عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ:
«مَنْ قَالَ: لاَ إِلَهَ إِلَّا اللَّهُ، وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، لَهُ المُلْكُ وَلَهُ الحَمْدُ، وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ، فِي يَوْمٍ مِائَةَ مَرَّةٍ، كَانَتْ لَهُ عَدْلَ عَشْرِ رِقَابٍ، وَكُتِبَتْ لَهُ مِائَةُ حَسَنَةٍ، وَمُحِيَتْ عَنْهُ مِائَةُ سَيِّئَةٍ، وَكَانَتْ لَهُ حِرْزًا مِنَ الشَّيْطَانِ يَوْمَهُ ذَلِكَ حَتَّى يُمْسِيَ، وَلَمْ يَأْتِ أَحَدٌ بِأَفْضَلَ مِمَّا جَاءَ بِهِ إِلَّا أَحَدٌ عَمِلَ أَكْثَرَ مِنْ ذَلِكَ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 3293]
المزيــد ...

అబూ హురైరాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఎవరైతే ఒక దినములో: “లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హందు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్” (అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేడు; ఆయన ఏకైకుడు, ఆయనకు సాటి ఎవరూ లేరు; రాజ్యము, సార్వభౌమత్వము ఆయనదే; మరియు అన్ని రకాల ప్రశంసలూ కేవలం ఆయనకు మాత్రమే శోభిస్తాయి) అని వందసార్లు ధ్యానం చేస్తాడో అతనికి పది మంది బానిసలను విడిపించిన దానికి సమానమైన ప్రతిఫలం ఉంటుంది; అతని ఖాతాలో వంద మంచి పనులు (పుణ్యాలు) జోడించబడతాయి; అతని వంద పాపాలు తుడిచివేయబడతాయి; మరియు ఆ రోజు సాయంత్రం వరకు అతను షైతాను నుండి రక్షించబడతాడు; సత్కార్యాలు చేయడంలో అతడిని ఎవరూ అధిగమించలేరు – ఎవరైతే అతనికంటే ఎక్కువ మార్లు పలుకుతాడో అతడు తప్ప.”

[ప్రామాణికమైన హదీథు] - [అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు] - [సహీహ్ అల్ బుఖారీ - 3293]

వ్యాఖ్యానము

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: “ఎవరైతే ఇలా పలుకుతాడో: (లా ఇలాహ) ఆరాధనకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేడు, (ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీక లహు) కేవలం అల్లాహ్ తప్ప, ఆయన దైవత్వములో, ఆయన ప్రభుతలో, ఆయన నామములు మరియు గుణవిశేషణాలలో ఆయన ఏకైకుడు, ఆయనకు సాటి, భాగస్వామి, ఆయనకు సమానులు ఎవరూ లేరు; (లహుల్ ముల్క్) సార్వభౌమత్వము కేవలం ఆయనదే; ఆధిపత్యము, నిర్వహణ కేవలం ఆయనదే; (వలహుల్ హందు) ఆయన సృష్టించిన ప్రతి దాని కొరకూ మరియు ఆయన ఆదేశించిన ప్రతిదాని కొరకూ కేవలం ఆయన మాత్రమే సర్వ స్తోత్రాలు, ప్రశంసలకు అర్హుడు; (వహువ అలాకుల్లి షైఇన్ ఖదీర్) మరియు ఆయన అన్ని విషయాలపై అధికారము, ఆధిపత్యము గలవాడు, ఎలాంటి అడ్డంకులు లేదా సాటి లేకుండా, మరియు ఆయన కోరనిది ఏదీ జరగనే జరుగదు. ఎవరైతే ఈ స్మరణను రోజుకు వందసార్లు పఠిస్తాడో, అతనికి అల్లాహ్ వద్ద వంద మంది బానిసలకు బానిసత్వమునుండి విముక్తి కలిగించిన వానికి సమానంగా ప్రతిఫలం లభిస్తుంది; అతని ఖాతాలో వంద మంచి పనులు మరియు స్వర్గంలో హోదాలు నమోదు చేయబడతాయి మరియు వంద పాపాలు, చెడు పనులు తొలగించబడతాయి. ఆ విధంగా వంద సార్లు పఠించడం – షైతాను, అతని ప్రలోభాలు, అతని ఆధిపత్యానికి వ్యతిరేకంగా అతనికి శరణు, రక్షణ, కాపుదల కల్పిస్తుంది, మరియు అతనికి రక్షణ కోటగా ఉంటుంది. పునరుత్థాన దినమున ఎవరూ అతడు తీసుకు వచ్చిన దాని కంటే మెరుగైనది తీసుకు రాలేరు, అయితే అంతకంటే ఎక్కువ చేసి, అంతకు మించి చేసిన (పఠించిన) వ్యక్తి తప్ప.

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

  1. ఈ హదీథులో ఏకేశ్వరోపాసన ప్రకటన యొక్క ఘనత మరియు దాని గొప్ప ప్రతిఫలం వివరించబడింది.
  2. అల్లాహ్ తన దాసులపై చూపిన అనుగ్రహం యొక్క విస్తారత, ఆయన వారికి తన స్మరణను సులభతరం చేయడంలో స్పష్టంగా కనిపిస్తుంది మరియు దానికి ఆయన వారికి గొప్ప ప్రతిఫలాన్ని కూడా నిర్ణయించాడు.
  3. ఒక వ్యక్తి ఈ 'తౌహీద్' (అల్లాహ్ నిజ ఆరాధ్యుడు ఎవరూ లేడు) ప్రకటనను ఒక రోజులో వంద సార్లకు పైగా పఠించినట్లయితే, అతడు పఠించిన మొదటి వంద సార్లకు గానూ హదీథులో పేర్కొన్న ప్రతిఫలాన్ని పొందుతాడు మరియు అతను దానికి మించి ఏమి జోడించినా దానికి అదనపు ప్రతిఫలాన్ని కూడా పొందుతాడు. ఇది హద్దులు నిర్దేశించబడి, ఆ హద్దులు దాటడం నిషేధించబడిన దాని క్రిందకు రాదు. అలాగే వందసార్లకు మించి పఠించినది విలువ లేకుండా లేక వృధాగా పోదు.
  4. ఇమాం అల్-నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఈ హదీథు యొక్క స్పష్టమైన అర్థం ఏమిటంటే, ఈ హదీథులో ప్రస్తావించబడిన ప్రతిఫలం రోజుకు వంద సార్లు పఠించిన వానికి లభిస్తుంది, అతను దానిని ఏకధాటిగా పఠించినా లేదా ఒక రోజులో విడిగా సమయం దొరికినపుడల్లా పఠించి పూర్తి చేసినా లేదా దానిలో కొంత భాగాన్ని రోజు ప్రారంభంలో మరియు కొంత భాగాన్ని రోజు చివరిలో పఠించినా. అయితే, రోజు ప్రారంభంలో ఒకేసారి మొత్తం వంద సార్లు పఠించడం మంచిది, ఎందుకంటే అది రోజంతా రక్షణగా ఉపయోగపడుతుంది.
అనువాదాలను చూపించండి
భాష: الإنجليزية الإندونيسية البنغالية ఇంకా (29)
ఇంకా