عَنْ أَبِي الدَّرْدَاءِ رضي الله عنه: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«إِنَّ اللَّعَّانِينَ لَا يَكُونُونَ شُهَدَاءَ وَلَا شُفَعَاءَ يَوْمَ الْقِيَامَةِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2598]
المزيــد ...
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతూ ఉండగా తాను విన్నానని, అబూ దర్దాఅ రదియల్లాహు అన్హు ఉల్లేఖించినారు:
నిశ్చయంగా, శాపాలు పెట్టేవారు ప్రళయదినాన సాక్షులుగా గానీ, మధ్యవర్తులుగా గానీ ఉండరు.
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2598]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: 'ఎవరైతే అమాయకులపై తరుచుగా శాపాలు పెడతారో, వారు రెండు శిక్షలకు పాత్రులవుతారు. మొదటి శిక్ష: ప్రళయ దినాన అతడు ప్రవక్తలు, సందేశహరులు తమ తమ జాతులకు దైవసందేశాలను అందజేసారని సాక్ష్యం ఇచ్చే అర్హత కోల్పోతాడు. అంతేగాక, అతడి దుష్టత్వం వలన ఇహలోకంలోనూ అతడి సాక్ష్యం అంగీకరించబడదు. అలాగే అతడికి 'షహాదత్' (అల్లాహ్ మార్గంలో ధర్మయుద్ధం చేస్తూ మరణించే భాగ్యం) లభించదు. రెండవ శిక్ష: ప్రళయ దినాన విశ్వాసులు (ముస్లింలు) నరకానికి అర్హులైన తమ సోదరుల కొరకు మధ్యవర్తన చేసే సమయంలో, ఈ శపించే వ్యక్తి (లాఅిన్) ఎవరికీ మధ్యవర్తన చేయడానికి అనుమతించబడడు.