عَن أَبي سَعِيدٍ الْخُدْرِيِّ رَضِيَ اللَّهُ عَنْهُ أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَنْ قَالَ: رَضِيتُ بِاللَّهِ رَبًّا، وَبِالْإِسْلَامِ دِينًا، وَبِمُحَمَّدٍ رَسُولًا، وَجَبَتْ لَهُ الْجَنَّةُ».
[صحيح] - [رواه أبو داود] - [سنن أبي داود: 1529]
المزيــد ...
అబూ సయీద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
"ఎవరైతే 'నేను అల్లాహ్‌ను నా ప్రభువుగా, ఇస్లాంను నా ధర్మంగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను నా ప్రవక్తగా స్వీకరించాను' అని పలుకుతారో, వారికి స్వర్గం నిశ్చయం."
[దృఢమైనది] - [దాన్ని అబూ దావుద్ ఉల్లేఖించారు] - [سنن أبي داود - 1529]
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపినారు: "ఎవరైతే [నేను అల్లాహ్‌ను - నా ప్రభువుగా, ఆరాధ్యుడిగా, పోషకుడిగా, సర్వాధికారిగా, యజమానిగా, నన్ను సరిదిద్దేవాడిగా మనస్పూర్తిగా (రజా) అంగీకరిస్తున్నాను; ఇస్లాం ధర్మాన్ని — దాని అన్ని ఆజ్ఞలు, నిషేధాలతో సహా — నా ధర్మంగా, నా మార్గంగా, నా విశ్వాసంగా, సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను; అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను నా ప్రవక్తగా, సందేశహరుడిగా, ఆయన తెచ్చిన ప్రతీ విషయాన్ని, ప్రకటించిన ప్రతీ సందేశాన్ని సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను'] అని హృదయపూర్వకంగా ఒప్పుకుంటారో, అతనికి తప్పకుండా స్వర్గం లభిస్తుంది."