+ -

عَنْ حَارِثَةَ بْنِ وَهْبٍ الخُزَاعِيِّ رضي الله عنه قَالَ: سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«أَلاَ أُخْبِرُكُمْ بِأَهْلِ الجَنَّةِ؟ كُلُّ ضَعِيفٍ مُتَضَعِّفٍ، لَوْ أَقْسَمَ عَلَى اللَّهِ لَأَبَرَّهُ، أَلاَ أُخْبِرُكُمْ بِأَهْلِ النَّارِ: كُلُّ عُتُلٍّ جَوَّاظٍ مُسْتَكْبِرٍ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 4918]
المزيــد ...

హారిథా ఇబ్న్ వహ్బ్ అల్ ఖుజాఈ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను:
“వినండి! మీకు స్వర్గవాసుల గురించి తెలియజేయనా? ప్రజలు తక్కువగా చూసే ప్రతి బలహీనమైన, పేద మరియు అంతగా ఎవరికీ తెలియని వ్యక్తి; అతడు గనుక అల్లాహ్ మీద ప్రమాణం చేసి ఏదైనా అన్నట్లయితే, అల్లాహ్ దానిని నెరవేరుస్తాడు. వినండి! మీకు నరకవాసుల గురించి తెలియజేయనా? మదమెక్కిన ప్రతి క్రూరుడు, మూర్ఖుడు, పిసినారి మరియు గర్విష్టి నరకంలో ప్రవేశిస్తాడు.”

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 4918]

వివరణ

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గవాసుల మరియు నరకవాసుల కొన్ని లక్షణాలను తెలియజేసినారు.
స్వర్గవాసులలో ఎక్కువగా ఎవరు ఉంటారంటే: “బలహీనులు మరియు వినయవిధేయతలతో ఉండే ప్రతి ఒక్కరూ”; అంటే దాని అర్థం, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు విధేయుడై, వినమ్రుడై, ఆయన ముందు తనను తాను అల్పునిగా భావించుకునే వ్యక్తి; ఎంతగా అంటే కొంతమంది ప్రజలు అతణ్ణి బలహీనుడిగా భావిస్తారు మరియు అతడిని తృణీకరిస్తారు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ముందు వినమ్రుడై ఉండే అటువంటి వ్యక్తి, అల్లాహ్ నుండి ఆయన ఔదార్యాన్ని ఆశిస్తూ, ఒకవేళ అల్లాహ్ పేరున ఏదైనా ప్రమాణం చేస్తే అల్లాహ్ అతడి ప్రమాణాన్ని నెరవేరుస్తాడు, అతడు వేడుకున్న అతని అభ్యర్థనకు, అతడి ప్రార్థనకు సమాధానం ఇస్తాడు.
నరకవాసులలో ఎక్కువ మంది ఎవరు అంటే: “ఉతుల్” అంటే అనాగరికంగా, మొరటుగా, కఠినంగా వ్యవహరించేవాడు, మరియు తీవ్రంగా కలహాలు, తగాదాలు పెట్టుకునే వ్యక్తి; “ఫాహిష్” అంటే అసభ్యంగా, అసహ్యకరంగా ప్రవర్తించేవాడు, అశ్లీల కార్యాలకు పాల్బడేవాడు, మంచికి ఎప్పుడూ విధేయత చూపనివాడు; “జవాజ్” అంటే గర్విష్ఠుడు, తిండిపోతు, దుర్మార్గుడు, పెద్ద శరీరము గలవాడు, తన నడకలో గర్వముతో, నిక్కుతూ, నీల్గుతూ నడిచేవాడు; “ముస్తక్బిర్” అంటే సత్యాన్ని తిరస్కరించేవాడు మరియు ఇతరులను తక్కువగా చూసేవాడు; అహంకారి.

من فوائد الحديث

  1. ఈ హదీథులో స్వర్గవాసుల లక్షణాలను, గుణవిశేషణాలను కలిగి ఉండాలనే ప్రోత్సాహము, అలాగే నరకవాసుల లక్షణాల పట్ల హెచ్చరిక ఉన్నాయి.
  2. సర్వోన్నతుడైన అల్లాహ్’కు, ఆయన ఆదేశాలకు, నిషేధాలకు విధేయత చూపడం, ఆయన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవడం, మరియు అల్లాహ్ యొక్క సృష్ఠితాల పట్ల అహంకారం చూపకపోవడం.
  3. ఇబ్న్ హజర్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: దీని అర్థం ఏమిటంటే, స్వర్గవాసులలో చాలా మంది ఇటువంటివారు ఉంటారు, అలాగే నరకవాసులలో చాలా మంది అటువంటి వారు ఉంటారు; అంతేకానీ, స్వర్గవాసులందరూ ఇటువంటి వారే ఉంటారని, నరకవాసులలో అందరూ అటువంటి వారే ఉంటారని అర్థం కాదు.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ పష్టో అస్సామీ الأمهرية الهولندية الغوجاراتية النيبالية المجرية الجورجية
అనువాదాలను వీక్షించండి
ఇంకా