عن أبي مسعود رضي الله عنه قال: قال النبي صلى الله عليه وسلم:
«مَنْ قَرَأَ بِالْآيَتَيْنِ مِنْ آخِرِ سُورَةِ الْبَقَرَةِ فِي لَيْلَةٍ كَفَتَاهُ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5009]
المزيــد ...
అబూ మస్’ఊద్ అల్ బద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు:
“ఎవరైతే రాత్రి వేళ (పడుకోబోయే ముందు) సూరతుల్ బఖరహ్ యొక్క చివరి రెండు ఆయతులు (వచనాలు) పఠిస్తాడో అది అతనికి సరిపోతుంది.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 5009]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరైతే రాత్రి (నిద్రించడాని ముందు) సూరతుల్ బఖరహ్ యొక్క ఆఖరి రెండు ఆయతులు పఠిస్తాడో, అల్లాహ్ అతనికి కీడు నుంచి, మరియు అయిష్టమైన ప్రతి విషయము నుంచి సరిపోయేలా (రక్షణ) చేస్తాడు, అని తెలియజేస్తున్నారు. దీనిపై వ్యాఖ్యానిస్తూ కొంతమంది ఉలమా ఇలా అభిప్రాయపడ్డారు “సరిపోయేలా చేస్తాడు అంటే – ఆ రెండు ఆయతులను అతని రాత్రి నమాజు (తహజ్జుద్) కు సరిపోయేలా చేస్తాడు”; మరి కొంతమంది ఉలమా “(ఆరాత్రి అతడు చేయ దలచిన) ఇతర రకాల ఆరాధనలకు సరిపోయేలా చేస్తాడు అని అర్థము” అన్నారు; మరికొంతమంది ఉలమా “ఆ రెండు ఆయతులు, రాత్రి నమాజు కొరకు (ఖియాముల్లైల్) తక్కువలో తక్కువగా సరిపోయే ఆయతులు” అన్నారు. ఇంకా వేర్వేరు అభిప్రాయాలు, విశ్లేషణలు కూడా ఉన్నాయి. అయితే, గమనించవలసిన విషయం ఏమిటంటే పైన తెలుపబడిన అభిప్రాయాలు అన్నీ కూడా సరియైనవే, విలువైనవే, ఎందుకంటే ఆ వాక్యము (సరిపోయేలా చేస్తాడు) పరిధిలోనికి ఇవన్నీ కూడా వస్తాయి.