عَنِ أبي زُهير عُمَارَةَ بْنِ رُؤَيْبَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صلى الله عليه وسلم:
«لَنْ يَلِجَ النَّارَ أَحَدٌ صَلَّى قَبْلَ طُلُوعِ الشَّمْسِ وَقَبْلَ غُرُوبِهَا»
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 634]
المزيــد ...
అబూ జుహైర్ ఉమారహ్ ఇబ్న్ రుఐబహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఎవరైతే సూర్యుడు ఉదయించడానికి ముందున్న నమాజును (సలాహ్’ను) మరియు సూర్యుడు అస్తమించడానికి ముందున్న నమాజును ఆచరిస్తాడో అతడు నరకాగ్నిలోనికి ప్రవేశించడు
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 634]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఎవరైతే ఫజ్ర్ మరియు అస్ర్ నమాజులను ఆచరిస్తారో, మరియు ఆ నమాజులను ఆచరించుటలో స్థిరత్వాన్ని కలిగి ఉంటారో వారు నరకాగ్నిలోనికి ప్రవేశించరు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రెండు నమాజులను ఎందుకు ప్రత్యేకించినారు అంటే, అవి (విశ్వాసులపై) భారమైనవి (గా చూడబడతాయి); ఎందుకంటే ఫజ్ర్ నమాజు సమయమున అతడు తన గాఢ నిద్రను ఆనందిస్తుంటాడు; అస్ర్ నమాజు సమయమున అతడు తన దైనందిన వ్యవహారాలు, వ్యాపారం మొదలైన వాటిలో మునిగి ఉంటాడు. కనుక కఠినంగా, భారంగా ఉన్నప్పటికీ ఎవరైతే ఈ రెండు నమాజులను వదలకుండా ఆచరిస్తాడో, అతడు మిగతా నమాజులను తేలికగా ఆచరిస్తాడు.