+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَا جَلَسَ قَوْمٌ مَجْلِسًا لَمْ يَذْكُرُوا اللَّهَ فِيهِ وَلَمْ يُصَلُّوا عَلَى نَبِيِّهِمْ إِلاَّ كَانَ عَلَيْهِمْ تِرَةً، فَإِنْ شَاءَ عَذَّبَهُمْ وَإِنْ شَاءَ غَفَرَ لَهُمْ».

[صحيح] - [رواه أبو داود والترمذي والنسائي في الكبرى] - [سنن الترمذي: 3380]
المزيــد ...

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
ఎవరైనా ఒక సభలో కూర్చుని, ఆ సభలో అల్లాహ్‌ను స్మరించకపోతే మరియు తమ ప్రవక్తపై దురూద్ పంపకపోతే, అది వారి మీద బాధగా (పాపంగా, నష్టంగా) అవుతుంది. అల్లాహ్‌ తన ఇష్ట ప్రకారం వారిని శిక్షించవచ్చు లేదా క్షమించవచ్చు.

[దృఢమైనది] - - [سنن الترمذي - 3380]

వివరణ

అల్లాహ్ స్మరణ (జిక్ర్) ను నిర్లక్ష్యం చేయకూడదని ప్రవక్త ﷺ హెచ్చరించారు. ఎవరైనా ఒక సమూహంగా సభలో కూర్చుని, ఆ సభలో అల్లాహ్‌ను స్మరించకపోతే మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దురూద్ పంపకపోతే — ఆ సభ (సమావేశం) ప్రళయదినం నాడు వారి కొరకు బాధగా, పశ్చాత్తాపంగా, నష్టంగా, లోటుగా మారుతుంది. అల్లాహ్‌ కు ఇష్టమైతే, వారి గత పాపాల వల్ల, వారు చేసిన తప్పుల వల్ల వారిని శిక్షించవచ్చు. లేదా ఆయన తన అనుగ్రహం, దయ, కరుణల వలన వారిని క్షమించవచ్చు.

من فوائد الحديث

  1. అల్లాహ్ స్మరణ గురించి ప్రోత్సాహం మరియు దాని మహిమ
  2. మహోన్నతుడైన అల్లాహ్‌ను మరియు ఆయన ప్రవక్త ﷺ ను స్మరించే సమావేశాలకు ఎంతో గొప్ప గౌరవం (పుణ్యం) ఉంది. మరియు అల్లాహ్‌ నూ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నూ స్మరించని సభలు, ప్రళయదినాన అందులో పాల్గొన్న వారికి అపశకునంగా (నష్టంగా, బాధాకరంగా) మారతాయి.
  3. అల్లాహ్‌ను జ్ఞాపకం చేయకుండా నిర్లక్ష్యం చేయడాన్ని (గఫ్లత్) హెచ్చరించే హెచ్చరికలు కేవలం సభలకు మాత్రమే పరిమితం కావు; ఇది ప్రజలు గుమిగూడి ఉండే అన్ని చోట్లకూ వర్తిస్తుంది.
  4. ఇమాం నవవీ (رَحِمَهُ اللهُ) చెప్పారు: మనిషి ఎక్కడ కూర్చున్నా, ఆ ప్రదేశం విడిచి పెట్టే ముందు అల్లాహ్‌ ను కనీసం ఏదో రూపంలో జ్ఞాపకం చేయడం ముస్తహబ్ (ఉత్తమం), అంటే — అల్లాహ్‌ ను స్మరించకుండా అక్కడి నుండి వెళ్లకూడదు.
  5. ప్రళయదినాన వారికి కలిగే పశ్చాత్తాపం (హస్రహ్): అది రెండు కారణాల వల్ల ఉండవచ్చు: అల్లాహ్‌ విధేయతలో కాలాన్ని ఉపయోగించకపోవడం వలన - వారు పొందగలిగిన పుణ్యాలు, బహుమతులు కోల్పోవడం వల్ల పశ్చాత్తాపం కలుగుతుంది. ఇక రెండవది ఆ సమయాన్ని అల్లాహ్‌ ఆజ్ఞలకు వ్యతిరేకంగా – పాపాల్లో గడపడం వలన - వారు పాపబాధలను, శిక్షను భరించాల్సి వచ్చే పరిస్థితి ఉండవచ్చు.
  6. ఈ హెచ్చరికలు సాధారణ సభలలో (అల్లాహ్ జిక్ర్ నుండి) జరిగే నిర్లక్ష్యం గురించి ఇంత తీవ్రంగా ఉన్నాయంటే, మరి అనవసరమైన పిచ్చాపాటి సంభాషణలు, అశ్లీల మాటలు, నిందలు, చాడీలు వంటి పాపాలు జరిగే హరామ్ సభల గురించి మనం ఎంత గట్టిగా జాగ్రత్త పడాలి!?
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం థాయ్ అస్సామీ الهولندية الغوجاراتية الرومانية المجرية الموري الجورجية المقدونية
అనువాదాలను వీక్షించండి
ఇంకా