عن أبي هريرة رضي الله عنه مرفوعاً: «ليس شيءٌ أكرمَ على الله من الدعاء».
[حسن] - [رواه الترمذي وابن ماجه وأحمد]
المزيــد ...
అబూ హురైర రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం’అల్లాహ్ వద్ద దుఆ కంటే ఎక్కువ గౌరవప్రదమైన విషయం (ఆరాధన) మరొకటి లేదు’.
ప్రామాణికమైనది - దాన్ని ఇబ్నె మాజ ఉల్లేఖించారు
(“అల్లాహ్ ఎదుట దుఆ కంటే గొప్ప గౌరవనీయమైన విషయం మరొకటిలేదు”) ఎందుకంటే ఇది ఆరాధన,ఆ ఆరాధన నిమిత్తమే మహోన్నతుడైన అల్లాహ్ సృష్టిని నిర్మాణం చేశాడు,దుఆ అల్లాహ్ యొక్క శక్తిసామర్ద్యాలు మరియు ఆయన జ్ఞానపరిధిని సూచిస్తుంది,దుఆ వేడుకునేవాడి బలహీన అసమర్ధత,అవసరాన్ని సూచిస్తుంది అంచేత మహోన్నతుడు సర్వశక్తిమంతుడు అల్లాహ్ ఎదుట ఈ దుఆ అన్నివిషయాల్లోకెల్లా అత్యంత గౌరవనీయమైన విషయం.