عن جابر رضي الله عنه قال: سمعت رسول الله صلى الله عليه وسلم يقول: «أفضل الذِّكر: لا إله إلا الله».
[حسن] - [رواه الترمذي والنسائي في الكبرى وابن ماجه]
المزيــد ...

జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తున్నారు ‘నేను మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఉపదేశిస్తుండగా విన్నాను అత్యున్నతమైన స్మరణ/జపము ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ‘{వాస్తవానికి అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు}
ప్రామాణికమైనది - దాన్ని ఇబ్నె మాజ ఉల్లేఖించారు

వివరణ

మహనీయదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తెలియజేశారు : స్మరణల్లోనే అత్యంత ఘనత కలిగినది :కలిమా “లా ఇలాహ ఇల్లల్లాహ్”ఒక హదీసులో ఉల్లేఖించబడినది –అత్యంత ఘనత కలిగిన కలిమా నేను మరియు నాకు ముందు ప్రవక్తలు పలికిన కలిమా “లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్దహూ లా షరీక లహూ”నిశ్చయంగా ఇది ఒక గొప్ప కలిమా దీని కొరకు భూమ్యాకాశాలు నిర్మించబడ్డాయి మరియు దీని కొరకు సమస్త జీవరాశులు సృష్టించబడ్డాయి,దానితో పాటుగా సమస్త ప్రవక్తలు ప్రభవించబడ్డారు,దానికొరకు గ్రంధాలు అవతరించబడ్డాయి,షరీఅతు రూపకల్పన జరిగింది,దాని కొరకు కొలమానాలు స్థాపించబడ్డాయి,కర్మల పత్రాలు సిద్దం చేయబడ్డాయి ,దాని కొరకే స్వర్గం నరకం ఏర్పాటు జరుగుతుంది,-ఈ కలిమా యొక్క అర్ధం : అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్య దైవం లేదు”దీనికి ఏడు షరతులు ఉన్నాయి : జ్ఞానం,నమ్మకం,స్వీకరణ,విధేయత,సత్యం,చిత్తశుద్ది మరియు ప్రేమ-గతించినవారిని మరియు రాబోయే వారిని ప్రతీ ఒక్కరినీ ప్రశ్నించబడుతుంది,దాసుని పాదాలు అల్లాహ్ ఎదుట నుండి రెండు ప్రశ్నలకు జవాబు చెప్పనంతవరకు కదలవు,ఒకటి ‘నువ్వు ఎవరిని ఆరాధించావు మరియు నువ్వు ప్రవక్తల పిలుపు కు ఎలా స్పందించావు?మొదటి ప్రశ్నకు సమాధానం –లా ఇలాహ ఇల్లల్లాహ్’యొక్క జ్ఞానం,స్వీకరణ మరియు దాని ప్రకరంగా కార్యసాధన చేయడం,రెండవ ప్రశ్నకు సమాధానం: “అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్” దీని జ్ఞానం,స్వీకరణ మరియు విధేయత చూపడం,మహనీయ దైవప్రవక్త సల్లాలల్లాహు అలైహివ సల్లమ్ వారు తెలియజేశారు {ఇస్లాం ఐదు అంశాలపై ఆధారపడియున్నది-లా ఇలాహ ఇల్లల్లాహ్ మరియు ముహమ్మద్ రసులుల్లాహ్ అని సాక్ష్యం ఇవ్వడం...}

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ జర్మన్ జపనీస్
అనువాదాలను వీక్షించండి

ప్రయోజనాలు

  1. నిశ్చయంగా ‘కలిమ ఎ తౌహీద్’ పదాల్లో కెల్లా గొప్ప కలిమా,ఎందుకంటే అందులో ఏకత్వాన్ని నిరూపిస్తూ సమస్త భాగస్వాములను ఖండించడం జరిగింది,ఆ కలిమా ప్రవక్తలంతా భోదించారు,దాని కొరకు వారు ప్రభవింప చేయబడ్డారు,దాని ఉద్దేశ్య వ్యాప్తికై పోరాటాలు జరిపారు,దాని మార్గంలో అమరగతి పొందారు, ఆ కలిమా ఎ స్వర్గానికి తాళపుచెవి మరియు నరకం నుండి మోక్షం.
ఇంకా