా ఫిస్సమాఇ, వహువస్సమీఉల్ అలీం” (అల్లాహ్ పేరుతో; ఎవరి పేరు ప్రస్తావించబడినపుడైతే, భూమిలోనూ, మరియు ఆకాశాలలోనూ ఉన్న దేదీ హాని కలిగించలేదో; ఆయన అన్నీ వినేవాడు, సర్వఙ్ఞుడు) అని పలుకుతాడో, అతడు ఉదయం వరకు ఏ ఆకస్మిక హానికి గురికాడు. మరియు ఎవరైతే ఈ పదాలను ఉదయం పలుకుతాడో, అతడు సాయంత్రం వరకు ఏ ఆకస్మిక హానికి గురికాడు.” (ఇది విని అక్కడే ఉన్న వ్యక్తి, పక్షవాతానికి గురి అయి ఉన్న అబాన్ ఇబ్న్ ఉథ్మాన్ (ర) ను చూడసాగినాడు, దానితో ఆయన అతనితో) “ఎందుకలా చూస్తున్నావు నా వైపు? అల్లాహ్ సాక్షిగా, నేను ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ (ర) పట్ల అబద్ధం చెప్పలేదు, అలాగే ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ (ర) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల అబద్ధం చెప్పలేదు. ఏ రోజైతే నాకు ఈ పక్షవాతం వచ్చిందో, ఆ రోజు నేను కోపంలో ఉండి ఈ మాటలు పలుకడం మర్చిపోయాను” అన్నారు.
[ప్రామాణికమైన హదీథు] - [అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ కుబరా, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:] - [సునన్ అబీదావూద్ - 5088]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించినారు: ప్రతి రోజు ఉదయం, తెల్లవారుజామున, మరియు ప్రతి సాయంత్రం, సూర్యాస్తమయానికి ముందు మూడు సార్లు: (బిస్మిల్లా హిల్లదీ లాయదుర్రు మఅస్మిహి షైఇన్ ఫిల్ అర్ది వలా ఫిస్సమాఇ, వహుస్సమీఉల్ అలీం) అని పలుకుతాడో - అంటే (బిస్మిల్లాహి – అల్లాహ్ పేరుతో) నేను రక్షణ కోరుతున్నాను, (మఅస్మిహి) ఆయన పేరు పలికినంతనే (ఫిల్ అర్ది) భూమిపై ఉన్నది ఏదైనా, ఎంత పెద్దదైనా, లేక భూమి నుండి పుట్టుకు వచ్చే ఏ కీడు అయినా సరే, అలాగే (వలా ఫిస్సమాఇ) అలాగే ఆకాశాలలోని కీడులలో నుండి ఏ కీడు అవతరించినా (లాయదుర్రు) హాని కలిగించలేదు, (వహువస్సమీఉల్ అలీం) ఆయనే మనం మొరపెట్టుకునేదంతా వినేవాడు, మరియు మన పరిస్థితుల, స్థితిగతుల సంపూర్ణ ఙ్ఞానము కలవాడు – అని పలుకుతాడో; అతనికి అకస్మాత్తుగా కలిగే ఏ కీడూ హాని కలిగించదు.
ఎవరైతే తాను నిద్రించడానికి పక్క పైకి చేరే ముందు ఈ వాక్యాలు ఉచ్ఛరిస్తాడో ఉదయం వరకు అతనిపై అకస్మాత్తుగా ఏ కీడూ, ఏ హానీ వచ్చి పడదు. అలాగే ఎవరైతే ఉదయం నిద్ర లేచినపుడు ఈ వాక్యాలను ఉచ్ఛరిస్తాడో సాయంత్రం వరకు అతనిపై అకస్మాత్తుగా ఏ కీడూ, ఏ హానీ వచ్చి పడదు.
ఈ హదీథు ఉల్లేఖించిన అబాన్ ఇబ్న్ ఉథ్మాన్ (ర) పక్షవాతముతో బాధపడుతూ ఉండినారు. ఆయన శరీరంలో ఒక పార్శ్వము సాగిల పడినట్లుగా ఉండేది. ఆయన ఈ హదీథు ఉల్లేఖించినపుడు అక్కడే ఉన్న వ్యక్తి అబాన్ ఇబ్న్ ఉథ్మాన్ వైపునకు ఆశ్చర్యంగా చూడసాగినాడు. దాంతో ఆయన ఆ వ్యక్తితో “ఎందుకలా నావైపు చూస్తున్నావు? అల్లాహ్ సాక్షిగా నేను ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ పట్ల అబద్ధం చెప్పలేదు; ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ (ర) కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల అబద్ధం చెప్పలేదు. నాకు ఈ పక్షవాతం సంభవించిన దినమున నేను ఈ వాక్యములు పలకాలని అల్లాహ్ రాసిపెట్టలేదు. ఆ దినము నేను కోపంలో ఉండి ఈ వాక్యములు పలకడం మరిచిపోయాను” అన్నారు.