عن النعمان بن بَشِير رضي الله عنه قال: سمعت النبيَّ صلى الله عليه وسلم يقول:
«الدُّعَاءُ هُوَ الْعِبَادَةُ»، ثُمَّ قَرَأَ: «{وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ إِنَّ الَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِي سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ} [غافر: 60]».
[صحيح] - [رواه أبو داود والترمذي وابن ماجه وأحمد] - [سنن الترمذي: 3247]
المزيــد ...
అన్నో’మాన్ బిన్ బషీర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను:
“దుఆ (అల్లాహ్ ను వేడుకొనుట) యే అసలు ఇబాదత్ (ఆరాధన)” తరువాత ఆయన ఈ ఆయతును పఠించినారు:
{“మరియు మీ ప్రభువు ఇలా అన్నాడు: "నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను.నిశ్చయంగా, ఎవరైతే నా ప్రార్థనల పట్ల దురహంకారం చూపుతారో, వారు తప్పక అవమానితులై నరకంలో ప్రవేశించగలరు".} [గాఫిర్ 40:60]
[దృఢమైనది] - - [سنن الترمذي - 3247]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “దుఆ (అల్లాహ్ ను వేడుకొనుట) యే అసలు ఇబాదత్ (ఆరాధన)” అని వివరిస్తున్నారు. కనుక ఇందులో అందరూ విధిగా చేయవలసిన విషయం ఏమిటంటే, అల్లాహ్’కు మనస్ఫూర్తిగా దుఆ చేయాలి – అది తనకు మేలు చేసే ఏదైనా విషయాన్ని గురించి అల్లాహ్’ను వేడుకొనుట గానీ లేక తనకు కీడు కలిగించే ఏదైనా విషయాన్ని దూరం చేయమని వేడుకొనుట గానీ – అది ఈ ప్రాపంచిక జీవితాన్ని గురించి గానీ లేక పరలోక జీవితాన్ని గురించి గానీ లేక అది మన ఆరాధనలో భాగంగా ఉచ్ఛరించే స్త్రోత్రపు పదాలు, వాక్యాలు గానీ. ఇవి మనస్ఫూర్తిగా చేయబడితే అల్లాహ్ వీటిని ఇష్టపడతాడు. అవి మాటలు గానీ, చేతలు గానీ, అలాగే హృదయం యొక్క ఆరాధనలు గానీ, భౌతికమైన ఆరాధనలు గానీ లేక ఆర్థిక పరమైన ఆరాధనలు గానీ ఏవైనా కావచ్చు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీనిని “అల్లాహ్ ఇలా పలికినాడు” అని ఈ ఆయతును పఠించి దాని నుంచి గ్రహించినారు: {“మరియు మీ ప్రభువు ఇలా అన్నాడు: "నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను. నిశ్చయంగా, ఎవరైతే నా ప్రార్థనల పట్ల దురహంకారం చూపుతారో, వారు తప్పక అవమానితులై నరకంలో ప్రవేశిస్తారు".} [గాఫిర్ 40:60]